కెరీర్‌లోనే మొద‌టిసారి అలాంటి పాత్ర‌ చేస్తున్న రామ్!?

ఇస్మార్ట్ శంక‌ర్‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఇటీవ‌ల `రెడ్‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఇక ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో రామ్ ఓ సినిమా చేయబోతున్న సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

శ్రీనివాస సిల్వర్ స్క్రిన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇటీవ‌లె పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభమైంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

ఈ చిత్రంలో రామ్‌ దూడుకుమీద ఉండే మాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట‌. ఆ పాత్ర‌ను లింగుస్వామి అద్భుతంగా డిజైన్ చేశాడ‌ట‌. అయితే రామ్ త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు పోలీస్ పాత్ర చేసింది లేదు. ఒక‌వేళ తాజా వార్త నిజ‌మైతే.. ఇన్నేళ్ల కెరీర్‌లో మొద‌టిసారి పోలీస్ పాత్ర చేసిన‌ట్టు అవుతుంది. కాగా, ఈ చిత్రంలో రామ్‌కు జోడీగా కృతి శెట్టి న‌టిస్తోంది.

Share post:

Popular