పెళ్లి విష‌యంలో మెహ్రీన్ కీల‌క నిర్ణ‌యం..ఖుషీలో ఫ్యాన్స్‌!

మెహ్రీన్ కౌర్.. త‌ర్వ‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో మెహ్రీన్ ఏడ‌డుగులు న‌డ‌వ‌నుంది.

ఇటీవ‌లె వీరి నిశ్చితార్థం కూడా జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో మెహ్రీన్ పెళ్లెప్పుడు జ‌రుగుతుందా అని అంద‌రిలోనూ ఆస‌క్తి నెలంది. అయితే తాజాగా ఈ విష‌యంలో క్లారిటీ ఇచ్చింది మెహ్రీన్‌. ఈ ఏడాది శీతాకాలంలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోబోతున్న‌ట్టు ఆమె తెలిపింది. అంతేకాదు, పెళ్లి విష‌యంలో మెహ్రీన్ ఓ కీలక నిర్ణ‌యం తీసుకుంద‌ట‌.

త‌న పెళ్లి రెండు సాంప్ర‌‌దాయాల‌లో జ‌ర‌గాల‌ని ఆమె నిర్ణ‌యించుకుంద‌ట‌. అందుకే రెండు రోజుల పాటు త‌మ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని చెప్పుకొచ్చిన మెహ్రీన్ ముందుగా పంజాబీ శైలిలో గురుద్వార్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంద‌ని పేర్కొంది. అనంతరం హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేస్తాన‌ని ఆమె తెలిసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.