పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించగా..నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి.. సినిమా గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే పవన్‌పై సైతం ఆసక్తికర కామెంట్స్ చేసింది. అంజలి మాట్లాడుతూ..పవన్‌గారు సెట్స్ లో చాలా కామ్‌గా ఉంటారు. అందరితోనూ మాట్లాడుతారు. డిగ్నిఫైడ్‌గా ఉంటారు. ఆయన వస్తుంటే సెట్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది అని చెప్పుకొచ్చింది.
పవన్ గారితో సినిమా అనగానే జంప్ చేశానని.. కానీ, ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడాలంటేనే నాకు పదిహేను రోజులు పట్టిందని అంజలి పేర్కొంది. ఇక పవన్ గారితో నటించడం మొదట్లో చాలా ఇబ్బందిపడ్డాను. అయితే ఆయన చాలా ఇన్ పుట్స్ ఇస్తూ సినిమా చేయించారు. అవన్నీ చూశాక మన క్యారెక్టర్ మనం సరిగ్గా చేస్తే సరిపోతుంది అనే నమ్మకం వచ్చిందని అంజలి చెప్పుకొచ్చింది.