బాబు ప్లాన్‌కి ఆ ముగ్గురూ బ‌లే!!

పాలిటిక్స్‌లో ఆరితేరిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు తిరిగి 2019లోనూ ఏపీలో అధికారంలోకి రావాల‌ని భావిస్తుండ‌డం తెలిసిందే. అయితే, భావ‌న ఉంటే స‌రిపోతుందా? దానికి త‌గిన ప్ర‌య‌త్నం ఉండాలి క‌దా?! అనేవాళ్లు చాలా మందే ఉంటారు. ఈ విష‌యంలో బాబుకు ఎవ‌రూ స‌ల‌హాలు ఇవ్వ‌క్క‌ర్లేదు! 2019 ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి నుంచే ప‌క్కా ప్లాన్‌తో ఉన్న బాబు.. దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో ఎవ‌రు క్రియాశీల‌కంగా మార‌తారో? ఎవ‌రి వ‌ల్ల త‌న ఉనికికి ముప్పు ఉంటుంద‌ని అనుకుంటున్నారో? వారిని, ఆ శక్తుల‌ను చంద్ర‌బాబు అనూహ్యంగా దెబ్బ‌తీస్తున్నారు.

వాస్త‌వానికి 2019లో ఏపీలో ఎన్నిక‌ల‌కు భారీ ఎత్తున పోటీ ఉంటుంది. ఒక ప‌క్క వైకాపా అధినేత జ‌గ‌న్‌, మ‌రోప‌క్క జ‌న‌సేనాని ప‌వ‌న్‌, ఇంకో ప‌క్క మోడీ నేతృత్వంలోని బీజేపీ. వీటితో పోరాడి తిరిగి అధికారం కైవ‌సం చేసుకోవ‌డం అంటే టీడీపీకి అంత వీజీకాదు. అందుకే ఈ పార్టీల‌ను, నేత‌ల‌ను వీక్ చేస్తేనే.. టీడీపీ సైకిల్ ర‌య్య‌న ప‌రిగెడుతుంద‌ని గ్ర‌హించిన బాబు.. ఆదిశ‌గా త‌న ప్ర‌య‌త్నాల‌ను తెర‌చాటుగా ముమ్మ‌రం చేశారు. దీనికి ప‌వ‌న్‌నే పావుగా వినియోగించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఏపీకి ప్ర‌త్యేక హొదా ఇవ్వ‌న‌న్న కేంద్రంతో పోరాడ‌లేన‌ని చెప్పిన బాబు.. ప్యాకేజీతో స‌రిపెట్టుకున్నారు.

దీనిపై ప‌వ‌న్ ఫైర‌య్యారు. అక్క‌డే బాబు త‌న వ్యూహాన్ని అమ‌లు చేశారు. త‌న అనుకూల మీడియాతో.. హోదా త‌ప్పును మోడీ అండ్‌కోల‌పై ప‌డేలా చ‌క్రం తిప్పారు. ఈ వార్త‌ల‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ప‌వ‌న్‌.. బీజేపీ ని టార్గెట్ చేస్తూ.. పెద్ద యుద్ధ‌మే చేస్తున్నారు. దీంతో వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌-బీజేపీల మ‌ధ్య సానుకూల ప‌రిస్థితి ఉండే ఛాన్స్ ఉండ‌దు. ఇక‌, బీజేపీ సొంతంగా ఎదిగితే.. స్టేట్‌లో త‌న‌కు ముప్పు ఉంటుంద‌ని భావించిన బాబు.. బీజేపీ మంత్రి వెంక‌య్య‌ను మ‌చ్చిక చేసుకుని.. బీజేపీలో రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వికి చిచ్చుపెట్టారు. దీంతో ఇప్పుడు.. ఏపీ బీజేపీ నుంచి జంపింగ్‌లు మొద‌ల‌య్యాయి.

ఇక‌, వైకాపా విష‌యానికి వ‌స్తే ఆ పార్టీ నుంచి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో జంపింగ్‌ల‌ను ప్రోత్స‌హించ‌డంతో వైకాపా నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు టీడీపీలోకి వ‌చ్చేశారు. ఈ క్ర‌మంలో వైకాపా రోజు రోజుకు వీక్ అవుతోంది. రైతులు, మ‌త్స్య‌కార్మికుల స‌మ‌స్య‌ల విష‌యంలోనూ ప‌వ‌న్‌ నేరుగా రంగంలోకి దింప‌డం, ఆ వెంట‌నే ఆ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం చూస్తే.. వాళ్లంతా ప‌వ‌న్ వెంటే ఉండేలా ప‌క్కా ప్లాన్‌తో బాబు ముందుకు పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

పోనీ.. ఇన్ని చేస్తున్న‌.. ప‌వ‌న్‌కి రాజ‌కీయంగా బ‌లం చేకూరితే.. బాబు స‌హించ‌లేరు. అందుకే.. ఆయ‌న‌పై మ‌ళ్లీ త‌న అనుకూల మీడియాతో క‌థ‌నాలు వండి వారుస్తున్నారు. ప‌వ‌న్‌కి అంత లేద‌ని, కేవ‌లం కొన్ని ఓట్లు మాత్ర‌మే అదికూడా అధికారాన్ని ప్ర‌భావితం చేసే స్థాయిలో ఏమీ ఉండ‌ద‌ని రాయిస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదంతా బాబు ఆడుతున్న మైండ్ గేమ్‌లో భాగమ‌న్న టాక్ వినిపిస్తోంది.

ఇక‌, దిక్కూమొక్కూలేని వామ‌ప‌క్షాలు ప‌వ‌న్‌ని చేరుకునేలా కూడా బాబే తెర‌వెనుక మంత్రాంగం చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇలా.. బాబు త‌న స్టైల్లో.. ఇటు జ‌గ‌న్‌, అటు బీజేపీ, మ‌ధ్య‌లో ప‌వ‌న్‌ల‌ను ప‌క్క‌కు త‌ప్పించి 2019 నాటికి త‌న సీఎం సీటును భ‌ద్రం చేసుకుంటున్నార‌న్న‌మాట‌!. మ‌రి బాబా మ‌జాకా!!