ఎస్. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన `అన్నియన్` చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేసి 2005లో విడుదల చేయగా.. రెండు చోట్ల సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే.
రణ్వీర్ సింగ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. పెన్ మూవీస్ బ్యానర్‌పై జయంతిలాల్ భారీ రేంజ్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ చిత్రం హీరోయిన్గా కియారా అద్వానీని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే సంప్రదింపులు పూర్తి అయ్యాయని.. త్వరలోనే ప్రకటన రానుందని సమాచారం. కాగా, మహేష్ హీరోగా తెరకెక్కిన `భరత్ అనే నేను` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా.. ఆ తర్వాత వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఇక ఈ చిత్రం తర్వాత తెలుగులో మరే సినిమా చేయకపోయినా..బాలీవుడ్లో ఈ బ్యూటీ బిజీగా గడుపుతోంది.