కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్..ఎందుకంటే..!?

తెలంగాణలో మరలా తిరిగి రాజన్న రాజ్యం రావాలనే నినాదంతో అతి త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల, మరోకసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ‌పై వైఎస్ షర్మిల మండి పడ్డారు . సీఎం జిల్లా అని చెప్పుకొని తిరిగే, మెదక్ జిల్లాలో 20 కరవు మండలాలు ఉండటం చాలా దారుణమని వైఎస్ షర్మిల అన్నారు.

పటాన్ ‌చెరువులో కాలుష్యం కోరలు చూస్తోందని కోపం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. మల్లన్నసాగర్‌కి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేస్తున్నారని ఆమె చెప్పారు. దళితుల దగ్గర భూములు లాక్కుంటున్నారని సీఎం కేసీఆర్ ‌పై ఆమె ఆరోపించారు. అనేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. మళ్ళి తిరిగి రాజన్న సంక్షేమ పాలన తీసుకురావాలని ప్రజలని షర్మిల కోరారు.

Share post:

Latest