టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, వెంకీ అట్లూరి కాంబోలో వచ్చిన తాజా చిత్రం `రంగ్ దే`. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మార్చి 26న అంటే నిన్ననే ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయింది.
రొటీన్ కథే అయినప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు మరియు ఎంటర్టైన్మెంట్ బాగానే ఉండటంతో.. బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి మూడు రోజుల్లో రూ. 10.11 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన నితిన్.. నాల్గువ రోజు కూడా దంచికొట్టాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా నాల్గొవ రోజు రూ.2.10 కోట్లు షేర్ సాధించింది. కలెక్షన్స్ పెరగడంతో.. నితిన్‌తో పాటు చిత్ర యూనిట్ ఖుషీలో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా మూడో రోజు షేర్ వివరాలు చూస్తే..
నైజాం- 90 లక్షలు
సీడెడ్- 44 లక్షలు
ఈస్ట్- 12 లక్షలు
వెస్ట్- 8 లక్షలు
కృష్ణ- 6.9 లక్షలు
గుంటూరు- 16 లక్షలు
నెల్లూరు- 6 లక్షలు
వైజాగ్- 28 లక్షలు
—————————————
మొత్తంః రూ.2.10 కోట్లు
—————————————