ఓడిపోయే నేతలకే మరోసారి టికెట్లు… ఇలా అయితే ఎలా సార్….!?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ మోస్ట్ సీనియర్. 40 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీ గెలుపు కోసం నానా పాట్లు పడాల్సి వస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఈ ఎన్నికల్లో ఓడితే… పార్టీ మనుగడే కష్టమంటునే మాట కూడా వినిపిస్తోంది. అటు సీఎం జగన్ కూడా ఇదే మాట వైసీపీ నేతలకు పదే పదే చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిస్తే […]

టీడీపీలో విచిత్ర పరిస్థితి… అధినేతకు తలనొప్పి…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అందుకు ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అటు ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు… ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలకు ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. రాబోయే ఎన్నికల్లో […]

తునిపై దాడిశెట్టి పట్టు..యనమల ఫ్యామిలీకి చిక్కులే!

2009 ముందు వరకు యనమల ఫ్యామిలీ కంచుకోటగా ఉన్న తుని నియోజకవర్గం ఇప్పుడు దాడిశెట్టి అడ్డాగా మారిపోయిందనే చెప్పాలి. 1983 నుంచి 2004 వరకు వరుసగా అయిదుసార్లు యనమల రామకృష్ణుడు టి‌డి‌పి తరుపున తునిలో సత్తా చాటారు. 2009లో ఓటమి పాలయ్యారు. దీంతో 2014 ఎన్నికల బరిలో తప్పుకుని తన సోదరుడు యనమల కృష్ణుడుకు సీటు ఇచ్చారు. కృష్ణుడు కూడా ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఓడిపోయారు. వరుసగా వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలిచారు. […]

రాజా అశోక్ బాబుతో యనమలకు చెక్..తునిలో కొత్త ఎత్తు.!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉన్న నియోజకవర్గాల్లో తుని కూడా ఒకటి. జిల్లాలో 19 సీట్లు ఉంటే అందులో ఐదారు సీట్లలో టీడీపీ పరిస్తితి బాగోలేదు. కానీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉన్న తునిలో కూడా పార్టీ పరిస్తితి బాగోలేదు. 1983 నుంచి 2004 వరకు వరుసగా యనమల తుని నుంచి గెలిచారు. 2009లో ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు పోటీ చేసి..దాడిశెట్టి రాజాపై ఓడిపోయారు. ఇలా […]

సొంత గడ్డలో ‘సైకిల్’కు కష్టాలు?

2019 ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయనే చెప్పొచ్చు..ఎప్పుడైతే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైందో అప్పటినుంచి సైకిల్ కు కష్టాలు పెరుగుతూ వచ్చాయి. పైగా అధికార వైసీపీ దెబ్బకు టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. అయితే ఎన్నికలయ్యి మూడేళ్లు దాటిన సరే టీడీపీకి కష్టాలు తొలగినట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవేళ పూర్తి స్థాయిలో బలపడి ఉంటే… టీడీపీకి ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదని చెప్పొచ్చు. కానీ ఆ […]

ఆ ఇద్ద‌రు మంత్రుల‌ను ఆద‌ర్శంగా తీసుకోమంటోన్న చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ మంత్రులు, సీనియ‌ర్ నేత‌ల‌కు ఇటీవ‌ల జ‌రిగిన ఓ స‌మావేశంలో పెద్ద ఎత్తున క్లాస్ ఇచ్చారు. ముఖ్యంగా గ‌త కొన్నాళ్లుగా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మంత్రి రావెల కిశోర్ బాబు, పీత‌ల సుజాతలు స‌హా సీఎంపై నోరు పారేసుకుంటున్న క‌ర‌ణం బ‌ల‌రాం వంటి వారిని ఉద్దేశించి చంద్ర‌బాబు కామెంట్లు చేశార‌ని తమ్ముళ్లు తెగ చెవులు కొరుక్కుంటున్నారు. బాబేంటి ఇలా ఇన్‌డైరెక్ట్‌గా క్లాస్ పీకారేంటి అని కూడా అనుకున్నార‌ట‌. మొత్తానికి తీవ్ర సంచ‌ల‌నం […]

జిఎస్‌టి నష్టం ఏపీ వాటా 4,700 కోట్లు!

జిఎస్‌టి అమలుతో ఎపికి రూ.4,700 కోట్లు నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఏకీకృత పన్ను విధానం దేశానికి, రాష్ట్రాలకు ప్రయోజనకరమని, కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.  ఐదేళ్ల పాటు రూ. 23,500 కోట్ల నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని వీటో చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. రాష్ట్రాల అభిప్రాయాలను అలక్ష్యం చేయకుండా కేంద్రం న్యాయం చేయాలని […]