పాలిటిక్స్ అంటే ఎవరికి చేదు! అంటూంటారు అనుభవజ్ఞులు. అధికారానికి అధికారం, ప్రజల్లో పాపులారిటీ.. ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది. అందుకే పాలిటిక్స్‌లో చేరేందుకు దాదాపు అందరూ ఆసక్తి చూపుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ వరుసలో నందమూరి హీరో తారక రత్న చేరిపోయాడు! ఈయనెవరా అని ఆలోచిస్తున్నారా.. ? 2002లో ఒకటో నెంబరు కుర్రోడు తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. పెద్దగా అభిమానులను సంపాయించు కోలేకపోయిన మోహనకృష్ణ కొడుకు! ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఈయనే పాలిటిక్స్‌లోకి వచ్చేయాలని భావిస్తున్నట్టు […]
Tag: TDP
సర్వే బాగున్నా టీడీపీలో కొత్త టెన్షన్
ఏపీ అధికార పార్టీ టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలే వీరిలో పెద్ద ఎత్తున ఆందోళనకు కారణం అయ్యాయట! వాస్తవానికి తాజాగా నిర్వహించిన సర్వేలో టీడీపీ పాలన, చంద్రబాబు నాయకత్వం తదితర అంశాల్లో అన్నీ ప్లస్సులో వచ్చాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉద్యమం రేగిన కాపు సామాజిక వర్గంలోనూ టీడీపీకి సానుకూల వాతావరణం ఉందని రిపోర్ట్ వచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద […]
ఆ హీరోయిన్ టీడీపీకి గుడ్ బై ..!
అవును! టీడీపీలో సీనియర్ నాయకురాలిగా ఉన్న టాలీవుడ్ మాజీ హీరోయిన్ కవిత ఇప్పుడు సైకిల్ దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తోంది. వాస్తవానికి తాను సీనియర్ ఎన్‌టీఆర్ హయాంలోనే పార్టీలోకి వచ్చానని, అప్పటి చైతన్య రథం వెంట పరుగులు కూడా పెట్టానని చెప్పుకొనే కవిత.. ఇప్పుడు మాత్రం తనను పట్టించుకునేవారు కరువయ్యారని వాపోతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సంగతిని పక్కన పెడితే.. విపక్షంలో ముఖ్యంగా వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత ప్రతి రోజూ మీడియా మీటింగులతో ఇరగదీసిన […]
టీడీపీ ఇంటర్నల్ సర్వే రిజల్ట్ ఇదే..
ఏపీలో ఇప్పుడు సర్వే సమయం కొనసాగుతోంది! అధికార టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తన పాలన, టీడీపీ పరిస్థితిపై సర్వే చేయించినట్టు తెలుస్తోంది. వచ్చే 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఎవరి వశం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీలో ఎన్నికలు వస్తే.. తమ పార్టీ పరిస్థితి ఏమిటి? ఎన్ని సీట్లు వస్తాయి? ఎంత మేరకు తమ ఆశలు సాకారం అవుతాయి? వంటి అంశాలపై చంద్రబాబు ఇంటర్నల్ సర్వే చేయించారు. ఈ సర్వేలో చంద్రబాబుకి దిమ్మతిరిగే.. రిజల్ట్ వచ్చిందని […]
ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపెవరిది..!
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది. ఈ రెండేళ్లలో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం తనవంతుగా కష్టపడుతున్నారు. 2019 సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఎవరికెన్ని సీట్లు వస్తాయి ? గెలుపు ఎవరిది ? అన్న అంశాలపై ప్రముఖ మీడియా ఛానెల్ నిర్వహించిన సర్వేలో ఏపీ ప్రజలు మరోసారి అధికార టీడీపీకే పట్టం కడతారని, చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని స్పష్టమైంది. ఎన్నికలకు మరో […]
షాక్: లోకేష్ మంత్రి పదవికి మామ బాలయ్య అడ్డు..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కొద్ది రోజులుగా టీడీపీలోను, ఏపీ ప్రభుత్వంలోను పట్టు సాధించేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లోకేష్‌కు త్వరలో జరిగే కేబినెట్ ప్రక్షాళనలో కేబినెట్ బెర్త్ కన్‌ఫార్మ్ అన్న వార్తలు కూడా వస్తున్నాయి. లోకేష్‌ను అసెంబ్లీకి పంపాలనుకుంటే కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం బెస్ట్ ఆప్షన్ అని కూడా బాబు భావిస్తోన్న సంగతి తెలిసిందే. లోకేష్‌ను అసెంబ్లీకి పంపకపోతే ఆయన్ను […]
మోడీపై టీడీపీ స్వరం పెరుగుతోంది
తడి తనదాకా వస్తేనే కానీ తెలీదంటారు పెద్దలు! ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు విషయం టీడీపీకి ఇలానే మారుతోందట! మొన్నటి వరకు ఈ పెద్ద నోట్ల రద్దు విషయం మా నేత చంద్రబాబు చెబితేనేగానీ కేంద్రానికి అసలు ఆ ఆలోచనే లేదన్నట్టుగా మాట్లాడిన టీడీపీ తమ్ముళ్లు.. ఇప్పుడు ఆ నోట్ల రద్దుతో జనాలు ప్రభుత్వాలపై తిరగబడే పరిస్థితి తలెత్తేసరికి.. ప్లేటు ఫిరాయించేస్తున్నారు. ఈ పెద్ద నోట్ల విమర్శల నుంచి తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో నిన్న మొన్నటి […]
ఎన్టీఆర్ పార్టీతో ఎఫెక్ట్ ఎవరికి ..!
జూనియర్ ఎన్టీఆర్! తన వినూత్న నటనతో సీనియర్ ఎన్టీఆర్‌ని మరిపించి.. తెలుగు ప్రేక్షకులను మురిపించిన డైనమిక్ హీరో! వెండి తెరపై ఈయన వేసే స్టెప్పులు చాలా మటుకు సీనియర్ ఎన్టీఆర్‌నే గుర్తుకు తెస్తాయి. ఈ కారణంగానే అత్యంత త్వరగానే తెలుగు ఆడియన్స్‌కి చేరువ అయిపోయాడు జూనియర్. దీంతో ఈయన చరిష్మాను తన పాలిటిక్స్‌కి మిక్స్ చేసి.. అధికారంలోకి వచ్చేందుకు 2009లో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా యత్నించారు. తాత పెట్టిన పార్టీ కావడంతో టీడీపీ తరఫున ప్రచారం […]
ఆపరేషన్ రెడ్డి స్టార్ట్ చేసిన చంద్రబాబు
రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారి పోతుంటాయి! పాలిటిక్స్‌లో మన బలం ఎంత ఉందన్నది ప్రధానం కాదు.. ఎదుటి వాడి బలాన్ని బట్టి మనం బలంగా ఉన్నామో? లేదో చూసుకోవడం ప్రధానం! ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఈ బలాలు బలహీనతలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రానున్న 2019లోనూ ఏపీలో తనే అధికారంలోకి రావాలని పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న చంద్రబాబు.. దానికి తగిన విధంగా ఇప్పటి నుంచే పక్కా స్కెచ్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత […]