గన్నవరం రచ్చ..వంశీ టార్గెట్ అదేనా..టీడీపీ హైలైట్!

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ టార్గెట్ గా వైసీపీ దాడులు చేసింది..గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని స్థానిక టి‌డి‌పి నేత విమర్శించారని చెప్పి..వంశీ అనుచరులు టి‌డి‌పి నేత ఇంటిపై, టి‌డి‌పి ఆఫీసుపై దాడికి దిగారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నకు ఎమ్మెల్యే అనుచరుడొకరు ఫోన్‌ చేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత చిన్న ఇంటికెళ్ళి వంశీ అనుచరులు దాడి చేశారు. ఇక దీనిపై ఫిర్యాదు చేసేందుకు టి‌డి‌పి శ్రేణులు పోలీసు స్టేషన్‌కు వెళ్ళాయి. […]

డేంజర్ జోన్‌లో ఉత్తరాంధ్ర మంత్రులు..ఆ ఇద్దరు సేఫ్?

విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్రలో బలమైన శక్తిగా ఎదగాలని వైసీపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖకు రాజధాని వస్తుందని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఈ రాజధాని కాన్సెప్ట్ తో ఉత్తరాంధ్రలో వైసీపీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చూస్తుంది. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే ఆ పరిస్తితి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ సత్తా చాటింది గాని ఈ సారి ఎన్నికల్లో ఇబ్బంది పడక తప్పదని తెలుస్తోంది. ఈ సారి ఉత్తరాంధ్రలో […]

జగన్‌ని వదలని బీజేపీ..వైసీపీ వివాదాస్పదం!

మహాశివరాత్రి సందర్భంగా వైసీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. బాలశివుడుకు జగన్ పాలు తాగిస్తున్న ఫోటోపై పెద్ద రచ్చ జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా వైసీపీ అధికార సోషల్ మీడియాలో ఆ పోస్టు పెట్టారు. “  అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన.” “ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటూ…శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.” అంటూ పోస్టు పెట్టారు. అయితే అలా జగన్ పాలు తాగిస్తున్నట్లు ఫోటో పెట్టడంపై ఏపీ […]

వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్..జంపింగ్ అప్పుడేనా?

అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నారా? సొంత పార్టీపైనే మరో ఎమ్మెల్యేకు అసంతృప్తి ఉందా? నెక్స్ట్ సీటు దక్కదని తెలియడంతోనే ఆ ఎమ్మెల్యే పార్టీకి దూరం జరుగుతున్నారా? అంటే దర్శిలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గత కొంతకాలంగా వైసీపీలో యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించట్లేదు. ఏదో మొక్కుబడిగానే కార్యక్రమాలు చేయడం తప్ప..గడపగడపకు తిరగడం లేదని తెలిసింది. నెక్స్ట్ ఎన్నికల్లో సీటుపై గ్యారెంటీ లేకపోవడంతోనే మద్దిశెట్టి వైసీపీకి […]

చింత‌ల‌పూడిని వైసీపీ వ‌దులు కోవాల్సిందేనా..?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ టార్గెట్ ఏంటి? అంటే.. నేత‌లు త‌ముడుకోకుండా చెప్పే మాట‌… `వైనాట్ 175` వ‌చ్చే ఎన్నిక‌ల్లో మొత్తంగా గెలిచి.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయాల‌ని.. త‌ద్వారా దేశంలోనే రికార్డును సొంతం చేసుకోవాల‌నేది వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నాయ‌కుల‌ను త‌ర‌చుగా అదిలిస్తు న్నారు.. క‌దిలిస్తున్నారు. హెచ్చ‌రిస్తున్నారు కూడా. ఎందుకు గెల‌వాలో కూడా చెబుతున్నారు. ఈ ఒక్క‌సారి గెలిస్తే.. ఇక మ‌న‌కు 30 ఏళ్ల పాటు తిరుగు ఉండ‌ద‌ని కూడా జ‌గ‌న్ […]

జ‌గ‌న్ ఈ వైసీపీ లీడ‌ర్ల విష‌యంలో ఆ సాహ‌సం చేయ‌లేడా..!

వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. కొన్నికొన్ని విష‌యాల‌ను ఎవ‌రూ త‌ప్పించ‌లేరు. అదే.. కొంద‌రు నేత‌ల‌కు టికెట్లు ఇవ్వ‌డం. వారు ప‌నిచేస్తున్నారా ? చేయ‌డం లేదా ? పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నా రా? వినిపించ‌డం లేదా ? అనేది కూడా ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. వారికి ఖ‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇవ్వాల్సిందే. కానీ, పైకి మాత్రం ఇచ్చేది లేద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యంలో రెండు పార్టీల్లోనూ చ‌ర్చకు వ‌స్తోంది. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ […]

కోటలో పట్టు తప్పుతున్న ‘ఫ్యాన్’..!

వైసీపీకి ఉన్న కంచుకోటల్లో కర్నూలు అసెంబ్లీ కూడా ఒకటి. ఈ కర్నూలు కోటలో వైసీపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించింది..మరి ఈ సారి ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొడుతుందా? అంటే అదే కొంచెం కష్టమనే పరిస్తితి. ఎందుకంటే ఈ సారి కర్నూలు కోటలో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. అసలు గత రెండు ఎన్నికలే ఏదో బోర్డర్ లో గెలిచింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి […]

మూడు కాదు..ఒకటే రాజధాని..వైసీపీ స్ట్రాటజీ!

అధికార వైసీపీ ఏది చేసిన దాని వెనుక రాజకీయం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి కార్యక్రమం వెనుక రాజకీయ ఉద్దేశం ఉంటుంది..ఓ స్ట్రాటజీ ఉంటుందనే చెప్పాలి. ఆ స్ట్రాటజీలో భాగంగానే మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టి‌డి‌పి అధికారంలో ఉండగా అమరావతి రాజధానికి ఓకే చెప్పిన జగన్..అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అన్నారు. అమరావతి శాసనరాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని చెప్పారు. అలా మూడు ప్రాంతాలు అభివృద్ధి […]

గ‌వ‌ర్న‌ర్ విష‌యంలో వైసీపీలో ఇంత టెన్ష‌న్ ఎందుకు ?

ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా రాజ్యాంగ కోవిదుడు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయ‌మూర్తి జస్టిస్ స‌య్య‌ద్ అబ్దుల్ న‌జీర్ ని యమితుల‌య్యారు. నిజానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్ర‌ప‌తి ఆమోద ముద్ర వేశారు. అయి తే.. జ‌స్టిస్ న‌జీర్ నియామ‌కంపై రాష్ట్రంలో అనేక రూపాల్లో చ‌ర్చ సాగుతోంది. ప్ర‌తిప‌క్షాలు.. కొత్త గ‌వ‌ర్న‌ర్ రాక‌తో.. వైసీపీ దూకుడుకు అడ్డుక‌ట్ట ప‌డుతుంద‌ని చెబుతున్నాయి. అయితే.. వైసీపీ మాత్రం త‌మ దారి త‌మ‌దేన‌ని అంటోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అసలు జ‌స్టిస్ న‌జీర్ […]