ఫైర్‌బ్రాండ్‌కు రోజాకు జగన్ క్లాస్ .. దానికి రోజా రియాక్షన్ ..!

జ‌గ‌న్ పార్టీ వైసీపీలో త‌న‌కు ఎదురు లేద‌ని భావించిన ఆ పార్టీ లేడీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు ఇప్పుడు క‌ష్టాలు స్టార్ట‌య్యాయ‌ని అంటున్నారు. అది కూడా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ నుంచేన‌ని స‌మాచారం. త‌న జ‌బ‌ర్ద‌స్త్ దూకుడుతో మీడియాలో ఏదో ఒక కామెంట్ చేసి.. అధికార పార్టీని ఇరుకున పెట్టే.. రోజా.. స‌డెన్‌గా ఇలా పార్టీ అధినేత‌కు దొరికిపోవ‌డం ఏంటి? జ‌గ‌న్‌తో క్లాస్ చెప్పించుకునే స్థాయికి ఎందుకు దిగ‌జారింది? అస‌లేం జ‌రిగింది? అంటే.. స్టార్టింగ్‌లో […]

2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ..!

ఏపీ విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ బాబాయ్, ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధిస్తే తాను మంత్రి అవ్వ‌వ‌చ్చ‌ని ప్లాన్ వేస్తోన్న వైవీ ఈ క్ర‌మంలోనే ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్లానింగ్‌లో ఉన్న‌ట్టు ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం వైవీ.సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్నారు. ఇక వ‌చ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కంతో […]

ఈ ప్ర‌ణాళిక ప్ర‌కారం చేసుకుంటూ వెళితేనే జగన్ విజయం

ఏపీ ప్ర‌జ‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వంపై.. కొంత అసంతృప్తి ఉంది. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా, రైల్వే జోన్‌, రాష్ట్రానికి నిధుల మంజూరు వంటి విష‌యాల్లో కేంద్ర వైఖ‌రి ఎలా ఉన్నా.. టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై కొంత ఆగ్ర‌హం ఉంది. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు త‌రుముకొస్తున్న త‌రుణంలో.. ఈ అసంతృప్తిని, ఆగ్ర‌హాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో ప్ర‌తిపక్ష నేత జ‌గ‌న్‌.. వెనుక‌బ‌డే ఉన్నార‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం! ఉన్న ఈ తక్కువ స‌మ‌యంలోనే.. త‌న వ్య‌వ‌హార శైలి మార్చుకుని.. ప్ర‌జ‌ల్లోకి వెళితే మెరుగైన ఫ‌లితాలు […]

వైసీపీకి ఈ అత్యుత్సాహం ఏంటో

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ ప్రతిపాదిత అభ్య‌ర్థికి త‌మ ఫుల్ల్ స‌పోర్టు ఉంటుందని.. ఎవ‌రిని నిల‌బెట్టినా త‌మ మ‌ద్ద‌తు ఇస్తామ‌ని అన్ని రాజ‌కీయ పార్టీల‌కంటే ముందే చెప్పి ఆశ్చ‌ర్యానికి గురిచేశారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌! రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును బీజేపీ ప్ర‌క‌టించ‌డంతో అంతా అవాక్క‌య్యారు. త‌మ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోదీ స‌హా.. అంతా అన్ని రాష్ట్రాల నేత‌ల‌ను కోరుతున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.. రామ్‌నాథ్‌తో భేటీ అవ్వ‌డం ఇప్పుడు […]

అక్కడ వైసీపీకి దిక్కెవ‌రు?

ప్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న ప‌లువురిని క‌లిచివేస్తోంది! ముఖ్యంగా తెలంగాణ రాజ‌కీయ నేత‌ల‌ను ఉక్కిరిబిక్క‌రికి గురి చేస్తోంది. వైసీపీని జ‌గ‌న్ వ‌దిలేశారా? అంటూ త‌మ‌లో తాము ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఉమ్మ‌డి ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌కీయ పార్టీ వైసీపీ. ముఖ్యంగా కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అత్యంత బ‌లంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డి తెలుగు నేల‌పై సొంతంగా ఏర్ప‌డ్డ పార్టీ కూడా ఇదొక్క‌టే. తాను కోరుకున్న సీఎం ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో […]

ఐవైఆర్ సునామీ… బాబుకు ఝ‌ల‌క్‌..వెనక జరిగిన తతాంగం ఇదేనా..!

ఏపీలో ఇప్పుడు అనూహ్యం, అసాధార‌ణం అన‌ద‌గిన పరిణామాలు వెంట‌వెంట‌నే చోటు చేసేసుకుంటున్నాయి. త‌న మామ‌కు వెన్నుపోటు పోడిచాడు అని విప‌క్షాలు సీఎం చంద్ర‌బాబును త‌ర‌చు విమ‌ర్శిస్తూ ఉంటాయి. దీనిని ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి నేరుగా చంద్ర‌బాబుకు అనుభవంలోకి వ‌చ్చింది. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో బాబు అవాక్క‌యిపోవ‌డం త‌రువాయి అయింది. నిజానికి ఈ ప‌రిణామం ఏ క‌మ్మ‌, కాపు కుల స్తుల నుంచి ఎదురై ఉంటే.. మ‌రో రకంగా ఉండేది. కానీ, బ్రాహ్మ‌ణ కులం […]

నెల్లూరు వైసీపీలో టిక్కెట్ల ర‌గ‌డ‌

వైసీపీకి ముందునుంచి బ‌లంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీలో నాయ‌కుల మ‌ధ్య కాక రేగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం ఉన్న వేళ వైసీపీ పార్టీ బ‌లోపేతానికి గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైసీపీతో పాటు ప్లీన‌రీలు నిర్వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలోనే కావ‌లి నియోజ‌క‌వ‌ర్గ ప్లీన‌రీలో ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లోను కావ‌లి టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డికే ద‌క్కుతుంద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌తాప్‌కుమార్ రెడ్డి క‌ష్ట‌కాలంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు […]

చేతులు క‌లిసినా…మ‌న‌స్సులు క‌ల‌వ‌ని ఎంపీ -ఎమ్మెల్యే

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు ఓ ప్రాధాన్య‌త ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట‌గా ఉంటోన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు చూస్తుంటే ప్ర‌ధాన పార్టీల నాయ‌కుల మ‌ధ్య చేతులు క‌లిసినా…మ‌న‌స్సులు మాత్రం క‌ల‌వ‌డం లేదు. అధికార టీడీపీ విష‌యానికే వ‌స్తే ఇక్క‌డ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీత‌ల సుజాత వ‌ర్గాలు ఉన్నాయి. ఈ రెండు వ‌ర్గాల‌కు అస్స‌లు పొస‌గ‌డం లేదు. ఒక‌రు ఎడ్డెం అంటే మ‌రొక‌రు తెడ్డం అనే […]

క‌ల‌క‌లం: వైసీపీలోకి కేశినేని నాని..!

ఈ వార్త‌లో నిజానిజాలు ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే విజ‌య‌వాడ‌లోని ఓ వ‌ర్గం నాయ‌కులు మాత్రం ఇదే ప్ర‌చారం హోరెత్తించేస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీ చేప‌ట్టిన ఆక‌ర్ష్ దెబ్బ‌కు విప‌క్ష వైసీపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఒక‌రిద్ద‌రు ఎంపీలు సైకిలెక్కేశారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన కొత్త నాయ‌కులు, పాత నాయ‌కుల మ‌ధ్య పొస‌గ‌క పోవ‌డంతో పాత టీడీపీ నాయ‌కులు ఇప్పుడు వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. తాజాగా క‌ర్నూలు జిల్లాలో […]