కెసిఆర్ కేబినెట్ లో ఇద్దరు ‘రెడ్డి’ మంత్రులు అవుట్ ?

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పట్టు నిలుపుకోవాలని కేసీఆర్ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగమే దళితబంధు పథకం. అంతేకాక ఆ వర్గాన్ని సంత్రుప్తి పరచడానికి బండ శ్రీనివాసును ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి ఇద్దరు దళిత నేతలను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తున్నారని తెలిసింది. వారిలో ఒకరిని డిప్యూటీ సీఎంను చేయాలని అనుకుంటున్నారని సమాచారం. అలా అయితే ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఇద్దరికి స్థానచలనం తప్పదు. ఆ ఇద్దరూ […]

మోత్కుపల్లికి మంచిరోజులు వచ్చినట్లేనా..!

ఆయన పార్టీలే చేరలేదు.. పార్టీ కండువా కూడా కప్పుకోలేదు.. కనీసం సానుభూతి పరుడు కూడా కాదు.. అప్పుడే పదవి కొట్టేశాడు.. ఆయనే మోత్కుపల్లి నర్సింహులు.. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిన అనంతరం మోత్కుపల్లి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఈటలను పార్టీలోకి తీసుకోవడంపై కనీసం తనకు సమాచారం ఇవ్వలేదనేది ఆయన వాదన.. పనిలో పనిగా కేసీఆర్‌ ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని అమోఘం అంటూ ప్రశంసించారు. అంటే కారు ఎక్కడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారన్నమాట. ఈనేపథ్యంలో దళిత […]

అప్పుడు ’బండి‘ని కలిసి.. ఇప్పుడు కేసీఆర్ ను పొగిడి..

సర్వే సత్యనారాయణ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పట్టున్న నాయకుడు.. కేంద్ర మంత్రిగా పనిచేసి ఢిల్లీస్థాయిలో పరిచయాలున్న వ్యక్తి.. అయితే తెలంగాణ వచ్చిన తరువాత దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వే మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కారణం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఆహా..ఓహో అని కీర్తించడం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన టీఆర్ఎస్ పార్టీ అధినేతను పొగడటం ఏం సంకేతాలిస్తుంది అంటే.. ఏముంది ఆయన కారు […]

అనుకున్నదొకటి.. అయినదొకటి.. బోల్తాపడ్డావులే నాయకా..

ఈటల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. ఆ తరువాత ఈటల పార్టీకి రాజీనామా చేయడం.. బీజేపీ కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. అంతేనా.. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ లో ఎన్నికలు నేడో..రేపో వచ్చేస్తాయన్నట్లు టీఆర్ఎస్ అధినేత భావించారు. అందుకే దళితబంధు పథకం ప్రారంభించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈటల కూడా తానేం తక్కువ కాదన్నట్లు.. నేను రాజీనామా చేసినందుకే దళితబంధు వచ్చింది..అంటూ ఆ క్రెడిట్ తనకు దక్కేలా మాట్లాడుతున్నారు. […]

గులాబీ పార్టీలో ప్రవీణ్ గుబులు..!

ఐపీఎస్ అధికార పదవిని వదులుకొని ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ తరువాత బీఎస్పీలోకి అట్టహాసంగా చేరారు. ఆ రోజే.. ఆయన నేరుగా సీఎంను టార్గెట్ చేశారు. ఏనుగు మీద ప్రగతి భవన్ కు వెళదాం అని పిలుపునిచ్చారు. ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నాయకులు ఖండించారు గానీ నామమాత్రంగానే.. ఐపీఎస్ చదివిన మేధావిని ఎలా ఎదుర్కోవాలనే విషయం టీఆర్ఎస్ పార్టీకి అర్థం కావడం లేదు. ముఖ్యంగా కారు పార్టీలో ఉన్న దళిత […]

కౌశిక్ ఇంకా ఎమ్మెల్సీ కాలేదు.. రాజ్ భవన్ ఇంకా ఆమోదించలేదు..

కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఉండగానే టీఆర్ఎస్ అభ్యర్థిగా హుజూరాబాద్ లో పోటీచేస్తానంటూ మాట్లాడి.. ఆ విషయం బయటకు తెలిసిన అనంతరం కారెక్కిన వ్యక్తి. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ అతన్నే ఈటలపై పోటీకి దించుతుందని భావించారు. అయితే అందరూ ఆశ్చర్యపోయే విధంగా సీఎం కేసీఆర్ కౌశిక్ ను ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించారు. పార్టీలో చేరిన ఆరు రోజులకే ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నామినేట్ కేబినెట్ నామినేట్ చేసింది. ఆ తరువాత ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్లింది. […]

స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం కేసీఆరే..

ఎవరీకి పెద్దగా తెలియని గెల్లు శ్రీనివాస యాదవ్ పేరుకు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.. ముందు ఆయన కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పాలి.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస యాదవ్ ను ప్రకటించడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానాన్ని ఎలా అయినా గెలుచుకోవాలని, అది మా సీటని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. […]

ఎస్.. నేనంటే నేనే అంటున్న కేసీఆర్, ఈటల

పేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయల నగదు.. ఈ మొత్తంతో దళితులు అభివద్ది చెందుతారు.. అనేక రోజులుగా ఇది నా కల.. ఇప్పటికి ప్రారంభమైంది అని సీఎం కేసీఆర్ చెబుతుండగా.. నేను రాజీనామా చేయడం వల్లే దళిత బంధు వచ్చింది.. కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేస్తారా? రాష్ట్రం మొత్తం ఇవ్వాలి.. ఇది నా క్రెడిట్ అని స్పీచ్ లిస్తున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఎవ్వరి వల్ల పథకం వచ్చిందనే విషయం పక్కన […]

కేసీఆర్ సార్.. ఇదేం విచిత్రం

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావుది  నేనింతే అన్నట్టుంది వ్యవహారం. నేను అనుకున్నది చేస్తా.. నాకు నచ్చినట్టు చేస్తా.. నచ్చకపోతే అంతే.. అని ఆయన చెప్పకపోయినా..చేస్తున్న పనులు మాత్రం నా ఇష్టం అన్నట్లుంది. దీనికి ఉదాహరణ ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలే.. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే.. ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. . ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే […]