జర్నలిస్ట్‏గా మార‌బోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌?

April 17, 2021 at 8:26 am

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాగానే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ చిత్రం చేయ‌నున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు ఓ క్లారిటీ రాలేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్నాను ఎంపిక చేశార‌ట‌. ఇటీవ‌లె చిత్ర యూనిట్ ర‌ష్మిక‌ను సంప్ర‌దించి క‌థ చెప్ప‌గా.. వెంట‌నే ఆ బ్యూటీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ట‌.

అంతేకాదు, ఇందులో రష్మిక జర్నలిస్ట్ గా కనిపించబోతున్నట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది. కాగా, ఈ చిత్రం షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే.

జర్నలిస్ట్‏గా మార‌బోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts