సిద్ధార్థ్ ‘మహాసముద్రం’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

April 17, 2021 at 11:12 am

ఆర్ఎక్స్ 100 చిత్ర డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా మూవీ మహాసముద్రం. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈరోజు యాక్టర్ సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా మహాసముద్రం మూవీ నుండి హీరో సిద్ధార్థ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ లో చాలా సాధారణ యువకుడిలా కనిపిస్తున్నాడు సిద్ధార్థ్. ఇక పోతే సిద్ధార్థ్ చాలాకాలం తరువాత నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఈ చిత్రం ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సిద్ధార్థ్ ‘మహాసముద్రం’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts