నంద్యాల‌లో చంద్ర‌బాబు ఎలా గెలిచాడో చెప్పిన జ‌గ‌న్‌

నెల రోజులుగా తెలుగు ప్ర‌జ‌లంద‌రిని త‌న వైపు మ‌రల్చుకుంది. టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డి ఏకంగా 27 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్ అక్క‌డ 13 రోజుల పాటు మ‌కాం వేశారు. అయినా ఆ పార్టీ అభ్య‌ర్థి ఘోరంగా ఓడిపోయారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. […]

ఓట‌మికి కార‌ణాలు చెప్పేసిన శిల్పా

నంద్యాల‌లో టీడీపీ జోరు ముందు వైసీపీ ప‌రువు కూడా ద‌క్కించుకులేని ప‌రిస్థితికి దిగ‌జారింది. ఘోర ఓట‌మి ఖ‌రారు కావాడంతో వైసీపీ అభ్య‌ర్థి ఏడో రౌండ్ కౌంటింగ్ ముగిసిన వెంట‌నే నిరాశ‌తో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌న ఓట‌మి అంగీక‌రించారు. టీడీపీ భారీ స్థాయిలో డ‌బ్బులు పంచ‌డంతో పాటు సెంటిమెంట్ బ‌లంగా ప‌నిచేయ‌డం వ‌ల్లే తాను ఓడిపోయిన‌ట్టు ఆయ‌న చెప్పారు. టీడీపీ ఓటుకు రూ. 2 […]

వైసీపీని స్మాష్ చేసేందుకు బాబు మాస్ట‌ర్ ప్లాన్‌

పాలిటిక్స్ అన్నాక ఎత్తులు, పై ఎత్తులు కామ‌న్‌. అయితే, 2050 వ‌ర‌కు ఏపీలో అధికారంలో ఉండాల‌ని గ‌ట్టి నిర్ణ‌యం మీదున్న టీడీపీ అధినేత సీఎం చంద్ర‌బాబు ప్లాన్ మాత్రం అదిరిపోతోంది. సాధార‌ణంగా అంద‌రూ ల‌క్ష్యాలు పెట్టుకుంటారు. కానీ, వ్యూహాలు లేక వాటిని సాధించ‌లేక‌.. చ‌తికిల ప‌డుతుంటారు. కానీ, బాబు అలా కాదు.. 2019 అపై 2024. ఇలా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ల‌క్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆదిశ‌గా దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇప్పుడు అమ‌లు చేస్తున్న […]

నంద్యాల రూర‌ల్ కౌంటింగ్ ఇలా జ‌రిగింది…

తెలుగు రాజ‌కీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్‌లో అధికార టీడీపీ దూసుకుపోతోంది. వైసీపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నంద్యాల రూర‌ల్ మండ‌లంలో వైసీపీకి దిమ్మ‌తిరిగిపోయే షాక్ త‌గిలింది. వైసీపీకి పట్టున్న నంద్యాల రూరల్‌ మండలంలో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక్క‌డ మొత్తం ఐదు రౌండ్ల కౌంటింగ్ జ‌ర‌గ‌గా అన్ని రౌండ్ల‌లోను టీడీపీకి భారీ మెజార్టీ వ‌చ్చింది.\ నంద్యాల రూర‌ల్ మండ‌లం కౌంటింగ్ ముగిసేసరికి టీడీపీకి 31,062, వైసీపీకి 17,927, కాంగ్రెస్‌కు 278 ఓట్లు […]

నంద్యాల రూర‌ల్‌లో వైసీపీ ఆశ నిరాశే

నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్ తొలి రౌండ్ నుంచే అధికార టీడీపీ దూసుకుపోతోంది. మొత్తం 19 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్ప‌టి వ‌ర‌కు 6 రౌండ్ల లెక్కింపు పూర్త‌య్యింది. నంద్యాల రూర‌ల్ మండ‌లంలోని ఐదు రౌండ్ల‌లో టీడీపీకి ఏకంగా 13135 ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. నంద్యాల రూర‌ల్ మండ‌లంతో పాటు గోస్పాడు మండ‌లంపై ముందునుంచి విప‌క్ష వైసీపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఈ రెండు మండ‌లాల మెజార్టీతో తాము గెలుస్తామ‌ని, టౌన్‌లో టీడీపీకి మెజార్టీ వ‌చ్చినా దానిని […]

త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాటీడీపీ నేత‌లు…ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

నంద్యాల ఉప ఎన్నిక ఆది నుంచి అంతం వ‌ర‌కు అనేక ట్విస్టులు, ఉత్కంఠ‌లు, కేసుల న‌మోదు వంటి అనేక అంశాల చుట్టూ తిరిగి.. ఆ నియోజ‌క‌వ‌ర్గాన్నే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎల్లుండే ఈ ఎన్నిక ఫ‌లితం వెల్ల‌డి కానుండ‌డంతో మొత్తం ప్ర‌క్రియ‌కు ఆరోజుతో ఫుల్ స్టాప్ ప‌డుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఇక‌, సోమ‌వారం నాటి లెక్క‌ల‌పై పోలింగ్ ముగిసిన మ‌రుక్ష‌ణం నుంచే బెట్టింగులు మొద‌ల‌య్యాయి. మా అభ్య‌ర్థి గెలుస్తాడంటే.. మా వాడే గెలుస్తాడంటూ.. పెద్ద […]

నంద్యాల‌లో వైసీపీ గెలుపు ఆశ‌లు ఇవే

అవును! ఇప్పుడు ఆపార్టీ నంద్యాల ఉప పోరులో గ్రామాల‌పైనే ఆశ‌లు పెట్టుకుంది. ముఖ్యంగా గోస్పాడు వంటి అతి పెద్ద గ్రామాల‌ను టార్గెట్ చేసుకుని ఆ పార్టీ దూసుకుపోయింది. అదేవిధంగా జ‌గ‌న్ కూడా గ్రామాల్లోనే ప‌ర్య‌ట‌న ఎక్కువ‌గా చేశాడు. దీంతో జ‌గ‌న్ స‌హా అంద‌రూ ఇప్పుడు ఓటింగ్ స‌ర‌ళిపై చ‌ర్చిస్తూ.. త‌మ‌ను దీవించేదీ, అధికారం అప్ప‌గించేదీ ఒక్క గ్రామాలేన‌ని స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారు. ప‌ట్ట‌ణంలో ఎలాగూ టీడీపీ హావా స‌హా.. ప్ర‌భుత్వ అభివృద్ధి అజెండా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో ప‌ట్ట‌ణ […]

బ్రేకింగ్‌: న‌ంద్యాల‌లో శిల్పాపై కాల్పులు

గ‌త నెల‌రోజులుగా ప్ర‌చారంతో హోరెత్తిన క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో పోలింగ్ జ‌ర‌గ‌డంతో అక్క‌డ ప్ర‌స్తుతం ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలింగ్ జ‌రిగిన మ‌రుస‌టి రోజే అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప‌ట్ట‌ణంలోని సూర‌జ్ గ్రాండ్ హోట‌ల్ వ‌ద్ద వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డిపై టీడీపీ వ‌ర్గీయులు కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. మైనార్టీ నేత చింపింగ్‌ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన శిల్పా చక్రపాణిరెడ్డిపై సూరజ్‌ గ్రౌండ్‌ హోటల్‌ వద్ద ఈ కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంది. […]

సీమ పౌరుషం కోసం వైసీపీని గెలిపిస్తారా..!

రాయ‌ల‌సీమ వాసుల‌కు పౌరుషం ఎక్క‌వ‌… సీమ పౌరుషం సీమ‌వాళ్ల‌కు బాగా తెలిసినా మిగిలిన ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్ర‌జ‌లు సీమ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల్లో చూశారు. అక్క‌డ పంతాల‌కు, పౌరుషాల‌కు, ప‌గ‌ల‌కు ప‌ట్టింపులు ఎక్కువ‌. ముఖ్యంగా ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టుపెట్టి బ‌తికేందుకు వారు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. సీమ‌లో చిత్తూరు మిన‌హా క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో ఈ త‌ర‌హా సంస్కృతి ఎక్కువ‌. న‌మ్ముకున్న వాళ్ల కోసం వారు ఎంత‌కైనా వెళ‌తారు. దేనికైనా తెగిస్తారు. తాజాగా జ‌రిగిన నంద్యాల ఉప […]