ఏపీలో 2109లో జరిగే ఎన్నికల్లో లోకేశ్ ముద్ర స్పష్టంగా కనపడనుంది. ఇప్పటికే మంత్రిగా ఉన్న లోకేశ్ టీడీపీకి ఫ్యూచర్ లీడర్ అన్న సంకేతాలు బాబు ఇచ్చేశారు. లోకేశ్‌ను తన వారసుడిగా రెడీ చేస్తోన్న చంద్రబాబు లోకేశ్‌ను సడెన్‌గా ఎమ్మెల్సీ చేసి, మంత్రిని చేసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల తర్వాత ఎప్పుడైనా టీడీపీ పగ్గాలు లోకేశ్‌కు అప్పగించనున్నారు. ఈ లోగానే ఏపీలోని అన్ని జిల్లాల్లోను తన టీం ఉండేలా లోకేశ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏపీలో నియోజకవర్గాల పెంపుతో ప్రస్తుతం […]
Tag: TDP
టీడీపీ మరోదఫా ఆపరేషన్ ఆకర్ష్
2019లో అధికారం చేపట్టాలని గట్టిగా నిర్ణయించుకున్న వైసీపీ అధినేత జగన్‌కు మరికొద్ది రోజుల్లోనే భారీ షాక్ తగలనుందని సమాచారం. రాజధాని ప్రాంతంలోని ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై చెప్పి బాబు పంచన చేరిపోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనం వెలువరించింది. ఇదే నిజమైతే.. వైసీపీకి రాజధాని ప్రాంతంలో తీవ్రమైన షాక్ తప్పదని అంటున్నారు. వియంలో కివెళ్తే.. కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తాఫాలు ఇద్దరూ […]
టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి, దందాల భాగోతం ఆగదా..!
అవినీతి సహించేది లేదు. భరించేది లేదు అని పదే పదే చెప్పుకొచ్చే టీడీపీలో నే ఇప్పుడు అవినీతి కంపు భారీ ఎత్తున కమ్మేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు అవినీతిని తుదముట్టిస్తానని ప్రకటిస్తూ ఉంటే.. ఆ పార్టీ కి చెందిన నేతలు . మాత్రం అవినీతికి ఒంటబట్టించుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రావు, దీపక్ రెడ్డిలపై పోలీసులు కేసులు నమోదు చేయడం వారిని ప్రశ్నించడం తెలిసిందే. దీంతో టీడీపీ పరువు అప్పట్లోనే భారీగా […]
చంద్రబాబుతో పవన్ భేటీ వెనుక అసలు కారణం?
చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ అవుతున్నాడనే వార్త ఎంటైర్ స్టేట్‌లో సంచలనం సృష్టించింది. అయితే, ఇంతలోనే ఇది కేవలం ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించేనని తెలిసి అందరూ నిరుత్సాహపడ్డారు. అయితే, నిజానికి జనసేనాని పవన్.. బాబును కలుస్తోంది కేవలం.. ఉద్దానం కోసమేనా? లేక ఇంకేమైనా విషయంపై చర్చించేందుకా? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. విషయంలోకి వెళ్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై తీవ్రంగా ఫైరైన జనసేనాని.. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. జిల్లాల వారీగా […]
ఉపరాష్ట్ర పతిగా వెంకయ్య…ఏపీ పరిస్థితి ఏంటి!
నెల్లూరుకు చెందిన బీజేపీ మోస్ట్ సీనియర్ నేత, కేంద్రంలో మంత్రిగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు త్వరలోనే దేశ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. మరో కొద్ది రోజుల్లో ఉపరాష్ట్ర పతి ఎన్నికలూ జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ పక్షాన ఎన్డీయే ఉపరాష్ట్ర పతి అభ్యర్థిగా వెంకయ్యను నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. రాజ్య సభను నడిపించేది ఉపరాష్ట్రపతే కాబట్టి.. తమ పక్షాన గట్టి అభ్యర్థి […]
టీడీపీలో ఈ నలుగురికి ఎమ్మెల్యే సీటు
నియోజకవర్గాల పునర్విభజన చకచకా జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ వేగం కానుందని కేంద్రం నుంచి వస్తోన్న వార్తలతో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల్లో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన మీద అధికార టీడీపీ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లా నుంచి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు […]
టీడీపీలో జగన్ కోవర్టులు ఎవరు..!
రాజకీయాల్లో ప్రత్యర్థుల కదలికలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలి. అక్కడ వారు ఏం చేస్తున్నారో తెలుసుకుని వెంటనే మనం దానికి మించిన స్టెప్ వేయాలి ? అప్పుడే ఇక్కడ సక్సెస్ ఉంటుంది. అన్ని పార్టీల వాళ్లకు ఇతర పార్టీల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కొందరు వేగులు / కోవర్టులు ఉంటుంటారు. ఈ క్రమంలోనే టీడీపీలోని ఇంటి గుట్టును ప్రత్యర్థి వైసీపీకి అంద చేస్తోన్న వారితో ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద టెన్షన్ పట్టుకుందట. వరుసగా అభివృద్ధి పథకాలు అమలు […]
టీడీపీలోకి మరో వైసీపీ ఎంపీ..రంగం సిద్ధం !
ఏపీలో విపక్ష వైసీపీకి ప్లీనరి తర్వాత ఎక్కడా లేని జోష్ వచ్చేసింది. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి ఖాళీగా ఉంటోన్న వాళ్లు, ఇతర సీనియర్ నాయకులు తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం వైసీపీలో చేరితే ఎలా ఉంటుందా ? అన్న ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ బలంగా ఉన్న కర్నూలు జిల్లాలో పట్టున్న మాజీ సీఎం కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి ఫ్యామిలీ వైసీపీలో చేరుతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో ఉన్న కోట్ల తన […]
రాహుల్ మెలికతో బాబు షాక్
ప్రతిపక్ష నేత జగన్ ఇచ్చిన హామీలతో ఇప్పటికే కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ షాక్ ఇవ్వబోతున్నారు. 2019 ఎన్నికల్లో నియోజక వర్గాల పునర్విభజన మీదే టీడీపీ అధినేత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు సరిగ్గా వీటిని చెదరగొట్టే మాస్టర్ ప్లాన్‌తో రాహుల్ సిద్ధమయ్యారు. ఏపీలో అంతోఇంతో మళ్లీ బలపడాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే! ఇందులో భాగంగా ఇప్పుడు నియోజకవర్గాల పెంపుపై సరికొత్త మెలిక పెట్టింది. దీంతో చంద్రబాబు […]