అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన దిల్‌రాజు!‌

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల‌కు టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. గ‌తంలో అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఐకాన్‌` అనే సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించ‌బోతున్న‌ట్టు కూడా అప్ప‌ట్లో వెల్ల‌డించారు. ప్ర‌క‌ట‌న వ‌చ్చింది గాని.. ఈ సినిమా సెట్స్ మీద‌కు మాత్రం వెళ్ల‌లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయింద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌కు […]

నాగ్ చేసిన త‌ప్పు చేయ‌నంటున్న వెంకీ..?!

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నారప్ప, ఎఫ్ 3 సినిమాలు చేస్తున్న వెంకీ.. ఇటీవల దృశ్యం 2 రీమేక్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో వెంకీ భార్య‌గా సీనియ‌ర్ హీరోయిన్ మీనా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

నటుడు వివేక్ హఠాన్మరణంపై రజనీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

కోలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు వివేక్ నేటి ఉద‌యం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన‌ వివేక్.. అక్కడ చికిత్స పొందుతూనే మృతి చెందారు. వివేక్ మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు వివేక్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ క్ర‌మంలోనే వివేక్ హఠాన్మరణంపై సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తన ఆప్త మిత్రుడు వివేక్ మరణం తనను కలచివేసిందని.. ఎంతో బాధ […]

మ‌రో బాలీవుడ్ డైరెక్ట‌ర్‌కు ప్ర‌భాస్ గ్రీన్‌సిగ్నెల్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకుండానే బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్‌తో `ఆదిపురుష్‌`, కోలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో `సాల‌ర్‌` మ‌రియు నాగ్ అశ్విన్‌తో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేసేందుకు ఒప్పుకొన్నాడు. అంతేకాదు.. స‌లార్‌, ఆదిపురుష్ చిత్రాల‌ను సెట్స్ పైకి కూడా తీసుకెళ్లాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం..మ‌రో ప్రాజెక్ట్‌ను ప్ర‌భాస్ లైన్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌ దర్శకుడు […]

పవ‌న్‌కు క‌రోనా..వ‌‌ర్మ ఘాటు వ్యాఖ్య‌లు!

ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. ముఖ్యంగా టాలీవుడ్‌లో క‌రోనా క‌ల్లోలం రేపుతోంది. ఇప్ప‌టికే ఎంత‌రో సినీ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ‌గా.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కూడా క‌రోనా సోకింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా తెలియజేసింది. అయితే ప‌వ‌న్‌కు క‌రోనా సోక‌డం పై టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్, వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వ‌ర్మ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ` ఒక కనిపించని నీచమైన పురుగు కూడా […]

డ్యాన్స‌ర్‌గా మారిన సింగ‌ర్ సునీత‌..వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ టాప్ సింగ‌ర్స్‌లో ఒక‌రైన సునీత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కేవ‌లం సింగ‌ర్‌గానే కాకుండా టెలివిజన్‌ యాంకర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది సునీత‌. ఇక ఇటీవల రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన‌ సునీత.. ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సింగ‌ర్ డ్యాన్స‌ర్‌గా మార‌బోతోంది. ఎప్పుడూ గాత్రం మీద కాన్‌సన్‌ట్రేట్ చేస్తూ రికార్డింగ్ […]

`ఆచార్య‌` రిలీజ్ డేట్‌పై క‌న్నేసిన టాలీవుడ్ యంగ్ హీరో!

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలని అనుకున్న‌‌ప్ప‌టికీ..అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నాగ చైత‌న్య ఆచార్య రిలీజ్ డైట్‌పై క‌న్నేశార‌ని తెలుస్తోంది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్లవి హీరో,హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం […]

జర్నలిస్ట్‏గా మార‌బోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాగానే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ చిత్రం చేయ‌నున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు ఓ క్లారిటీ రాలేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా ర‌ష్మిక […]

చ‌ర‌ణ్ సినిమాకు శంక‌ర్‌కు క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్ ?

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. పొలిటికల్‌ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండే.. శంకర్ రెమ్యునరేషన్ కు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. కరెక్ట్ ఫిగర్ […]