టీడీపీని నమ్ముకుని ఎన్నో త్యాగాలు చేసిన సీనియర్లకు చంద్రబాబు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉండడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ల కోసం తమ సీట్లు వదులుకుని త్యాగాలు చేసిన వాళ్లకు చంద్రబాబు సింపుల్‌గా కార్పొరేషన్ పదవులతో సరిపెట్టేశారు. తాజాగా రాష్ట్రంలో ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆహార భద్రత కమిషన్‌కు చైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జె.ఆర్.పుష్పరాజ్‌ను నియమించాలని […]
Tag: TDP
నంద్యాలలో గెలుపునకు చంద్రబాబు పదవుల అస్త్రం
ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు ఏ ఒక్క పదవి భర్తీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఏవైనా పదవులు భర్తీ చేయాలంటే నాన్చి నాన్చి మరీ చేస్తున్నారు. తాజాగా ఆయన 8 కార్పొరేషన్ల పదవులు భర్తీ చేశారు. ఇదిలా ఉంటే నంద్యాల ఉప ఎన్నిక వేళ ఆ నియోజకవర్గ టీడీపీ నేతల పంట పండనుంది. ఇక్కడ గెలుపు కోసం చంద్రబాబు ఏకంగా పదవులు అస్త్రాన్నే ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయల వరద పారిస్తోన్న […]
టీడీపీ ఎమ్మెల్యేపై కమిషనర్‌కు ఫిర్యాదు
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే! నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం! ఆయన గీసిన గీత దాటితే ఇక అంతే సంగతులు! భూవివాదాలా, ఆర్థిక వివాదాలా, వ్యక్తిగత సమస్యలా.. ఇలా సమస్య ఏదైనా ఆయన తీర్పు ఇచ్చాక ఇక దానికి తిరుగుండదు! నియోజకవర్గాన్ని గుప్పెట్లో పెట్టుకుని.. అన్ని వ్యవస్థలను అదుపాజ్ఞల్లో పెట్టుకుని సెటిల్‌మెంట్లు, దందాలకు మారుపేరుగా మారిన ఆ `రాయుడి`కి ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. వడ్డీ వ్యాపారుల మీద ఉక్కుపాదం మోపుతామంటూ ఒక పక్క చంద్రబాబు ప్రకటనలు చేస్తూ, […]
`నంద్యాల`పైనే వైసీపీ ఆశలు
విభజన తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడని నమ్మి టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి సీఎం పీఠమెక్కించారు. మరి మూడేళ్లు గడిచిపోయాయి. చంద్రబాబు పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారా? ప‌్రతిపక్ష నేత జగన్‌ను ఈసారి ప్రజలు ఎంత వరకూ నమ్ముతారు? ప‌్రజా నాడి ఎలా ఉందనేది ఎవరూ అంచనా వేయలేకపోయారు. అయితే నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల ద్వారా వీటికి కొంతవరకూ సమాధానం దొరకవచ్చని అంతా భావిస్తున్నారు. అందుకే టీడీపీ, వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని […]
ఒకే జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి..!
ఈ హెడ్డింగే చాలా షాకింగ్‌గా ఉన్నట్టు కనిపిస్తోందా ? ఒకే జిల్లా నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ చేయడమా ? ఇది నిజమేనా ? అన్న అనుమానాలు చాలా మందిలో రేకెత్తుతాయి. అయితే ఆ జిల్లాలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలు మాత్రం అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న సంకేతాలే ఇస్తున్నాయి. ఆ జిల్లా రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లా కాగా….ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు మాజీ మంత్రి, ప్రత్తిపాడు […]
ఆ పంచాయితీలతో బాబు ఉక్కిరిబిక్కిరి
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కంచుకోట కడప గడపలో పసుపు జెండా రెపరెపలాడాలని సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చేసుకున్నారు. అంతేగాక మంత్రి పదవి కూడా కట్టబెట్టేశారు. ప్రస్తుతం ఈ మంత్రికి, ఆ ప్రాంతానికి చెందిన ఎంపీకి మధ్య విభేదాలు రగులుతున్నాయి. ఆది చేరికను వ్యతిరేకిస్తున్న రామసుబ్బారెడ్డి వర్గంతో ప్రస్తుతం అధిష్ఠానానికి ముచ్చెమటలు పడుతుంటే.. ఇప్పుడు మంత్రి-ఎంపీ వార్ గోరుచుట్టు మీద రోకలి […]
బీజేపీలోకి చంద్రబాబు అనుచరుడు..!
ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రియ శిష్యుడు. చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సదరు పారిశ్రామికవేత్తకు చంద్రబాబు ఏకంగా మూడుసార్లు ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఓ సారి ఎంపీగా కూడా ఆయన గెలిచారు. సదరు పారిశ్రామికవేత్త కోసం చంద్రబాబు ఏకంగా టీడీపీలో ఓ సీనియర్‌ను కూడా వదులుకున్నారు. మరి చంద్రబాబు అంతలా ప్రయారిటీ ఇచ్చిన ఆయన ఇప్పుడు బాబుకు షాక్ ఇచ్చి బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారా ? అంటే తెలంగాణలోని ఖమ్మం […]
ఆ మంత్రి, ఆ ఎమ్మెల్యేపై బాబు నిఘా..!
ఎన్నికలు, కప్పదాట్లు, జంపింగ్ జపాంగ్‌లు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో కామన్ అయిపోయాయి. ఈ మూడేళ్లలో విపక్ష పార్టీల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఏపీలో అధికార టీడీపీ, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీల్లో చేరిపోయారు. వచ్చే ఎన్నికలకు రెండేళ్లు కూడా టైం లేదు. అయితే వీరంతా ఇప్పుడు ఉన్న అధికార పార్టీల్లోనే ఉంటారా ? అంటే వచ్చే ఎన్నికలకు మరో పార్టీలోకి కూడా జంప్ చేసేందుకు తమ ప్రయత్నాల్లో తాము ఉన్నారట. ఇక ఏపీలో జనసేన ఎంట్రీతో […]
నంద్యాల టీడీపీలో `ఎవరికి వారే యమునా తీరే’
నంద్యాల ఉప ఎన్నికల అధికార పార్టీ నేతల్లో విభేదాలు సృష్టిస్తోంది. ఉప ఎన్నిక ప్రకటన నాటి నుంచి వరుస విభేదాలు రగులుతున్న వేళ.. అంతర్గత కలహాలు ముదిరి పాకాన పడ్డాయనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గెలుపు కోసం ప్రయత్నించాల్సిన చోట `ఎవరికి వారే యమునా తీరే` అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తమకు పట్టున్న నియోజకవర్గంలో వేరే వారికి గెలుపు బాధ్యతలు అప్పజెప్పడాన్ని మంత్రి అఖిలప్రియ జీర్ణించుకోలే కపోతున్నారు. తన తండ్రి నియోజకవర్గంలో.. ఇతరుల ప్రమేయంపై తీవ్ర […]