పీకే స‌ర్వేలో ఈ టీడీపీ ఎమ్మెల్యేల‌పై యాంటీ రిపోర్ట్ 

`ప్ర‌జ‌ల‌కు నిరంతరం చేరువ‌కావాలి. వారికి అందుబాటులో ఉండాలి. ఏ స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే ప‌రిష్క‌రించాలి` ఇదీ పార్టీ ఎమ్మెల్యేల‌కు సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్న‌మాట‌. ప‌లు స‌ర్వేల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి సెగ‌లు ర‌గులుతున్నాయ‌న్న విష‌యం గ్ర‌హించిన ఆయ‌న ఇలా చెబుతున్నా.. వారు మాత్రం తీరు మార్చుకోవ‌డం లేద‌ట‌. ఇప్పుడు వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఏరికోరి తెచ్చుక‌న్న వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేలోనూ ఇదే ఫ‌లితాలు రావ‌డంతో వైసీపీ శ్రేణులు సంబ‌ర‌ప‌డుతున్నాయి. కేవ‌లం వైసీపీ నేత‌ల […]

న‌లుగురు వైసీపీ ఎంపీ అభ్య‌ర్థులు ఖ‌రారు!

సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు పెట్టి పేరైన దివంగత వైఎస్ కుమారుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌కు సంబంధించి.. మ‌రింత సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యంలో ఉండ‌గానే ఆయ‌న ప్ర‌జ‌ల‌పై న‌వ ర‌త్నాల పేరుతో వ‌రాల జ‌ల్లు కురిపిస్తూ.. ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు.  అదేస‌మ‌యంలో ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డం ఇప్పుడు మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. వైసీపీ త‌ర‌ఫున 2019లో పార్ల‌మెంటుకు పోటీ చేసే అభ్య‌ర్థుల‌పై జ‌గ‌న్ ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు ప్రారంభించేశారు. ఈ […]

సీన్ రివ‌ర్స్ అయ్యేస‌రికి ఏం చేయాలో తెలియ‌క పీకే

2019లో ఎలాగైనా స‌రే ఏపీలో సీఎం సీటును కైవ‌సం చేసుకుని తీరాల‌ని గ‌ట్టి ప‌ట్టుమీదున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ అందుకు త‌గ్గ‌ట్టుగానే అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. బిహార్‌కు చెందిన ఐఐటీయెన్, గ‌తంలో 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌శాంత్ కిశోర్‌ను ఖ‌రీదు ఎక్కువైనా భ‌రాయించి మ‌రీ జ‌గ‌న్ త‌న స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నాడు. వాస్త‌వానికి రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు రెండేళ్ల‌కు పైగానే స‌మ‌యం ఉండ‌గా… పీకే మాత్రం రంగంలోకి దిగిపోయాడు. జ‌గ‌న్‌కి ప‌లు […]

టీడీపీకి మ‌రో షాక్‌… వైసీపీ గూటికి కీల‌క నేత

నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇక్క‌డ గెలుపును ప్ర‌తిష్టాత్మ‌కంగా చంద్ర‌బాబు, జ‌గ‌న్ ఇద్ద‌రు త‌మ టీంను అంతా ఇక్క‌డ మోహ‌రించారు. టీడీపీ నుంచి ఆరుగురు మంత్రులు, 13 మంది ఎమ్మెల్యేల‌ను బాబు ఇక్క‌డ మోహ‌రిస్తే జ‌గ‌న్ ఏకంగా 14 మంది ఎమ్మెల్యేల‌ను వైసీపీ నుంచి రంగంలోకి దించారు. ఇక ఉప ఎన్నిక నోటిఫికేష‌న్‌కు రెండు రోజుల ముందే నంద్యాల‌లో మంచి పేరున్న మాజీ ఎమ్మెల్యే […]

జగన్ చెంతకు ముద్ర‌గ‌డ…ఎంపీగా పోటి అక్కడ నుండే

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పొలిటిక‌ల్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స‌యిపోయిందా? ఆయ‌న ప్ర‌ధాన విప‌క్షం జ‌గ‌న్ పార్టీ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే ఔన‌నే అంటున్నారు తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌కీయ నేత‌లు. విష‌యంలోకి వెళ్తే.. గ‌డిచిన రెండేళ్లుగా ముద్ర‌గ‌డ ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా క‌నిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కాపు ల‌కు రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డంలో చంద్ర‌బాబు తాత్సారం చేస్తున్నార‌ని ఆయ‌న ప‌దే ప‌దే విమ‌ర్శించ‌డ‌మే కాకుండా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ సాధించేందుకు ఆయ‌న అలుపెరుగ‌ని కృషి చేస్తున్నారు. త‌న […]

వైసీపీలోకి మాజీ మంత్రి..!

వైసీపీలోకి మరో సీనియర్ నేత….కీలకనేత చేరబోతున్నారు. గ‌తంలో స‌మైక్యాంధ్ర‌ప్రదేశ్‌కు మంత్రిగా ప‌నిచేసిన స‌ద‌రు కీల‌క నేత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. దీంతో పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మారేందుకు రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌కాశం జిల్లా కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన మానుగుంట మహీధర్ రెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మహీధర్ రెడ్డి మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు […]

2019 నాటికి ప‌శ్చిమ‌లో టీ డీపీ అడ్ర‌స్ గ‌ల్లంతేనా?

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌రిస్థితి వేరు. 2014లో టీడీపీకి ఈ జిల్లా కంచు కోట‌గా ఆదుకుంది. జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సైకిల్ జోరు సాగింది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ మ‌ట్టికొట్టుకు పోయింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకునే తీరిక‌లో తెలుగు త‌మ్ముళ్లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, త‌మ్ముళ్ల మ‌ధ్య కుమ్ములాట‌ల‌తోనే కాలం గ‌డిచిపోతోంది. మాజీ మంత్రి పీత‌ల సుజాత కేంద్రంగా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రొక‌రు […]

మంత్రి పితానిపై వైసీపీ క్యాండెట్ రెడీ!

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో క్యాండెట్ల ఎంపిక గజిబిజి గంద‌ర‌గోళంగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా రోజుల టైం ఉన్నా ఎవ‌రు ఎక్క‌డ పోటీ చేస్తారు ? ఏ నియోజ‌క‌వ‌ర్గం ఎవ‌రికి సేఫ్‌గా ఉంటుంది ? అన్న‌దానిపై ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీకి కంచుకోట‌గా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ అన్ని స్థానాల్లోను క్వీన్‌స్వీప్ చేసేసింది. ఈ ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర వ్య‌తిరేక‌త‌తో కొట్టుమిట్టాడుతోన్న మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ చివ‌రి […]

సెంటిమెంట్ అస్త్రాలతో టీడీపీ, వైసీపీ ఎన్నికల షో!

క‌ర్నూలు జిల్లా నంద్యాల నుంచి 2014లో ఎన్నికైన సీనియ‌ర్ రాజ‌కీయ నేత భూమా నాగిరెడ్డి హ‌ఠాత్తుగా మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ స్థానంలో ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే, గ‌తంలోనూ రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జ‌రిగినా.. అవి ఏక‌గ్రీవంగా జ‌రిగిపోయాయి. ఎవ‌రూ పోటీకి నిల‌బెట్ట‌లేదు. కేవ‌లం సానుభూతితో వాటిని ఏక‌ప‌క్షం చేశారు. కానీ, నంద్యాల విష‌యంలోకి వ‌చ్చేస‌రికి.. మాత్రం అటు అధికార టీడీపీ, ఇటు వైసీపీ నేత‌లు దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా […]