త్రివిక్ర‌మ్ వ‌ర్సెస్ కొర‌టాల‌..ఎన్టీఆర్ ఓటు ఎవ‌రికో?

April 12, 2021 at 8:30 am

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ సినిమా ఏ డైరెక్ట‌ర్‌తో చేస్తాడ‌న్న‌ ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది.

గ‌త కొంత కాలంగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. కొర‌టాల శివ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి సినిమా కొర‌టాల‌తోనే చేస్తాడ‌ని వార్త‌లు ఊపందుకున్నాయి.

దీంతో అంద‌రిలోనూ స‌స్పెన్స్ నెల‌కొంది. అయితే ఈ స‌స్పెన్స్‌కు నేడే తెర ప‌డ‌నుంది. ఎన్టీఆర్ ఏ డైరెక్ట‌ర్‌కు ఓటేశారో మ‌రి కొన్ని గంట‌ల్లో తేలిపోనుంది. ఈ రోజు సాయంత్రం ఎన్టీఆర్ 30వ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ ప్ర‌క‌ట‌న కోసం ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

త్రివిక్ర‌మ్ వ‌ర్సెస్ కొర‌టాల‌..ఎన్టీఆర్ ఓటు ఎవ‌రికో?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts