ఏపీలో పశ్చిమగోదావరి పేరు చెప్పగానే సంచలన రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంది. గత ఎన్నికల్లో జిల్లాలోని అన్ని సీట్లలో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లు (తాడేపల్లిగూడెంలో మిత్రపక్షం బీజేపీ)తో కలుపుకుని మూడు ఎంపీ స్థానాలు టీడీపీకే దక్కాయి. రాజకీయంగా జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతంగా ఉంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో నాలుగు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయన్న అంచనాలతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తోన్న ఆశావాహులు లిస్టు రోజు రోజుకు […]
Tag: TDP
ఆనం, శివప్రసాద్ యూ టర్న్ తీసుకున్నట్టేనా
మంత్రి వర్గ విస్తరణ తర్వాత సీఎం చంద్రబాబును టార్గెట్ చేసిన నేతలు యూ టర్న్ తీసుకున్నారు. కానీ అక్కడక్కడా అసంతృప్తులు మాత్రం ఇంకా మిగిలిపోయారు. వీళ్లంతా ఇక పార్టీని వీడటం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో వీరందరినీ బుజ్జగించేందుకు స్వయంగా అధినేత రంగంలోకి దిగారు. రెండేళ్లలో ఎన్నికలు ఉన్న తరుణంలో ఇలాంటి అసంతృప్తుల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించి అలక తీరుస్తున్నారు. ఎంపీ శివప్రసాద్, ఆనం వివేకా నందరెడ్డి.. ఇలా అందరినీ తన దారికి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతానికి […]
అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే..సన్నిహితులతో చర్చలు
టీడీపీలో ఓ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ఆ పార్టీలో వేగలేకపోతున్నారా ? సదరు నేత చూపులు వైసీపీ వైపు ఉన్నాయా ? అంటే అవుననే అంటున్నారు ఏపీలోని రాజకీయ విశ్లేషకులు. గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి 2009లో నరసారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు అప్పటి గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావడంతో మోదుగులకు చంద్రబాబు గుంటూరు వెస్ట్ సీటు కేటాయించారు. […]
ఇద్దరు చంద్రులకు మోదీ మళ్లీ షాక్?
సంచలన నిర్ణయాలతో దేశ గతినే మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని మోదీ! ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. కానీ వాటిని కనిపించకుండా చేస్తున్నారు ఇద్దరు చంద్రులు! ఇప్పుడు వీరికి మరో పిడుగులాంటి వార్త! రాజకీయంగా పార్టీల అస్థిత్వంపై దెబ్బకొట్టే నిర్ణయాన్ని మోదీ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఇప్పటివరకూ ప్రభుత్వాలు ఎమ్మెల్సీ ద్వారా కొందరిని మండలికి పంపుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దుచేయాలని మోదీ నిర్ణయించుకున్నారట. అంతేగాక దీనిపై […]
ఆ విషయంలో చంద్రబాబు లెక్క తప్పిందా?
బహిరంగ సభల్లో ప్రజలతో మాట్లాడించడం.. వారిని ప్రశ్నలు అడగటం చేస్తూ ఉంటారు సీఎం చంద్రబాబు! వారు టీడీపీ పథకాల గురించి, తన గురించి ఏం చెబుతారోనని తెలుసుకునేందుకు ఇలాంటివన్నీ ప్రత్యేకంగా రూపొందిస్తుంటారు. ఇటీవల పశ్చిమగోదావరిలో నిర్వహించిన సభలోనూ ఇలాగే గ్రామస్తులతో మాట్లాడించిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజల్లో టీడీపీపై సంతృప్త స్థాయిని పెంచాలని, ఎప్పటికప్పుడు నేతలకు చెబుతూ ఉంటారు. 80 శాతం సంతృప్తిగా ఉన్నారని. మిగిలిన వారిని కూడా ఈ జాబితాలో చేర్చాలని చెబుతూ ఉంటారు. […]
బీజేపీని వదిలించుకునే పనిలో టీటీడీపీ
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సూత్రాన్ని టీటీడీపీ వంటబట్టించుకుంది. గత ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో జత కట్టినా.. ప్రస్తుతం మిత్ర బంధం తెగిపోయేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అస్థిత్వం కోసం జరిగే పోరాటంలో కొత్త మిత్రుల వేటలో టీటీడీపీ నేతలు వెదుకులాట ప్రారంభించారు. టీడీపీకి శత్రువయిన కాంగ్రెస్‌తో జతకట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని పరోక్షంగా అధినేత చంద్రబాబు ముందు ఉంచడం ఇప్పుడు […]
తెలంగాణలో బద్ధశత్రువుతో టీటీడీపీ దోస్తీ ..!
కొత్త మిత్రుడి కోసం టీటీడీపీ వెదుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం బీజేపీతో మైత్రి కొనసాగుతున్నా.. ఎప్పుడు కమలనాథులు కటీఫ్ చెప్పేస్తారో తెలియని పరిస్థితి. దీంతో తమ మనుగడ కాపాడుకునేందుకు సరికొత్త పొత్తుల కోసం చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. శత్రువులతోనూ చేతులు కలిపేందుకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. అంతేగాక మరో అడుగు ముందుకేసి చర్చలు కూడా ప్రారంభించిందని సమాచారం! శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని పాటించాలని డిసైడ్ అయిపోయింది. అందుకే బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో కూడా దోస్త్ మేరా […]
ఆ నలుగురు టీడీపీ ఎంపీలకు ప్రజాసేవ నై…వ్యాపారాలే జై
టికెట్ ఇచ్చిన పార్టీకి, ఓట్లేసిన ప్రజలకు కొంతమంది తెలుగుదేశం ఎంపీలు శఠగోపం పెడుతున్నారు. పార్టీని, ప్రజలను పట్టించుకోకుండా కేవలం వ్యక్తిగత అజెండాతో వ్యవహరిస్తున్నారు. స్వతహాగా పారిశ్రామిక వేత్తలయిన వీరు.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కేవలం తమ పరిశ్రమల అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ వ్యాపారాలు, వ్యక్తిగత సమస్యలను పట్టించుకుని.. ప్రజలను, పార్టీని పూర్తిగా విస్మరించారని అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజలకు చేరువకాకపోవడంతో పాటు సొంత వ్యాపారాలు, సొంత ఎజెండాతో ముందుకు వెళుతుండ టంతో […]
సైకిల్ గుర్తు వద్దు.. కమలంపై పోటీ చేస్తాం
బీజేపీ-టీడీపీ పొత్తు రెండు రాష్ట్రాల్లో వింతగా ఉంది. ఒకచోట టీడీపీ బలంగా ఉంటే.. మరోచోట బీజేపీ బలాన్ని పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకచోట సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ఆరాటపడుతుంటే.. మరోచోట అస్థిత్వం కోసం టీడీపీ పోరాడుతోంది. కలహాలు ఉన్నా ఏదోలా ఇన్నాళ్లూ జోడీ బండిని లాక్కుంటూ వస్తున్నారు. ఏపీలో పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం వింతైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీపీ నాయకులు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారట. పార్టీని విలీనం చేయకుండానే.. బీజేపీ జెండాతో […]