నాగ్ చేసిన త‌ప్పు చేయ‌నంటున్న వెంకీ..?!

April 18, 2021 at 7:54 am

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నారప్ప, ఎఫ్ 3 సినిమాలు చేస్తున్న వెంకీ.. ఇటీవల దృశ్యం 2 రీమేక్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో వెంకీ భార్య‌గా సీనియ‌ర్ హీరోయిన్ మీనా కనిపించనున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లో కాకుండా ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని వెంకీ మ‌రియు చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. ఓ ఓటీటీ సంస్థ ఈ సినిమా కోసం రూ. 30 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవ‌ల విడుద‌లైన నాగార్జున్ `వైల్డ్ డాగ్‌` చిత్రాన్ని మొద‌ట ఓటీటీలో విడుద‌ల చేయాల‌నుకున్నారు.

కానీ, చివ‌ర్లో ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసి.. థియేట‌ర్‌లో విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని రూ. 9 కోట్లకు అమ్మితే.. కేవ‌లం రూ. 3.50 కోట్లు రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది. అదే ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే.. రూ. 22 కోట్ల అన్న దక్కేవి. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకున్న వెంకీ నాగ్ చేసిన త‌ప్పు చేయ‌కూడ‌ద‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. ఇక మ‌రోవైపు క‌రోనా రోజురోజుకు పెరిగిపోతుండ‌డంతో.. ప్రేక్ష‌కులు కూడా థియేట‌ర్‌కి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అందుకే దృశ్యం 2ను లేట్ చేయ‌కుండా ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు.

నాగ్ చేసిన త‌ప్పు చేయ‌నంటున్న వెంకీ..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts