వర్గపోరుకీ, రాజకీయ యుద్ధాలకీ పెట్టింది పేరైన నెల్లూరులో ఇద్దరు మంత్రుల మధ్య పొరపచ్చాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ మంత్రి నారాయణ ఆడింది ఆట పాడింది పాటగా ఉన్న ఈ జిల్లాలో.. ఆయనకు పోటీగా సోమిరెడ్డి వచ్చారు. క్యాబినెట్ లో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడంతో ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో పాలిటిక్స్ హీటెక్కాయి. దీంతో క్యాడర్‌లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకపక్క సోమిరెడ్డి దూసుకుపోతుం డటంతో.. నారాయణ కూడా ఆయన్ను అందుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారట. మంత్రివర్గ విస్తరణకి ముందు […]
Tag: TDP
మోదీ నిర్ణయానికి చంద్రబాబు సై.. లోకేష్ నై
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, పంచాయతీ,ఐటీ శాఖ మంత్రి లోకేశ్.. రోజుకో సంచలన వ్యాఖ్యతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సమావేశాల్లో తడబడుతూ వ్యాఖ్యలు చేసి తండ్రికి తలనొప్పులు తీసుకొచ్చిన ఆయన.. మరోసారి చంద్రబాబుకు పెద్ద ఝలక్ ఇచ్చారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అదే సమయంలో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చెబుతుంటే.. ఈ రెండిటినీ లోకేష్ తేలికగా కొట్టిపారేశారు. అసలు ఏకకాలంలో అన్నిరాష్ట్రాలకూ ఎన్నికలు నిర్వహించడం జరిగే పనికాదని కొట్టిపారేశారు!! […]
ముందస్తుకు సై అనడం వెనుక వ్యూహమిదే
ఏపీలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చేందుకు నాయకులు అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా.. అప్పుడే మూడేళ్లు అయిపోయాయా అనే భావన అందరిలోనూ ఉంది. కానీ మరోసారి ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు సై అంటున్నారు. అటు పార్టీ శ్రేణుల్లోనే కాక.. ప్రజల్లోనూ ఇప్పుడు ముందస్తు ఎన్నికల ఫీవర్ పెంచేశారు. ఎన్నికల హామీలు ఇంకా నెరవేర్చలేదు.. మ్యానిఫెస్టోలో ఇచ్చినవి.. ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. కానీ ముందస్తుకు ప్రధాని మోదీ.. ఓకే అనగానే ఇద్దరు […]
అమెరికాలో చంద్రబాబు సభ భారీ కాస్ట్లీ గురూ..!
ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే అమెరికా పేరు జపిస్తూ ఉంటారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడంలో భాగంగా.. వివిధ దేశాలు తిరుగుతున్న ఆయన.. ఇప్పుడు ఆ అమెరికాకే వెళ్లబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి.. అన్ని ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైట్(ఏపీఎన్ఆర్‌టీ) దగ్గరుండీ మరీ చూస్తోంది. ఇందులో ఏర్పాటుచేసే సమావేశాలకు టికెట్ ఉచిత ప్రవేశం అంటూనే.. భారీగా డబ్బులు దండుకుంటోంది. రాజధాని కోసమో..లేక మరో అంశం కోసమే విరాళం ఇస్తే ఫర్లేదు కానీ.. ఇలా టిక్కెట్లు […]
2019లో ఆరు ఎంపీ సీట్లకు టీడీపీలో కొత్త క్యాడెంట్స్
2019 ఎన్నికలకు మరో రెండేళ్ల టైం ఉండగానే ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార టీడీపీ మరోసారి గెలిచేందుకు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతుంటే విపక్ష వైసీపీ ఎలాగైనా గెలుపుకోసం ఎక్కడ లేని వ్యూహాలు పన్నుతోంది. ఇక జనసేన వ్యూహం ఎలా ఉంటుందో ఇప్పటికైతే అర్థం కావడం లేదు. ఇక మరోసారి విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోన్న చంద్రబాబు ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోన్న కొందరు సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ లిస్టులో ఎంపీ స్థానాల […]
ధూలిపాళ్ల నరేంద్ర కొత్త నియోజకవర్గంపై కన్ను..!
టీడీపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్రకు పార్టీలో వరుసగా కష్టాలు, అవమానాలు ఎదురవుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి 1994 నుంచి 2014 వరకు వరుసగా ఓటమి లేకుండా ఐదుసార్లు గెలిచిన నరేంద్రకు చిరకాల కోరిక అయిన మంత్రి పదవి మాత్రం రాలేదు. గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నరేంద్రను కరుణించలేదు. మొన్న కేబినెట్ ప్రక్షాళనలో నరేంద్రకు గ్యారెంటీ బెర్త్ దక్కుతుందని అందరూ భావించారు. అయితే […]
సొంత జిల్లాలో బాబుకు సీనియర్ల ఝలక్
మంత్రి వర్గ విస్తరణ అనంతరం అన్ని జిల్లాల్లోని టీడీపీ వర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రగిలాయి. సీనియర్లు అలకబూనడం.. అనంతరం వారిని బుజ్జగించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. కానీ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు జిల్లాలో మాత్రం ఇవి ఇంకా నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన, బాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు సీనియర్లు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేగాక చంద్రబాబుకు, వారికీ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. […]
లోకేశ్ కోసం టీవీ-9 రిపోర్టర్
సొంత టీమ్‌ను రూపొందించే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు సీఎం చంద్రబాబు తనయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేశ్! ముఖ్యంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, వారితో సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అవసరమైన సభ్యులను ఏరికోరి మరీ ఎంపికచేసుకుంటున్నారు. ఇతర రంగాల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్న వారిని తన టీంలో చేర్చుకుంటున్నారు. మీడియాలో సంచలనంగా మారిన టీవీ-9 చానెల్‌కు చెందిన రిపోర్టర్‌ను తన పీఆర్వోగా లోకేశ్ నియమించుకున్నారు. అలాగే మరో జాయింట్ కలెక్టర్‌ను కూడా తన వద్ద చేర్చుకున్నారు. మంత్రిగా […]
టీడీపీ కంచుకోటలో బాబు సర్వేలో షాకింగ్ రిజల్ట్
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటలాంటిది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. 2004, 2009 ఎన్నికలు మినిహా టీడీపీ ఆవిర్భావం తర్వాత అన్ని ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఆధిపత్యం చూపించింది. గత సాధారణ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. 15 ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఏలూరు, నరసాపురంతో పాటు ఈ జిల్లాలో సగం విస్తరించి ఉన్న రాజమండ్రి ఎంపీ సీటును కూడా టీడీపీ + బీజేపీ భారీ మెజార్టీతో […]