విమాన ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. ఇక ల‌గ్జ‌రీ కారు డ్రైవ్ చాన్స్‌

April 17, 2021 at 9:40 pm

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. భారతదేశంలో మొదటిసారిగా ఎయిర్‌పోర్టు నుంచే విమాన ప్ర‌యాణికుల‌కు లగ్జరీ కార్ డ్రైవ్ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఈ మేర‌కు జీఎంఆర్ సంస్థ ప్ర‌క‌టించింది. డ్రైవింగ్‌ను ప్రేమించే వ్యక్తుల కోస‌మే ఈ అద్భుతమైన అవకాశం క‌ల్పించిన‌ట్లు వివ‌రించింది.. విమానం దిగిన దిగిన వెంటనే అత్యాధునిక, ఖరీదైన కార్లు అద్దెకు సిద్ధంగా ఉండ‌నుండ‌డం విశేషం. వివ‌రాల్లోకి వెళ్తే..

మీకు డ్రైవింగ్ అంటే మక్కువైతే, నిజాంల నగరంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరగాలనుకుంటే, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అరైవల్స్ వద్ద ఉన్న ఫోర్ వీల్ సంస్థ అసమానమైన లగ్జరీ కార్లను అందిస్తోంది. పోర్సేజ్ 911 క‌ర్రెర 4ఎస్‌, జాగ్వార్ ఎఫ్ టైప్, లంబోర్ఘిని గల్లార్డో, లెక్సస్ ఇఎస్ 300 హెచ్, ఆడి ఎ 3 క్యాబ్రియోలెట్, మెర్సిడెస్ బెంజ్ ఇ 250, బిఎమ్‌డబ్ల్యూ 3 జిటి, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, ఫోర్డ్ ముస్తాంగ్, వోల్వో ఎస్ 60, మసెరాటి ఘిబ్లి, టయోటా ఫార్చ్యూనర్, మారుతి సుజుకి సియాజ్ లాంటి అత్యాధునికమైన కార్లు కేవలం ఫోన్ కాల్ / క్లిక్ తో అందుబాటులో ఉంచుతుంది. ఈ కార్లను అద్దెకు తీసుకున్నవారు వాటిని తామే సొంతంగా నడుపుకోవచ్చు లేదా డ్రైవర్ కూడా అందుబాటులో ఉంటాడు. అంతే కాకుండా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడానికి ముందే వాటిని బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి ట్రిప్ తర్వాత కార్లును శానిటైజ్ చేస్తారు. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విలాసవంతమైన కారు ప్రయాణానికి సిద్ధం కండి.

విమాన ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. ఇక ల‌గ్జ‌రీ కారు డ్రైవ్ చాన్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts