తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాథినిత్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గానికి గుడ్ బై చెప్పనున్నారా ? వచ్చే ఎన్నికల్లో ఆయన మరో కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారా ? అంటే తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోన్న ఇన్నర్ టాక్ ప్రకారం అవుననే ఆన్సరే వినిపిస్తోంది. రాష్ట్ర పునర్విభజనచట్టంలో పేర్కొన్న నియోజకర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి ఏపీలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీతో పాటు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ సైతం […]
Tag: Telangana
టీఆర్ఎస్‌లో బాబూ మోహన్ పనైపోయిందా..!
తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లో బాబూ మోహన్ పనైపోయిందా ? సీఎం కేసీఆర్‌ను ముద్దుగా బావా..బావా అని ఆప్యాయంగా పిలుచుకునే బాబూ మోహన్‌కు ఆ బావే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ప్రస్తుతం మెదక్ జిల్లాలో జరుగుతోన్న పరిణామాలు అవుననే అంటున్నాయి. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బాబూ మోహన్ మెదక్ జిల్లాలోని ఆందోల్ ఎస్సీ స్థానం నుంచి 1998 ఉప ఎన్నికతో పాటు, 1999 ఎన్నికల్లోను బాబూ మోహన్ రెండుసార్లు దామోదర రాజనర్సింహను ఓడించాడు. […]
2019 వార్: ఏపీ, తెలంగాణలో ఎవరు ఎవరికి ఫ్రెండో..!
2019 సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల టైం ఉంది. ఎన్నికలకు ఆరు నెలల టైం పక్కన పెట్టేస్తే 15 నెలలు మాత్రమే ఉంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోను వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో జట్టు కడతారు ? అధికార పార్టీలను ఢీకొట్టేందుకు కొత్త పొత్తుల లెక్క ఏంటన్నదానిపై ఊహాగానాలు, చర్చలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. రెండు చోట్లా కామన్ పాయింట్ ఏంటంటే అధికార పార్టీలను ఓడించేందుకు విపక్షాలన్ని ఒకే కూటమిగా ఏర్పడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే […]
కవిత ఎంపీ సీటుపై ట్రావెల్స్ అధినేత కన్ను
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదని కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల తర్వాత ఆమె ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా గెలిచిన తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. మంత్రి అవ్వాలన్న కోరిక కవితకు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరితే వచ్చే ఎన్నికల తర్వాత ఆమెకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న […]
నల్గొండ జిల్లాలో ఆ రెండు సీట్లలో టీఆర్ఎస్‌కు ఓటమేనా..!
తెలంగాణలోని పాత నల్గొండ జిల్లా పేరు చెపితే కాంగ్రెస్‌కు కంచుకోట. చంద్రబాబు సీఎంగా గెలిచినప్పుడు కూడా ఈ జిల్లాలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. ఇక ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ తిరుగులేని విజయాలు సాధిస్తున్నా కాంగ్రెస్ మాత్రం ఇక్కడ ఎమ్మెల్సీ సీటు గెలుచుకుని ఎన్నో సంచలనాలకు కారణమైంది. ప్రస్తుతం ఈ జిల్లాలోనే టీ కాంగ్రెస్‌కు ఉద్దండులైన నాయకులు అందరూ ఉన్నారు. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగార్జునా సాగర్ నుంచి జానారెడ్డి, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, […]
టీటీడీపీ నేతలతో ఏపీలో పార్టీకి నష్టం
రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ నాయకులు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీయడంతో.. జోరుగా ఎమ్మెల్యేలు అటు సైకిల్, ఇటు కారు ఎక్కేశారు. ముఖ్యంగా తెలంగాణలో ఆపరేషణ్ ఆకర్ష్ దెబ్బకు పూర్తిగా టీడీపీ ఖాళీ అయిపోయింది. దీనిపై టీటీడీపీ నేతలు టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక ఏపీలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణలో ఫిరాయింపులపై పోరాటం చేస్తుంటే… ఏపీలో మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీనిపై ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నతరుణంలో.. టీటీడీపీ […]
టార్గెట్ మోడీ: బాబును మించిపోయిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంద్రి నరేంద్రమోడీపై ఎక్కడా లేని భక్తిని చూపిస్తున్నారు. మోడీని ఆయన పూర్తిగా ఆకట్టేసుకున్నట్టే కేసీఆర్ తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పనిచేస్తోన్న రామ్‌నాథ్ కోవింద్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీయే మిత్రపక్షాలను కలుస్తూ మద్దతు యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోను పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయనకు మిత్రపక్షమైన టీడీపీ, తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఏపీలోని విపక్ష వైసీపీ మద్దతు […]
టీకాంగ్రెస్‌లో మూడు ముక్కలాట
విభజన తర్వాత ఏపీలో పూర్తిగా దెబ్బతిన్నా.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పునర్వైభవం కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే రెండేళ్లలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో.. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఉన్న నేతలందరూ సీఎం పీఠంపై కన్నేసి.. లాబీయింగ్‌కు కూడా తెరలేపారు. ఎవరికి వారు తామే సీఎం అభ్యర్థి అని ప్రకటించేసుకుంటున్నారు. సర్వేలు చేయించేస్తున్నారు. తన కంటే జూనియర్లు సీఎం కుర్చీ కోసం తెగ ప్రయత్నిస్తుంటే.. నేనెందుకు ప్రయత్నించకూడదు అనుకున్నారో ఏమో.. ఇప్పుడు ఈ రేసులోకి […]
టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు?
తెలంగాణలో `టీడీపీ-టీఆర్ఎస్ దోస్తానా` అంటూ కొన్ని రోజుల క్రితం వచ్చిన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. తర్వాత ఇది సాధ్యపడేదే కాదంటూ కొందరు దీనిని కొట్టిపాడేశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్యే ఈ చర్చ రావడంతో ఎప్పుడు పరిస్థితులు ఎలా మారతాయోనని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంగతేంటి? అనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్-రేవంత్ ఒకే ఒరలో ఇమడని రెండు కత్తులన్న విషయం […]