వివాదాల్లో చిక్కుకున్న జో బైడెన్ కుమారుడు..!?

April 11, 2021 at 3:14 pm

అమెరికా అధ్యక్షుడు అయిన జో బైడెన్ కొడుకు హంటర్ బిడెన్ ప‌లు వివాదాల్లో పడ్డాడు. లక్షలాది డాలర్లు దుబారాగా హంటర్ ఖర్చు చేసినట్లు పలు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాల్‌గర్ల్స్, డ్రగ్స్, లగ్జరీ వాహనాల పై తాను ఖర్చు చేయడం వీటిలో ఉన్నాయి. హంటర్ ల్యాప్‌టాప్ నుంచి వచ్చిన సమాచారం ద్వారా ఈ సంగతులు వెలుగులోకి వ‌చ్చాయి.

హంటర్ బిడెన్ కు డైలీ మెయిల్‌కు 103,000 టెక్స్ట్ సందేశాలు, 1.54 లక్షల ఈ-మెయిల్స్, హంటర్ ల్యాప్‌టాప్‌ల నుంచి 2 వేలకు పైగా ఫొటోలు నిపుణుల ద్వారా బ‌య‌ట‌ పడాయి. వాటి ద్వారా హంట‌ర్ దుబారాగా ఖ‌ర్చుచేయ‌డంలో ధిట్ట అని తెలిసింది. అతను పోర్స్చే 2014 లో ఆడి 2018 లో ఫోర్డ్ రాప్టర్ ట్రక్, 80,000 డాల‌‌ర్ల విలువ చేసే పడవ, రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్, బీఎమ్‌డబ్ల్యూ, చేవ్రొలెట్ ట్రక్కులతో పాటు అనేక లగ్జరీ వాహనాలను కొనుగోలు చేసాడు. స్ట్రిప్పర్స్, కాల్ గర్ల్స్ కోసం మిలియన్ డాలర్లు ఖర్చు చేసిన‌ట్లు హంట‌ర్ ‌పై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

వివాదాల్లో చిక్కుకున్న జో బైడెన్ కుమారుడు..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts