ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైకాపాల మధ్య వాతావరణం మరింత ముదురుతోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో సమసిపోయేలా లేదని తాజా పరిస్థితులను బట్టి చూస్తే తెలిసిపోతోంది. రాజధాని నిర్మాణం సహా పోలవరం, పట్టిసీమల విషయంలో అధికార టీడీపీని వైకాపా పెద్ద ఎత్తున ఇరుకున పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక కేసులు కూడా నమోదయ్యాయి. కొన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మరోపక్క, నేరుగా సీఎం చంద్రబాబునే […]
Tag: TDP
చంద్రబాబుపై విరుచుకు పడ్డ సుప్రీంకోర్టు లాయర్
ఆయన పేరు ప్రశాంత్ భూషణ్. సుప్రీంకోర్టు లాయర్. అంతేకాదు.. ప్రముఖ సామాజిక ఉద్యమ కార్యకర్త. అంతేకాదు, అన్నా హజారే టీంలో ప్రముఖ నేతగా పేరు తెచ్చుకున్నాడు. ఇక, ఢిల్లీ స్థాపించిన ఆప్ పార్టీలో ఆయన ప్రముఖ పాత్ర కూడా పోషించాడు. పర్యావరణం సహా అవినీతి, అక్రమాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడే ప్రశాంత్ భూషణ్ పిల్ లాయర్(ప్రజాప్రయోజన వ్యాజ్యాల ప్రముఖ లాయర్)గా పెద్ద పేరుంది. ఇప్పుడు ఈయన తన ఆగ్రహం అంతా ఏపీ సీఎం చంద్రబాబుపై చూపించారు. అంతేకాదు, […]
టీడీపీ అలా చేస్తే.. జగన్‌కి పట్టపగలే చుక్కలు..!
వైకాపా అధినేత జగన్ చుట్టూ మరోసారి ఉచ్చుబిగుసుకుంటోందా? ఇప్పటికి అనేక కేసుల్లో చిక్కుకున్నా.. కేసుల విచారణలో కొంత జాప్యం జరుగుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్న ఆయనకు త్వరలోనే భారీషాక్ తగలనుందా? ఏపీ టీడీపీ నేతలు జగన్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టేలా పావులు కదుపుతున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు పోగేసుకున్న కేసులో జగన్ దాదాపు ఏడాదికి పైగా జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జగన్ కేసుల […]
రేవంత్ సొంత కుంపటి!
తెలంగాణ టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. టీడీపీలో సీనియర్ నేతగా ఎదిగిన రేవంత్.. తెలంగాణలో ఇప్పుడు ఆపార్టీకి కేరాఫ్‌గా మారారనడంలో సందేహం లేదు. అయితే, పాలిటిక్స్ అన్నాక.. భూమి గుండ్రంగా ఉండును. అన్న పద్ధతిలోనే ఉండిపోవు కదా! ఈ క్రమంలోనే రేవంత్ కూడా భవిష్యత్తును అంచనా వేసుకుని.. రాబోయే 2019 ఎన్నికలకు అనుగుణంగా వ్యవహరించాలని, మారాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. […]
రేవంత్‌పై తమ్ముళ్ల గరంగరం
పాలిటిక్స్ అన్నాక శత్రువులు విపక్షంలోనే ఉండనక్కరలేదు! సొంతపార్టీలోనూ శత్రువులు ఉండొచ్చు. అసలామాట కొస్తే.. ఉంటారు కూడా! ఇప్పుడు ఈ మాటలు ఎందుకంటే.. తెలంగాణ టీడీపీలో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ టీడీపీ లోనే శత్రువులు ఎక్కువయ్యారట! ఇప్పుడు అందరూ దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఒక పక్క పార్టీ అధినేత చంద్రబాబు.. అందరూ కలసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించాలని, కలసి ముందుకు సాగాలని పిలుపునిస్తున్నారు. అయితే, అధినేత ఆశలకు విరుద్ధంగా తెలంగాణ టీడీపీలో కార్యక్రమాలకు […]
జగన్ మళ్లీ సేమ్ మిస్టేక్ రిపీట్
ఏపీ ఏకైక విపక్షం వైకాపా అధినేత జగన్.. వైఖరిలో ఎక్కడా మార్పు కనిపించడం లేదు. సాధారణంగా ఎవరికైనా ఒకటి రెండు దెబ్బలు తగిలితే వెంటనే వారిని వారు సరిచేసుకుంటారు. తమ పంథా మార్చుకుంటారు. కానీ, వైకాపా అధ్యక్షుడి విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ.. ఆయన అధికార పీఠమే లక్ష్యంగా చేస్తున్న వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే విసుగు పుట్టిస్తున్నాయి. ఏడాది కిందట రాజ్ భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయిన […]
ఏపీలో బీజేపీ – టీడీపీ మధ్య కొత్త చిచ్చు
ఏపీకి ప్రత్యేక హోదా మిత్రపక్షాలు అయిన టీడీపీ – బీజేపీ మధ్య చాలా రోజుల పాటు చిచ్చు రాజేసింది. ప్రత్యేక హోదా అంశంపై ఏపీలో బీజేపీ, టీడీపీ నేతలు చాలా రోజుల పాటు సవాళ్లు , ప్రతిసవాళ్లు విసురుకున్నారు. చివరకు టీడీపీనే ‘ప్యాకేజీ’తో సరిపెట్టుకుని హోదా వేస్ట్ అని తేల్చటంతో అసలు ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగిపోయింది. కొద్ది రోజుల వరకు చంద్రబాబుపై ఫైర్ అయిన ఏపీ బీజేపీ నేతలు సైతం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు […]
టీడీపీలోకి తండ్రి, కొడుకులు
ఏపీ అధికార పార్టీ టీడీపీలోకి జరుగుతున్న జంపింగ్‌లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు! ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండగానే వైకాపా నుంచి ముఖ్య నేతలు సైతం చంద్రబాబు చెంత సైకిల్ ఎక్కేస్తున్నారు. దీనికి వాళ్లు చూపిస్తున్న కారణాలు సమంజసమా? అసమంజసమా? అనేది పక్కన పెడితే.. ఈ పరిణామం మాత్రం వైకాపా అధినేత జగన్‌కి భారీ షాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న నెల్లూరు వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆయన తనయుడు, సోదరుడు ఇలా సరివార […]
లోకేష్‌పై చంద్రబాబు ఫైర్ వెనక
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తారని గత నాలుగైదు నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల సంగతి ఎలా తాజాగా ఓ విషయంలో చంద్రబాబు లోకేష్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారని దేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకమైన యాప్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ సభ్యత్వ నమోదు […]