అదిరిన `ఆచార్య‌` ఫ‌స్ట్ సింగిల్‌..!

March 31, 2021 at 4:33 pm

మెగాస్టార్ చిరంజీవి, కార‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్‌ను మార్చ్ 31 సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయబోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. చెప్పిన‌ట్టుగానే ఫ‌స్ట్ సింగ్‌ను విడుద‌ల చేశారు.

`లాహే లాహే..` అంటూ సాగే ఈ సాంగ్ అదిరిపోయింద‌ని చెప్పాలి. ఈ సాంగ్‌లో చిరు, కాజ‌ల్ మ‌రియు సంగ‌వి స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టారు. ఇక‌ ఈ సాంగ్‌కు మణిశర్మ స్వరాలు కూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, సాహితి చాగంటి ఆలపించారు.

అదిరిన `ఆచార్య‌` ఫ‌స్ట్ సింగిల్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts