దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు నాట అప్రతిహతంగా చక్రం తిప్పిన తెలుగు దేశం పార్టీ.. రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమం దెబ్బతో ప్రస్తుతం విలవిలలాడిపోతోంది! ఏపీలోని 13 జిల్లాల్లో అధికారం చేపట్టి చక్రంతిప్పుతున్నా.. అదే తెలంగాణలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా మారింది. హైదరాబాద్‌ని నేనే అభివృద్ధి చేశానని, తెలంగాణలో తన ముద్ర శాశ్వతమని పదే పదే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కనీసం కన్నెత్తి […]
Tag: revanth reddy
కొడంగల్‌కు రేవంత్ గుడ్ బై…కొత్త నియోజకవర్గంపై కన్ను..!
తెలంగాణలో జిల్లాల పునర్విభజనతో కీలక నాయకుల నియోజకవర్గాల్లో అనేక మార్పులు జరిగిపోయాయి. తమకు బలమైన, బాగా పట్టున్న ప్రాంతాలు వేరే జిల్లాకు వెళ్లిపోయాయి. దీంతో నాయకులు కొత్త నియోజకవర్గాలు వెతుక్కుంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల కంటే తక్కువ సమయం ఉండటంతో ఇప్పుడు నియోజకవర్గాల వెతుకులాటలో పడ్డారు. ప్రస్తుతం టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త నియోజకవర్గం కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇప్పటికే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నుంచి పోటీచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయట. ముఖ్యంగా […]
తెలంగాణలో కొత్త పార్టీ వెనుక ఆ ముగ్గురే!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సీఎం కేసీఆర్ జోరుకు స్పీడ్ బ్రేకర్ వేసే నాయకులు ఎవ్వరూ కనపడడం లేదు. ప్రతిపక్ష పార్టీలుగా కాంగ్రెస్-బీజేపీ-టీడీపీ అన్ని డిజాస్టర్ షో వేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ట్రెండ్స్‌ను బట్టి 2019లో కూడా కేసీఆర్ తిరుగులేని మెజార్టీతో మరోసారి సీఎం అవుతారని అందరూ అంచనా వేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో సీనియర్లకు, సమర్థులైన నాయకులకు కొరత లేకున్నా వారు మూడు గ్రూపులు – ఆరు లీడర్లు అన్న చందంగా […]
అప్పుడే టీ టీడీపీలో టిక్కెట్ల ఫైటింగ్
క్యాడర్ బలంగా ఉన్నా నేతలు లేరు!! నాయకులున్నా వారి మధ్య సఖ్యత లేదు! నేనున్నా అంటూ నడిపించే నాయకుడు ఇప్పుడు టీటీడీపీకి కరువయ్యాడు. పేరున్న నేతలంగా టీఆర్ఎస్ కారులో ఎక్కేశారు. అధినేత చంద్రబాబు ఏపీకే పరిమితమవ్వడంతో.. తెలంగాణ బాధ్యతలు రేవంత్ రెడ్డి వంటి నేతలకు అప్పగించారు. పార్టీని బలోపేతం చేయడం వదిలి.. నేతలంతా ఇప్పుడు ఫైటింగ్‌కు దిగారు. 2019లో ఎవరికి ఏ నియోజకవర్గం నుంచి సీటు కావాలో.. అప్పుడే లెక్కలేసుకుంటున్నారు. `తెలంగాణలో క్యాడర్ ఉంది.. దానిని సరైన […]
రేవంత్ బీజేపీ-కాంగ్రెస్ ఎంట్రీకి బ్రేక్ వేస్తోంది ఎవరు..?
తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్ ఉంటే అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నా, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు చాలానే ఉన్నాయి. టీడీపీ-బీజేపీ-ఎంఐఎం-సీపీఎం-సీపీఐ ఈ పార్టీలన్ని కూడా అక్కడ ప్రతిపక్షాలుగానే ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా…ఎంత మంది ప్రతిపక్ష నేతలు ఉన్నా అధికార టీఆర్ఎస్ – సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి విసిరే పంచ్‌లకు ఉండే క్రేజే వేరు. తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు […]
టీ అసెంబ్లీలో కేసీఆర్‌ను అడిగేవాడేడి..!
తెలంగాణ అసెంబ్లీలో హిట్ ఎవరు? ఫ్లాప్ ఎవరు? తాజాగా ముగిసిన శీతాకాల సమావేశాల అనంతరం పొలిటికల్ పండితులు పెట్టిన దృష్టి దీనిపైనే. వాస్తవానికి కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలపై సభ వెలుపల కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. మల్లన్నసాగర్ మొదలుకుని ప్రగతి భవన్, డబుల్ బెడ్ రూం, హైదరాబాద్ రోడ్లు, రైతుల మరణాలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ ఇలా అనేక విషయాలపై మీడియా గొట్టాలు పగిలిపోయేలా కేసీఆర్, ఆయన టీంపై విపక్ష […]
బీజేపీ నుంచి సొంతగూటికి నాగం జంప్..!
బీజేపీ నేత, తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్ నాగం జనార్దన రెడ్డి.. పార్టీ మారుతున్నారనే టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో నేతలు ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగం కూడా తన రాజకీయ కెరీర్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీకి రాం రాం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అదేసమయంలో ఆయన తన మాతృ సంస్థ టీడీపీలోకి వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. […]
టీడీపీ డబుల్ గేమ్
ఏపీ అధికార పార్టీ టీడీపీ మరోసారి డబుల్ గేమ్ పాలసీని బయట పెట్టుకుంది. అంటే ఒకే సమస్యపై ఏపీలో అధికారంలో ఉన్నారు కాబట్టి.. పాజిటివ్‌గా, తెలంగాణలో విపక్షంలో ఉన్నారు కాబట్టి నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేయడంలో టీడీపీ నేతలు వారికి వారే సాటి అని అనిపించుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విపక్షం వైకాపా నుంచి ఎమ్మెల్యేలను పిలిచి మరీ సైకిల్ ఎక్కించుకోవడాన్ని బాహాటంగా సమర్ధించుకున్న టీడీపీ ఏపీ తమ్ముళ్లు.. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలకు అక్కడి అధికార […]
రేవంత్ సొంత కుంపటి!
తెలంగాణ టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. టీడీపీలో సీనియర్ నేతగా ఎదిగిన రేవంత్.. తెలంగాణలో ఇప్పుడు ఆపార్టీకి కేరాఫ్‌గా మారారనడంలో సందేహం లేదు. అయితే, పాలిటిక్స్ అన్నాక.. భూమి గుండ్రంగా ఉండును. అన్న పద్ధతిలోనే ఉండిపోవు కదా! ఈ క్రమంలోనే రేవంత్ కూడా భవిష్యత్తును అంచనా వేసుకుని.. రాబోయే 2019 ఎన్నికలకు అనుగుణంగా వ్యవహరించాలని, మారాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. […]