తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో వింత సంస్కృతి కనిపిస్తోంది. మన రాష్ట్రం.. మన పాలన పేరుతో ఆవిర్భవించిన టీఆర్ ఎస్ అనతి కాలంలోనే రాష్ట్రాన్ని సాధించడంతోపాటు కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో టీఆర్ ఎస్ అధికారంలోకి కూడా వచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. టీడీపీ మూలాలున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ టీడీపీ గూటి పక్షులకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారని, తెలంగాణ సాధన కోసం టీఆర్ ఎస్ లో పనిచేసిన వారిని గుర్తించడం లేదనే […]
Tag: TDP
టీడీపీలో రాబోయే తరానికి కాబోయే నేతలు హల్ చల్
వారసత్వ రాజకీయాలకు టీడీపీ కూడా అనుకూలమే. దీనికి సీఎం తనయుడు, మంత్రి లోకేశ్ పెద్ద ఉదాహరణ. దీంతో నిన్న మొన్నటి వరకు వారసులను పార్టీకి దూరంగా ఉంచిన నేతలు ఇప్పడు తమ వారసులను పని గట్టుకుని ప్రోత్సహించి, పాలిటిక్స్‌లో దింపుతున్నారు. దీనికి నిన్న ముగిసిన విశాఖ టీడీపీ మహానాడు వేదిక అయింది. ఈ మహానాడులో టీడీపీ సీనియర్ నేతల పుత్రరత్నాలు.. అంటే రాబోయే తరానికి కాబోయే నేతలు హల్ చల్ చేశారు. వీరికి లోకేశ్ మార్గదర్శి, కార్యదర్శి.. […]
మహానాడులో ఆ ఇద్దరూ తప్పా….అందరూ బోర్
విశాఖ వేదికగా టీడీపీ నిర్వహించిన అతి పెద్ద పార్టీ పండుగ మహానాడుకు అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జయంతి ఆదివారం రావడంతో ఎక్కడెక్కడినుంచో అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. అయితే, ఈ మహానాడు సందర్భంగా అధినేత చంద్రబాబు మొదలు కొని ఏపీ, తెలంగాణ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రసంగించారు. అయితే, ఈ మూడు రోజుల పండుగలో కేవలం ఇద్దరి ప్రసంగాలు మాత్రమే ఆకట్టుకున్నాయనే టాక్ వచ్చింది. ముఖ్యంగా టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి ప్రసంగానికి […]
కడపలో ఆయన టీడీపీలోకి…ఈయన వైసీపీలోకి..?
కడప జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విపక్ష వైసీపీలో ఉంటే కష్టమే అని భావిస్తోన్న వారు అధికార టీడీపీ వైపు చూస్తుంటే…టీడీపీలో పరిస్థితి బాగోలేదని భావిస్తోన్న మరో కీలక నేత వైసీపీ వైపు చూస్తున్నారట. ఇప్పుడు జిల్లాలో వీరిద్దరి వ్యవహారమే హాట్ టాపిక్‌గా మారింది. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి హవా ముందు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తేలిపోతున్నారు. తాజాగా విశాఖలో జరుగుతోన్న మహానాడుకు సైతం ఆయన డుమ్మా కొట్టారు. ఆయన మహానాడుకు రాకపోవడం ఒక ఎత్తు […]
అవమానాలు ఎదుర్కోలేక పార్టీ వీడనున్న కవిత!
ఈ హెడ్డింగ్ చూసిన వారు బీజేపీలోకి కవిత ఏంటి ? అని కాస్త కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. కవిత అంటే కేసీఆర్ కుమార్తె కవిత కాదు…నిన్నటి తరం ప్రముఖ హీరోయిన్, ప్రస్తుత టీడీపీ నాయకురాలు అయిన కవిత. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లపాటు ఆమె పార్టీ తరపున వాయిస్ గట్టిగా వినిపించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్న అతికొద్దిమందిలో కవిత ఒకరు. టీడీపీ ఆందోళనలను ఆమె ప్రజల్లోకి బాగానే తీసుకెళ్లేవారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ […]
టీడీపీ ఎంపీకి బీజేపీ ఆఫర్..!
పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పడం కష్టం. ముఖ్యంగా తాము కోరుకున్న పనులు నెరవేరకపోతే.. నేతలు ఎంతకైనా తెగిస్తారనేది పాలిటిక్స్‌లో మామూలే! ఏళ్ల తరబడి కాపు కాచిన పార్టీలను సైతం ఒక్క క్షణంలో వదిలేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పడు ఇదే జాబితాలోకి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు చేరనున్నారట! కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో టీడీపీ తీర్థం పుచ్చుకుని నరసరావు పేట నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవల […]
ఎన్టీఆర్‌కు భారతరత్న… చేతులు దులుపుకున్న చంద్రబాబు
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి వినిపించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావుకు భారత రత్న అవార్డు ఇవ్వాలి అనేది కొన్నేళ్లుగా ఏపీలో వినబడుతున్నామాట! అయితే, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలే చొరవ తీసుకుని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ విషయం కేంద్రానికి కూడా చేరింది. ఇక, తాజా విషయానికి వస్తే.. ఎన్‌టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి అనే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓ అభిప్రాయం లేదా? అనే […]
టీడీపీ సరే…టీఆర్ఎస్ ఒరిజినలా..!
ఎర్రబెల్లి దయాకరరావు. పేరు చెప్పగానే గుర్తొచ్చే నేతల్లో ఈయన ఒకరు. తెలంగాణలో ఒకప్పుడు టీడీపీకి అంతాతానై వ్యవహరించిన వరంగల్ జిల్లాకు చెందిన నేత. పాలకుర్తి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకును కూడా సిద్ధం చేసుకున్న ఈయన.. టీడీపీకి ఒకప్పుడు వీర విధేయుడు! ముఖ్యంగా చంద్రబాబు విధానాలు, టీడీపీ సిద్ధాంతాల కోసం కష్టపడ్డాడు. అయితే, రోజులు మారతాయి అన్నట్టు స్టేట్ విభజన నేపథ్యంలో చంద్రబాబు ఏపీకే పరిమితం అవడం, తెలంగాణలో టీడీపీ నానాటికీ తీసకట్టుమాదిరిగా మారిపోవడం తెలిసిందే. […]
ఏపీలో తాజా పరిణామాలు రాజకీయ వ్యూహాత్మకమా ..!
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో కూరలో ఓ కరివేపాకు చందంగా మారాడా ? అంటే తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. అసలు పవన్ రాజకీయ లక్ష్యం ఏంటి ? పవన్‌కు రాజకీయాల్లో రాణించాలన్న క్లారిటీ ఉందా ? లేదా ? పవన్‌కు సినిమాలు ముఖ్యమా ? రాజకీయాలు ముఖ్యమా ? అన్నదే ఇప్పుడు అందరి మదిలోను పెద్ద కన్‌ఫ్యూజన్‌గా మారుతోంది. పవన్ కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా […]