పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోని కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
పొలిటికల్ ఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడం..అందులోనూ లాయర్ పాత్రలో పవన్ కనిపించడం తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ అంచనాలను అందుకునేందుకు నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రాన్ని సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా థియేటర్లలో చూసేందుకే ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
ఇక తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా భార్య తేజస్వినితో కలిసి థియేటర్‌కు వెళ్లి వకీల్ సాబ్‌ను చూశారు. అంతేకాదు, ఒక సగటు ప్రేక్షకుడిలా పేపర్లు పైకి విసురుతూ థియేటర్లో రచ్చ రచ్చ చేశారు దిల్ రాజు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మొత్తానికి ఆయనను చూస్తుంటే సినిమాను బాగానే ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.