ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి ఈ రోజు వైసీపీలో చేరడంతో ఇక్కడ బలాబలాలు మారుతున్నాయి. నిన్నటి వరకు ఇక్కడ టీడీపీ మూడు గ్రూపులుగా ఉంది. ఈ మూడు గ్రూపుల్లో ఒకరికి మరొకరితో అస్సలు పొసగలేదు. భూమా వర్గం, శిల్పా వర్గం, మాజీ మంత్రి ఫరూఖ్ ఇలా వీరు వేర్వేరు గ్రూపులుగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ముగ్గురు […]
Tag: TDP
విశాఖలో వీధికెక్కిన మంత్రుల కీచులాట .. బాబుకు గంటా లేఖ
ఏపీ సీఎం చంద్రబాబు మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రుల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆ పార్టీ, ఈ పార్టీ తిరిగి చివరాఖరికి 2014లో టీడీపీ లో చేరి మంత్రి పదవి కొట్టేసిన గంటా శ్రీనివాసరావుల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. ఇటీవల వెలుగు చూసిన విశాఖ భూ కుంభకోణం తో వీరిద్దరి మధ్య మరింతగా గొడవలు రాజుకుని, అవి అధినేత చంద్రబాబు వరకు చేరాయి. మొన్నామధ్య […]
ఏపీ పాలిటిక్స్‌లో సీన్ రివర్స్
ఏపీలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పార్టీ బలోపేతం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నిన్నటి వరకు విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను వరుసపెట్టి సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ బండి ఓవర్ లోడ్ అయ్యింది. వైసీపీ నుంచి వచ్చిన కొత్త నాయకులకు అప్పటి వరకు టీడీపీలో ఉన్న పాత నాయకులకు మధ్య కూల్‌వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. దీంతో కొత్త నాయకులతో పొసగని పాత నాయకులు ఇప్పుడు రివర్స్ జంప్ చేస్తున్నారు. వారంతా టీడీపీకి […]
ఆ మంత్రి ఇంకా పట్టు సాధించలేదా?!
ఏపీ సీఎం చంద్రబాబు అంటే.. లీడర్ షిప్ క్వాలిటీకి కేరాఫ్. ఆయన పాలన అంటే.. అన్ని రంగాలపైనా పట్టు గ్యారెంటీ! అదేవిధంగా ఆయన టీం మంత్రులకు కూడా బాబు ఇదే ఫిలాసఫీ నేర్పిస్తారు. ముందు వారివారి విభాగాలపై పట్టుసాధించాలని చెబుతారు. దీంతో వారు స్వల్ప కాలంలోనే బాబు సూచనల మేరకు పాలనపై పట్టు బిగిస్తారు. అయితే, ఇప్పుడు ఓ మంత్రి మాత్రం ఇంకా పాలనపై పట్టు సాధించలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో […]
టీడీపీ కంచుకోటలో ఇద్దరి ఎమ్మెల్యేల ఫైట్
టీడీపీకి కంచుకోట వంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యేలు వీధుల్లోకి వచ్చి కొట్టుకునే, చంపుకొనే పరిస్థతి ఏర్పడుతోంది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా లో టీడీపీ జెండా రెపరెపలాడింది. ఈ క్రమంలో జిల్లా టీడీపీ నేతల మాటకు విలువ పెరిగిపోయింది. ఇలా తమకు ఎదురు లేకుండా పోయిందని టీడీపీ నేతలు భావించారు. ఇంత వరకు నిజమే అయినా.. పరిస్థితులు ఇప్పుడు చేయిదాటుతున్నాయి. నేతలంతా ఒక్కటై పార్టీని మరింత బలోపేతం చేయాల్సింది పోయి.. పార్టీని […]
చంద్రబాబుతో టీడీపీ ఎంపీ తాడో.. పేడో..!
విజయవాడ ఎంపీ కేశినేని నాని.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిన్న బెంజ్ సర్కిల్‌వద్ద ఫ్లైవోవర్‌కి శంకు స్థాపన చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రవాణా శాఖపై ఓ రేంజ్‌లో ఫైరయ్యాడు. అవినీతికి చిరునామాగా రవాణా శాఖ ఉందని భారీ కామెంట్ చేశాడు. నిజాయితీ గల టీడీపీ కార్యకర్తగా తాను సిగ్గుపడుతున్నానని అన్నారు. రవాణా శాఖ అవినీతి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే.. కేశినేని ఇదంతా ఏదో వ్యూహం ప్రకారం చేస్తున్నట్టే […]
టీడీపీలోకి అశోక్‌బాబు…. ఎమ్మెల్సీపై గురి..!
ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు ఉద్యోగుల కోసం చేసే పనిలో ఆయనకు ఎన్ని మంచి మార్కులు వచ్చినా, ఆయన చంద్రబాబుకు కాస్త ఫేవర్‌గా ఉంటారన్న టాక్ ఆయనపై ఎప్పటి నుంచో ఉంది. గత ఎన్నికలకు ముందే ఆయన టీడీపీలోకి వస్తారన్న వార్తలు వచ్చినా అవి ఆ తర్వాత సైలెంట్ అయ్యాయి. వీలున్నప్పుడల్లా అశోక్‌బాబు చంద్రబాబును డప్పును లైట్‌గా అయినా కొట్టేస్తుంటారు. తాజాగా నవ నిర్మాణ దీక్షల ముగింపు సందర్భంగా కాకినాడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రిపై అశోక్ బాబు పొగడ్తలతో […]
బాబు బాణం బాబుకే తగిలింది
ఏపీలో పార్టీని సంస్థాగతంగా కన్నా నాయకులతో బలోపేతం చేసేయాలని కలలు కన్న చంద్రబాబు కలలు రివర్స్ అయ్యాయి. ఏపీని అభివృద్ధి చేయడం ద్వారానో లేదా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనో చూడకుండా చంద్రబాబు విపక్ష వైసీపీ వాళ్లను తమ పార్టీలో చేర్చేసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేల కౌంట్ పెరిగిపోతుందని లెక్కలు వేసుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన ఒకరిద్దరు ఎంపీలతో పాటు 21 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు అధికార పార్టీ చెంత చేరిపోయారు. చంద్రబాబు అనుకున్నట్టు ఇక్కడ […]
ఇక.. ఎమ్మెల్సీ పరకాల! ప్రమోషన్ ఇవ్వనున్న బాబు
ఇప్పటి వరకు ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్‌కి త్వరలోనే ప్రమోషన్ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సలహాదారుగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వంలో కీలక అంశాల్లోఆయన ముద్ర కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు విదేశీ టూర్లకు ఈయనే ప్లాన్ చేస్తున్నారని, అక్కడి నుంచి మీడియాకు వార్తలు అందించడం కూడా ఈయన పనేనని తెలిసిన విషయమే. అంతటి కీలకంగా సేవ చేస్తున్న పరకాలకు ప్రమోషన్ ఇవ్వాలని బాబు డిసైడ్ అయ్యారని సమాచారం. అయితే, మరో వర్గం ప్రచారం మాత్రం.. […]