ప్ర‌భాస్ కోసం ముగ్గురు హీరోయిన్ల ఫైటింగ్‌

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు యంగ్‌రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. ఇప్పుడు సుజిత్‌ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. సాహో ఫ‌స్ట్ షెడ్యూల్ సైతం అప్పుడే కంప్లీట్ అయ్యింది. విల‌న్ నీల్ నితేష్ దేశ్‌ముఖ్‌పై కొన్ని సీన్లు చిత్రీక‌రించారు. బాహుబ‌లి రిలీజ్ సంద‌ర్భంగా సాహో టీజ‌ర్ సైతం రిలీజ్ చేసేశారు. సాహో టీజ‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది.

సాహో ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినా, టీజ‌ర్ రిలీజ్ అయినా ఇంకా సినిమా హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌లైజ్ కాలేదు. ఇప్ప‌ట‌కీ హీరోయిన్ ఎవ‌ర‌నైది ఫైన‌ల్ కాక‌పోయినా ముగ్గురు హీరోయిన్ల పేర్లు మాత్రం విన‌ప‌డుతున్నాయి. ఈ ముగ్గురు హీరోయిన్ల‌లో ఎవ‌రో ఒక‌రు ఫైన‌లైజ్ అవుతార‌ని తెలుస్తోంది.

ఆ ముగ్గురూ.. అనుష్క, పూజా హెగ్డే, మంజిమా మోహన్‌. ఈ సినిమా హీరోయిన్‌గా అనుష్క పేరు ముందు నుంచి వినిపిస్తోంది. అనుష్క – ప్ర‌భాస్ జోడీ బాహుబ‌లి సినిమాతో దేశ‌వ్యాప్తంగా ఫేమ‌స్ జోడీ అయిపోయారు. ఇక పూజా హెగ్డే పేరు సైతం వినిపిస్తోంది. పూజా నాగ‌చైత‌న్య‌తో ఒక లైలా కోసం త‌ర్వాత ప్ర‌స్తుతం బ‌న్నీతో డీజేలో రొమాన్స్ చేస్తోంది.

ఇక అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌తో సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నటించిన మంజిమా మోహన్‌ పేరు వినిపిస్తోంది. మ‌రి ఈ ముగ్గురు హీరోయ‌న్ల మ‌ధ్య‌లో ఉన్న ప్ర‌భాస్ సాహోలో ఎవ‌రితో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేస్తాడో చూడాలి.