మెగా మూవీకి కొత్త గ్లామరొచ్చింది.

మెగా మూవీలో హీరోయిన్‌గా కాజల్‌ సెట్స్‌లో సందడి చేస్తోంది. తొలిసారిగా మెగాస్టార్‌తో జోడీ కడుతోంది ముద్దుగుమ్మ కాజల్‌. ఈ ముద్దుగుమ్మకి మెగా ఫ్యామిలీ హీరోలతో అందరితోనూ నటించిన అనుభవం ఉంది. పవర్‌ స్టార్‌, స్టైలిష్‌ స్టార్‌, మెగా పవర్‌ స్టార్‌లతో రొమాన్స్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క మెగాస్టార్‌తో నటించలేదనే వెలితి ఉండేది ఇంతవరకూ. ఆ వెలితి కూడా తీరిపోయింది ఇప్పుడు. మెగా స్టార్‌ రీ ఎంట్రీలో వస్తోన్న తొలి సినిమాలో మెగా హీరోయిన్‌గా ఎంపికైంది కాజల్‌. ఇంతవరకూ హీరోయిన్‌ లేకుండానే షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు హీరోయిన్‌ గ్లామర్‌తో కలకలలాడుతోంది.

సెట్స్‌లో కాజల్‌, చిరంజీవి మీద సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో చిరు పక్కన తనని చూసుకుని ముద్దుగుమ్మ కాజల్‌ ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోతోంది. ‘ఖైదీ నెం 150’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళ్‌ సినిమా ‘కత్తి’కి రీమేక్‌. కాగా తెలుగు వెర్షన్‌లో ఈ సినిమాకి చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. రాంచరణ్‌ తొలి సారిగా నిర్మాతగా మారాడు ఈ సినిమాతో. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి రెప్పాస్స్‌ వస్తోంది. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ సాగే ఆ ఫస్ట్‌లుక్‌లో చిరంజీవి డైరెక్ట్‌గా ఎక్కడా కనిపించకపోయినప్పటికీ అభిమానులు ఆనందోత్సాహాలు చేసుకుంటున్నారు.