జగన్ తరహాలో రేవంత్ రెడ్డి దీక్ష!!

మల్లన్నసాగర్ ప్రాజెక్టు హట్ టాపిక్‌గా మారింది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లో బాగంగా గోదావరి జలాల లను మెదక్, నల్గొండ జిల్లాలకు తరలించాలంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరాల్సిందేనని సర్కార్ స్పష్టం చేస్తుంది. దీనికోసం 14 గ్రామాల నుండి 37 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు సర్కార్ సిద్దపడింది. భూ నిర్వాసితుల కోసం 123 జిఓ కింద పరిహరం చెల్లించాలని నిర్ణియించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన నిర్వాసిత గ్రామాలు మూకుమ్మడిగా ఒక్కట య్యాయి. జెఎసిగా ఏర్పడి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. ప్రభుత్వ అధినేత లకు వినతిపత్రాలు సమర్పిస్తూనే రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన దీక్షలకు ఆయా గ్రామాల ప్రజలు సిద్దమయ్యారు. వీరి ఆందోళనకు మద్దతుగా తెలం గాణ పొలిటికల్ జెఎసి నిలబడింది. 123 జిఓ ప్రకారం పరిహరం ఇచ్చేందుకు తాము వ్యతిరేకమని ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. అంతే కాకుండా చేతకాకుంటే కేసీర్ దిగిపో అని గట్టిగా గద్దించే సరికి తెరాస శ్రేణులు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాయి.సిర్ గారు ఆయా గ్రామాల ప్రజల పోరాటాలకు సంఘీబావం ప్రక టించారు.

ఇక్కడే ఈ అంశం రాజకీయ మలుపు తీసుకుంది. మేల్కొన్న ప్రతిపక్ష పార్టీలు ఒక్కొక్కటిగా రంగంలోకి దిగాయి. రెండు రోజులపాటు ముంపు ప్రాంతాలలో పర్యటించిన కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహరం చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల పాటు టి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి దీక్షలకు సిద్దమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్స చేస్తున్న 2-3 రోజుల దీక్షల వల్ల ఏమి ప్రయోజాను ఒరుగుతున్నాయి మనం చూస్తూనే వున్నాం. అలాంటిది ఇక్కడా రేవంత్ రెడ్డి రెండురోజుల దీక్షకు పూనుకోవడం అందులోనా సర్కార్ పై ఒత్తిడి పెంచే లక్ష్యంతో భారీగా జనసమీకరణ చేసి ఈ దీక్షలు నిర్వహించాలని టి టీడీపీ భావించడం ఏ రకంగానూ ప్రయోజనముండదన్నది నిర్వివాదాంశం . వామపక్ష పార్టీలు, బిజెపిలు కూడ ముంపు నిర్వాసితులకు మద్దతుగా ఆందోళనలు, నిరస నలలో పాల్గొంది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీ యం చేస్తున్నాయని మండిపడ్డ ప్రభుత్వం మల్లన్న సాగర్‌కు అనుకూ లంగా ర్యాలీలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. వంద లాది గ్రామాలకు చెందిన ప్రజలు ఇందులో పాల్గొ న్నారు.

ఇప్పటి వరకు ప్రతిపక్షమే లేకుండా నిర్వీర్యం చేస్తున్న కేసీర్ కి మల్లన్న సాగర్ అంశం పెద్ద తలనొప్పిగా మారింది.ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఏ మేరకు ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం అవుతారో వేచి చూడాల్సిందే.ఇక్కడా ఇంకో వాదన కూడా వినిపిస్తోంది,మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడు కుంటామని మంత్రి హరీశ్‌రావు ప్రకటిం చారు. ప్రజలు కోరుకుంటే 2013 భూ సేకరణ చట్టం ప్రకా రమే పరిహరం ఇచ్చేందుకు సిద్దంగా వున్నామనడం కొసమెరుపు.