కేసీఆర్‌ సర్వేలకే సవాలు విసురుతున్న తెరాస ఎమ్మెల్యేలు

టీఆర్ఎస్‌ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆ పార్టీ ఎమ్మెల్యేల‌కు కంటి నిండా నిద్ర క‌రువవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ నిర్వ‌హిస్తున్న స‌ర్వేలు.. వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ స‌ర్వే జ‌రుగుతుందో… అందులో తాము ఎక్క‌డ ఉంటామో తెలియ‌క అంతా స‌త‌మ‌త‌మైపోతున్నారు. ఇక ఈ స‌ర్వే ఫ‌లితాలే 2019 ఎన్నిక‌ల్లో సీటు ఇచ్చేందుకు కొల‌మాన‌మ‌ని చెబుతుండ‌టంతో.. ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్ మొద‌లైంది. `పార్టీ ప‌రిస్థితి బాగుంది.. కానీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి బాలేదు` అని సీఎం చెబుతుండ‌టంతో.. ఎక్క‌డ […]

బీజేపీ నేతల ఎత్తుగడలను అనిచివేసే పనిలో కెసిఆర్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల అనంత‌రం బీజేపీ అధిష్ఠానం ద‌క్షిణాధి రాష్ట్రాల‌పై పూర్తిగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా ముందుగా తెలంగాణపై పూర్తిగా ఫోక‌స్ పెట్టిన‌ట్టు వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఈ వ్యాఖ్య‌ల‌ను మొద‌ట ప‌ట్టించుకోక‌పోయినా.. ఇప్పుడు మాత్రం వీటిని సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌! అంతేగాక బీజేపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో.. ఆయ‌న‌లో గుబులు మొద‌లైంద‌ట‌. దీంతో బంగారు తెలంగాణ నినాదంతో బలపడుతున్న గులాబీ పార్టీ నేతలకు ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్ర‌స్తుతం బీజేపీ వ్యూహాల‌కు చెక్ […]

పెద్ద‌ల ఆశ‌ల‌కు బీజేపీ నేత‌ల‌ గండి

తెలంగాణ బీజేపీలో లుక‌లుక‌లు బ‌య‌టప‌డ్డాయి. ఆధిప‌త్య పోరు ఇప్పుడు ఆ పార్టీని వేధిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీని ప‌రుగు పెట్టించాల్సిన ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య అభిప్రాయ‌బేధాలు పార్టీ అధిష్ఠానానికి త‌ల‌నొప్పిగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ల‌క్ష్మ‌ణ్‌, శాస‌నాస‌భా ప‌క్ష నేత కిష‌న్ రెడ్డి కేంద్రాలుగా రెండు ప‌వ‌ర్ హౌస్‌లు ఏర్ప‌డుతు న్నాయ‌ని అంత‌ర్గ‌తంగా చ‌ర్చ న‌డుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో బీజేపీని బ‌లోపేతం చేయాల‌ని అధిష్ఠాన పెద్ద‌లు ఆశ‌లు పెట్టుకుంటే.. వీరు ఆ ఆశ‌ల‌కు […]

బీజేపీ ఆప‌రేష‌న్ ” రెడ్డి ” స్టార్ట్‌

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ దూకుడుకు ప‌గ్గాలు వేసేందుకు బీజేపీ అదిరిపోయే స్కెచ్‌తో ఉందా ? 2019లో బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం లేదా బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఎదిగేందుకు ప్ర‌ణాళిక‌తో ఉందా ? ఇందుకోసం ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప‌క్కా వ్యూహం ప‌న్నుతున్నారా ? అంటే తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల ఇన్న‌ర్ క‌థ‌నాల ప్ర‌కారం అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. తెలంగాణ‌లో సాధారణ ఎన్నికలు రెండేళ్లుండగానే పార్టీల్లో కదలిక మొదలైంది. ఉన్న నాయకత్వానికి.. కొత్త నాయకత్వాన్ని జత […]

కేటీఆర్ కేబినెట్‌లో మంత్రిగా క‌విత‌..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ ఎంపీగా పార్ల‌మెంటులో తెలంగాణ వాణి బ‌లంగానే వినిపిస్తున్నారు. ఓ లేడీ అయ్యి ఉండి తెలంగాణ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌పై ఆమె లోక్‌స‌భ‌లో త‌న వాగ్దాటిని బ‌లంగానే వినిపిస్తున్నార‌న్న చ‌ర్చ‌లు కూడా టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే క‌విత‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని దాదాపు యేడాది కాలంగా ఒక్క‌టే ప్ర‌చారం జ‌రిగింది. టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరుతుంద‌ని…మోడీ టీఆర్ఎస్‌కు రెండు మంత్రి ప‌ద‌వులు కూడా ఆఫ‌ర్ చేశార‌ని..అందులో ఒక‌టి క‌విత‌కేన‌న్న ప్ర‌చారం […]

విజ‌య‌శాంతి తెలంగాణ‌లో కాంగ్రెస్ – త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌లలిత మృతి త‌ర్వాత త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. ఎవ‌రికి వారు పార్టీ పెట్టేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అమ్మ మృతితో ఖాళీ అయిన ఆర్‌కె.న‌గ‌ర్ అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌లు పార్టీలు మారిన టాలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి ఈ ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఇంత‌కు విజ‌య‌శాంతి అక్క‌డ ఎవ‌రి త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నాడో […]

2019లో తెలంగాణ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ 2019 ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా దాదాపు ఖ‌రారైన‌ట్టేనా ? అంటే ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో ట్రెండ్ చూస్తుంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. కేసీఆర్ త‌ర్వాత ఆయ‌న నెక్ట్స్ వార‌సుడు ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న‌కు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. ఈ రేసులో గ‌త కొద్ది యేళ్లుగా కేసీఆర్ మేన‌ళ్లుడు హ‌రీష్‌రావుతో పాటు కుమారుడు కేటీఆర్ ఇద్ద‌రూ ఉంటూ వ‌చ్చారు. ఎప్పుడైతే 2014లో విజ‌యం త‌ర్వాత కేసీఆర్ సీఎం అయ్యారో […]

రామోజీతో కేసీఆర్ రాజీ… ఫిల్మ్‌సిటీ అక్కౌంట్‌లోకి వంద‌ల ఎక‌రాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ఒక‌టి అంద‌రినీ అవాక్క‌య్యేలా చేస్తోంది!! తెలంగాణ ఉద్య‌మ సమ‌యంలో ఏ నోటితో అయితే రామోజీని తిట్టిపోసి.. ఆయ‌న క‌ట్టుకున్న స్వ‌తంత్ర రాజ్యం ఫిల్మ్ సిటీని ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు అదే రామోజీకి దాసోహం అయిపోయారా? అని తెలంగాణ జ‌నాలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీకి రంగారెడ్డి జిల్లాలోని అనాజ్‌పూర్ స‌హా చుట్టుప‌క్క‌ల సుమారు 375 ఎక‌రాల స్థ‌లాన్ని కారు చౌక‌గా క‌ట్ట‌బెడుతున్నారు. ఇప్పుడు […]

ఏపీలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాలపై టీఆర్ఎస్ క‌న్ను..!

ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఆవిర్భ‌వించి ప‌దిహేనేళ్ల‌పాటు పోరాటం చేసిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం ఏర్ప‌డిన వెంట‌నే జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లోను విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ బ్రేకుల్లేని జెట్‌స్పీడ్‌లా దూసుకుపోతోంది. అక్క‌డ టీఆర్ఎస్ దూకుడుకు బ్రేకులేసేందుకు కూడా ప్ర‌తిప‌క్షాలు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ సాధ‌నే ధ్యేయంగా ఏర్ప‌డిన టీఆర్ఎస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్రాలో కూడా పోటీ చేస్తుందా ? అంటే ఆ పార్టీ మంత్రులు […]