పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్లో హిట్ అయిన `పింక్`కు రీమేక్. దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై సూపర్ టాక్‌తో దూసుకుపోతోంది.
కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం దుమ్ము దులిపేస్తోంది. ఇదిలా ఉంటే.. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు ఇలా ఏదో ఒక విషయంలో ఈ చిత్రానికి మొదటి నుంచి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. అయితే ఈ సారి వకీల్ సాబ్పై ఐపీఎల్ దెబ్బ పడింది.
ఇటీవలే మొదలైన ఐపీఎల్ మ్యాచులు వకీల్ సాబ్ ఈవెనింగ్ షోలకు గండి కొట్టడం ప్రారంభం అయ్యినట్టు తెలుస్తుంది. దీంతో వకీల్ సాబ్ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడనుంది. అందుకే చిత్ర యూనిట్ కాస్త నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది.