శ్రీ రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు .సోషల్ మీడియా లో శ్రీ రెడ్డి హీరోస్ పై కాంట్రవర్సీ బాంబులు పేలుస్తుంటుంది,దానితో హీరో ఫ్యాన్స్ శ్రీ రెడ్డిపై కౌంటర్ ఎటాక్ చేస్తుంటారు.ఒకప్పుడు యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా ఎవరకి తెలియదు.ఎందుకంటే’మా’నెంబర్ షిప్ కోసం మూవీ’మా’ఆఫీస్ ముందు అర్ధనగ్నంగా ఎంత గోల చేసిందో అందరకి తెలిసిందే.అప్పుడు నుండి ఇటు టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు అందరకి నోటెడ్ అయిన పేరు శ్రీ రెడ్డి.పవర్ స్టార్ పవన్ […]
Tag: TDP
ముందస్తు లేదని ఇన్నిసార్లు చెబుతున్నారెందుకు?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సజ్జల చెబితే ఇక సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టే. నిజానికి ప్రభుత్వంలోని చాలా మంది పెద్దలు కొన్ని రోజులుగా ముందస్తు లేదు.. ముందస్తులేదు అని పదేపదే చెబుతున్నారు. ఆ రకంగా ప్రజలకు ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా సజ్జల కూడా చెప్పేశారు. దీనితో ఫైనల్ అథారిటీ కూడా చెప్పేసినట్టే. […]
జిన్నా టవర్ బీజేపీ పుట్టి ముంచుతుందా?
హిందువులు భారతీయ జనతా పార్టీని- తమ సొంత పార్టీగా అభిమానించి ఎంతగా నెత్తిన పెట్టుకుంటారో ఏమో తెలియదు గానీ.. ఇతర మతాలు- అంటే ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రం అపరిమితంగా ద్వేషించే వాతావరణాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థంగా తయారు చేస్తున్నారు. భారతదేశమే పరమత సహనానికి పుట్టినల్లు. అయితే.. సోము వీర్రాజు మాత్రం.. ఇతర మతాల మీద ద్వేషబీజాలు ప్రజల్లో నాటి.. తద్వారా.. పబ్బం గడుపుకోవడానికి.. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు మూటగట్టుకోవడానికి తెగిస్తున్నారు. అయితే.. […]
పవన్‌తో స్నేహం కోసం లీకులిప్పిస్తున్న చంద్రబాబు
తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. వచ్చే ఎన్నికల నాటికి.. పవన్ కల్యాణ్ తో తిరిగి జట్టుకట్టి.. బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారా? జగన్మోహన రెడ్డి హవాను ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేదనే భయం చంద్రబాబులో ఉందా? జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు వాటికి లభిస్తున్న ప్రజాదరణ.. వచ్చే ఎన్నికల్లో కూడా ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తే.. ఇక తెలుగుదేశానికి భవిష్యత్తు ఉండదని ఆయన వెన్నులో చలి మొదలైందా? అందుకోసం.. పవన్ కు ఉన్న అంతో ఇంతో బలాన్ని కూడా కలుపుకుని […]
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో వీళ్లే!
సోమువీర్రాజు.. చాలా పంతం పట్టి మరీ.. ఏపీ బీజేపీ పగ్గాలను అందింపుచ్చుకున్నారు. పార్టీ మీద అలిగి, కోపం వ్యక్తం చేసిన తర్వాత గానీ.. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. అయితే.. అంత కష్టపడి దక్కించుకున్న పార్టీ పదవికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. చీప్ లిక్కర్ వ్యవహారం ఆయన పదవికి ఎసరు పెట్టింది. ఇప్పటికే ఆయన మీద గుస్సా అయిన అధిష్ఠానం అనధికారికంగా సంజాయిషీ అడిగినట్టు తెలుస్తోంది. కాగా.. సోము వీర్రాజు పదవీకాలం సుమారుగా మరో ఆరునెలల […]
సోమును తీసేస్తే తప్ప.. ఈ పాపానికి నిష్కృతి లేదు!
భారతీయ జనతా పార్టీ విలువలు పాటించే, సిద్ధాంతాలు ఉన్న పార్టీగా చెప్పుకుంటూ ఉంటుంది. కొందరు ఆ మాటల్ని నమ్ముతారు కూడా. ఆ పార్టీకి బలం లేకపోయినా, ఆ పార్టీని నమ్మకపోయినా, ఓట్లు వేయకపోయినా.. సిద్ధాంతాల విషయంలో గౌరవంగా చూసేవారు కొందరు తప్పకుండా ఉంటారు. అలాంటి వారందరి దృష్టిలోనూ.. పార్టీ పరువును భూస్థాపితం చేసేశారు.. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చీప్ లిక్కర్ వ్యవహారాన్ని కెలికి.. తానేదో తాగుబోతుల మేలుకోసం, వారికి డబ్బు మిగలబెట్టడం కోసం […]
నెక్ట్స్ ఏంటి? పసుపా..కాషాయమా?
గత ఎన్నికల్లో జగన్ హవాలో విజయం..దీంతో ఎంపీగా ఢిల్లీలో రాజభోగాలు.. అనంతరం పార్టీ అధినేతతోనే విభేదాలు.. ఆ తరువాత కేసులు.. అరెస్టులు.. వైసీపీ రెబల్‌గా గుర్తింపు.. ఇదీ నర్సాపూర్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు గురించి క్లుప్తంగా. ఎంపీగా ఆయన పదవీ కాలం 2024తో ముగిసిపోతుంది. మరి ఆ తరువాత పరిస్థితేంటి? వైసీపీలో పార్టీ టికెట కచ్చితంగా ఇవ్వరు. ఇది రఘురాముడికే కాదు రాష్ట్రమంతా తెలుసు. పార్టీకి వ్యతిరేకంగా.. అధినేతను అడ్డంగా మాట్లాడుతున్న రఘురామరాజు ఇతర పార్టీల […]
‘గంటా’ సరికొత్త పొలిటికల్ స్టెప్
గంటా శ్రీనివాసరావు.. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కనిపించే నాయకుడు.. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, నిన్న టీడీపీ గవర్నమెంటులో అధికారం చెలాయించిన వ్యక్తి. ఏ పార్టీకి అధికారం వస్తుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసి వ్యూహాత్మకంగా ఆ పార్టీ కండువా కప్పుకునే అలవాటున్న వ్యక్తి అని పొలిటికల్ సర్కిళ్లలో పేరున్న మనిషి. అయితే 2019లో ఆయన అంచనాలు తప్పాయి. తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైపోయింది. దీంతో రెండేళ్లుగా ఆయన మౌనం వహించారు. ప్రజల్లో‍్ల కూడా పెద్దగా లేరు. […]
‘బాబు’కు దూరమవుతున్న బీసీలు
ఏపీలో ఎలా అయినా సరే అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాలు రూపొందిస్తున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా కార్యక్రమాలు నిర్వహించాలని కేడర్‌ను ఆదేశించారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడైనా తిరిగి సీఎం సీటులో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. అధికార పగ్గాలు దక్కాలంటే కుల సమీకరణలు చాలా ముఖ్యం. పార్టీలు, నాయకులు కుల సమీకరణలో చాలా ముందుంటారు. పల్లెల్లో కుల పెద్దలను కలవడం సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో […]