చంద్ర‌బాబు బ‌ర్త్‌డే..చిరు స్పెష‌ల్ విషెస్‌!

తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నేడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ చేయొద్దని స్వయంగా చంద్రబాబే అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.

ఇక చంద్ర‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే మెగా స్టార్ చిరంజీవి కూడా చంద్ర‌బాబుకు స్పెష‌ల్ విషెస్ తెలిపారు.

ఎల్ల‌ప్పుడు శ్రమించే, నిబద్ధత కలిగిన నాయకుడు చంద్రబాబుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. దీంతో చిరంజీవి ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

Share post:

Latest