ఏపీ విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ బాబాయ్, ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారా ? వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే తాను మంత్రి అవ్వవచ్చని ప్లాన్ వేస్తోన్న వైవీ ఈ క్రమంలోనే ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్లానింగ్‌లో ఉన్నట్టు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చలు వినపడుతున్నాయి. ప్రస్తుతం వైవీ.సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందన్న నమ్మకంతో […]
Tag: YS Jagan
ఈ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళితేనే జగన్ విజయం
ఏపీ ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై.. కొంత అసంతృప్తి ఉంది. ఏపీకి ప్రత్యేకహోదా, రైల్వే జోన్, రాష్ట్రానికి నిధుల మంజూరు వంటి విషయాల్లో కేంద్ర వైఖరి ఎలా ఉన్నా.. టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై కొంత ఆగ్రహం ఉంది. రెండేళ్లలో ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో.. ఈ అసంతృప్తిని, ఆగ్రహాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్ష నేత జగన్.. వెనుకబడే ఉన్నారనేది విశ్లేషకుల అభిప్రాయం! ఉన్న ఈ తక్కువ సమయంలోనే.. తన వ్యవహార శైలి మార్చుకుని.. ప్రజల్లోకి వెళితే మెరుగైన ఫలితాలు […]
వైసీపీకి ఈ అత్యుత్సాహం ఏంటో
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థికి తమ ఫుల్ల్ సపోర్టు ఉంటుందని.. ఎవరిని నిలబెట్టినా తమ మద్దతు ఇస్తామని అన్ని రాజకీయ పార్టీలకంటే ముందే చెప్పి ఆశ్చర్యానికి గురిచేశారు వైసీపీ అధినేత జగన్! రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును బీజేపీ ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ సహా.. అంతా అన్ని రాష్ట్రాల నేతలను కోరుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రామ్‌నాథ్‌తో భేటీ అవ్వడం ఇప్పుడు […]
అక్కడ వైసీపీకి దిక్కెవరు?
ప్రస్తుతం ఈ ప్రశ్న పలువురిని కలిచివేస్తోంది! ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నేతలను ఉక్కిరిబిక్కరికి గురి చేస్తోంది. వైసీపీని జగన్ వదిలేశారా? అంటూ తమలో తాము ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విషయంలోకి వెళ్తే.. ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన రాజకీయ పార్టీ వైసీపీ. ముఖ్యంగా కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అత్యంత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే ఢీ అని తలపడి తెలుగు నేలపై సొంతంగా ఏర్పడ్డ పార్టీ కూడా ఇదొక్కటే. తాను కోరుకున్న సీఎం పదవి దక్కకపోవడంతో […]
జగన్ కోట్లు పెట్టి తెచ్చుకున్న పీకే.. బాబుకు జై కొడతాడా..?
ఎట్టి పరిస్థితిలోనూ 2019లో ఏపీలో అధికారం కైవసం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్న వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలో తనకు ఎలక్షన్ సలహాదారుగా ఉత్తరాది నుంచి కోట్లు ఖర్చు పెట్టి మరీ ప్రశాంత్ కిశోర్‌ను దిగుమతి చేసుకున్నాడు. వచ్చీ రావడంతోనే ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ సినారియో మీద ఓ సర్వే చేయించాడు. ప్రభుత్వం, ప్రతిపక్షం బలాబలాలు, జనసేనాని దూకుడు.. కాంగ్రెస్ వామపక్షాల గాలి వంటి వివిధ అంశాలపై ఆయన తన దైన స్టైల్‌లో […]
మోడీ ముందు చేతులెత్తేసిన బాబు-జగన్
ప్రత్యేకహోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిన కేంద్రాన్నిఇరుకునపెట్టే అవకాశాన్ని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ చేజార్చుకున్నాయి. హోదాతో వచ్చేది లేదని, అందులో ఉన్నవన్నీ ప్యాకేజీలో ఉన్నాయని చెబుతున్న టీడీపీ.. హోదా కోసం రెండేళ్లుగా పోరాడుతున్నామని మభ్యపెడుతున్న వైసీపీ.. తమకు ఏపీ ప్రజల ప్రయోజ నాల కంటే తమ సొంత ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి రుజువుచేశాయి. కేంద్రం ఏం చెప్పినా, ఏ నిర్ణయం తీసుకున్నా.. జీహుజూర్ అంటూ తలాడిస్తున్న ఆ పార్టీలు.. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి తమ మద్దతు […]
ఐవైఆర్ సునామీ… బాబుకు ఝలక్..వెనక జరిగిన తతాంగం ఇదేనా..!
ఏపీలో ఇప్పుడు అనూహ్యం, అసాధారణం అనదగిన పరిణామాలు వెంటవెంటనే చోటు చేసేసుకుంటున్నాయి. తన మామకు వెన్నుపోటు పోడిచాడు అని విపక్షాలు సీఎం చంద్రబాబును తరచు విమర్శిస్తూ ఉంటాయి. దీనిని పక్కన పెడితే.. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి నేరుగా చంద్రబాబుకు అనుభవంలోకి వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో బాబు అవాక్కయిపోవడం తరువాయి అయింది. నిజానికి ఈ పరిణామం ఏ కమ్మ, కాపు కుల స్తుల నుంచి ఎదురై ఉంటే.. మరో రకంగా ఉండేది. కానీ, బ్రాహ్మణ కులం […]
నెల్లూరు వైసీపీలో టిక్కెట్ల రగడ
వైసీపీకి ముందునుంచి బలంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీలో నాయకుల మధ్య కాక రేగుతోంది. వచ్చే ఎన్నికలకు మరో 20 నెలల టైం ఉన్న వేళ వైసీపీ పార్టీ బలోపేతానికి గడప గడపకు వైసీపీతో పాటు ప్లీనరీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే కావలి నియోజకవర్గ ప్లీనరీలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోను కావలి టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికే దక్కుతుందని ప్రకటించారు. ప్రతాప్‌కుమార్ రెడ్డి కష్టకాలంలో వైసీపీ అధినేత జగన్‌కు […]
రాజకీయాల్లో కొత్త సంస్కృతికి తెరతీసిన జగన్
గత ఎన్నికల్లో విజయానికి అడుగు దూరంలో నిలిచిపోయిన వైసీపీని ఈసారి ఎలాగైనా విజయతీరాలకు చేర్చాలని పార్టీ అధినేత జగన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఏరికోరి ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని మైలేజ్ ఉన్న ప్రశాంత్ కిశోర్‌ను పక్కనపెట్టుకున్నారు. ఆయన రాకతో వైసీపీకి తిరుగులేదని నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అందుకు తగినట్టే ఆయన పని మొదలుపెట్టేశారు. సంప్రదాయాలకు భిన్నంగా సరికొత్త పంథాలో వెళుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గ్రామాల్లో సర్వేలు, ఎమ్మెల్యేలకు శిక్షణ శిబిరాలు, మరీ ముఖ్యంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా […]