రాష్ట్రంలో ఇటు అధికార పక్షం, అటు విపక్షం రెండూ అప్పుడే మరో సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయా? అన్నంత హడావుడి మొదలు పెట్టేశాయి. వైసీపీ అధినేత జగన్ తన నవరత్నాలు, వైఎస్సార్ ఫ్యామిలీ వంటి కార్యక్రమాలతో జనంలోకి వెళ్తున్నారు. ఇక, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తాజాగా సోమవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని షురూ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఆలు లేదు చూలు లేదు.. కొడుకు పేరు అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరిపైనా పెద్ద ఎత్తున విమర్శలు […]
Tag: TDP
సోమిరెడ్డిపై ఆ ఇద్దరు కక్ష కట్టారా..!
ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ సీనియర్ లీడర్, మంత్రిపై అదే పార్టీకి చెందిన ఓ ఇద్దరు నాయకులు తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారట. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు తెరవెనక సదరు మంత్రి చేస్తోన్న ప్రయత్నాలతో వాళ్లు సదరు మంత్రిని ఎలా టార్గెట్ చేయాలా ? ఎప్పుడు అదను చూసి దెబ్బకొట్టాలా ? అని వెయిట్ చేస్తున్నారట. అసలు మ్యాటర్‌లోకి వెళితే.. టీడీపీలో సీనియర్ లీడర్‌గా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో గత 20 ఏళ్లలో ఎప్పుడూ […]
టీడీపీ+జనసేన పొత్తు…. జనసేన సీట్ల లెక్క తేల్చేసిన బాబు
ఎవరెన్ని అనుకున్నా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన మంచి మంచి అవగాహన ఉంది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మంచి దోస్తులే అన్నది కనీస రాజకీయ అవగాహన ఉన్నవారికి ఎవరికి అయినా అర్థమవుతుంది. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టిన పవన్‌కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు లాంటి సమర్థ నాయకత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీకి సపోర్ట్ చేశాడు. ఇక 2019 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. తాను […]
అఖిలప్రియకు చంద్రబాబు షాక్
ఏపీ పాలిటిక్స్ మాంచి రసకందాయంలో పడ్డాయి. అటు విపక్ష వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతుంటే ఇటు అధికారంలో ఉన్న టీడీపీలో కూడా వచ్చే ఎన్నికల వరకు ఎవరికి ఎప్పుడు ఏ షాక్ తగులుతుందో ? చెప్పలేం అన్నట్టుగా పరిస్థితి మారింది. కొద్ది నెలల క్రితం మంత్రివర్గ ప్రక్షాళనలో కొందరు మంత్రులకు షాక్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి ప్రక్షాళనకు దిగనున్నారన్న వార్తలు ఏపీ టీడీపీ వర్గాల్లో జోరుగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ యేడాది ఆరంభంలో […]
వాటి గురించి ఇప్పుడే తెలిసిందా బాబూ!
ఏపీ సీఎం చంద్రబాబు గత నాలుగు రోజులుగా చేస్తున్న హడావుడి ఆర్భాటం అంతా ఇంతాకాదు. జలసిరికి హారతి పేరుతో ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజాధనం నీళ్లలా ఖర్చయిపోతోంది. నీటి సంరక్షణ, నీటి వినియోగం కాన్సెప్టుకి మరీ ఇంత భారీ రేంజ్‌లో బాబుగారు బిల్డప్ ఇవ్వడంపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ నవ్వుకుంటున్నారు. నీటి ప్రాధాన్యం చెప్పాలంటే ఇలా కోట్లరూపాయల ప్రజాధనంతో పత్రికలకు, టీవీలకు యాడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో అది కూడా […]
మంత్రిగారికి వరుస అవమానాలు… ఏం జరుగుతోంది.
వరుస పరిణామాలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఏం జరుగుతోందో తెలుసుకునేలోగానే.. మరో అంశంలో ఎదురు దెబ్బలు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా విజయనగరం జిల్లాలో పార్టీకి అండగా ఉంటూ.. జిల్లా రాజకీయాలను శాసించిన ఆయన ప్రాభవం క్రమక్రమంగా తగ్గుతోందనేందుకు రకరకాల పరిణామాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరు ఉన్నా.. జిల్లా రాజకీయాల్లో ఆయన మాట నెగ్గడం లేదు., సరికదా వరుసగా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ క్యాడర్ వద్ద […]
తమ్ముళ్లూ జాగ్రత్త.. వాటితో టీడీపీ నేతల బేజారు
మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏమో కానీ, ఏపీలో మాత్రం అధికార పార్టీ వినూత్న శైలిలో ముందుకు వెళ్తోందని చెప్పకతప్పదు! అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తూ.. వారిలోపాలను ఎండగడుతున్నారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు. అంతేకాదు, తీరు మార్చుకుంటేనే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని ఖరాఖండీగా చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పనితీరే. ఎక్కడికక్కడ నేతలు పైరవీలకు, చేతులు చాపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప… పనులు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని […]
కొండంత హామీలను గుండ లక్ష్మీదేవి నెరవేర్చారా!…లేదా..!
శ్రీకాకుళం జిల్లాలో మంచి వ్యక్తిగా తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మాజీ మంత్రి గుండ అప్పలనాయుడు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నుంచి వరుసగా 1985, 89, 94, 99 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. గత ఎన్నికల్లో పోటీ నుంచి ఆయన తప్పుకుని తన భార్య లక్ష్మీదేవిని రంగంలోకి దించారు. లక్ష్మీదేవి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు వరకు గృహిణిగా […]
వైఎస్ ఫ్యామిలీ వీరాభిమాని సైకిల్ ఎక్కడం ఖాయమైందా..!
వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడు, వీరాభిమాని సబ్బం హరి గురించి అనూహ్యమైన వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఆయన త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుని బాబు గూటికి చేరిపోతారని అంటున్నారు ఆయన సన్నిహితులు. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవడంతో మౌనంగా ఉండిపోయారు హరి. 2009లో అప్పటి సీఎం వైఎస్ పట్టుబట్టి హరికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారని ప్రచారంలో ఉంది. అందుకే ఆయన వైఎస్ అన్నా ఆయన ఫ్యామిలీ అన్నా ఎంతో […]