తెలంగాణ మీడియాలో టీడీపీకి ఇంపార్టెన్స్ లేదా..!

తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యారైంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాక‌పోయినా.. కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఒంటి కాలిపై లేస్తున్న రేవంత్ రెడ్డి.. గ‌త కొన్నాళ్లుగా మ‌రింత దూకుడుగా ఉన్నాడు. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వాడి వేడిని మ‌రింత పెంచారు. ఇటీవ‌ల ముగిసిన మ‌హానాడు త‌ర్వాత ఈ వాడి మ‌రింత పెరిగింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్ప‌డు ప్ర‌ధాన స‌మ‌స్య‌.. టీడీపీకి మీడియా క‌వ‌రేజ్ ఘోరంగా త‌గ్గిపోయింద‌ట‌! తమ ప‌క్షానే ఉంటాయ‌ని భావించిన ఆ రెండు ప‌త్రిక‌లు […]

తెలంగాణ‌లో ఆ రెండు పార్టీల పొత్తు లేన‌ట్టే..

తెలంగాణ‌లో టీడీపీ బ‌లం గురించి మాట్లాడుకోవ‌డం టైం వేస్ట్ అవుతుంద‌న్న లెక్క‌కు రాజ‌కీయ ప‌రిశీల‌కులు, మేథావులు వ‌చ్చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీ ఒక్క సీటు అయినా గెలుచుకుంటుందా ? అంటే డౌటే అంటున్నారు. టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే సిట్టింగ్ సీటు కొడంగ‌ల్ వ‌దులుకుని క‌ల్వ‌కుర్తి నుంచి పోటీ చేసే అంశంపై ఆలోచ‌న‌లు చేస్తున్నారు. దీనిని బ‌ట్టి అక్క‌డ టీడీపీ ప‌రిస్థితి ఎంత దిగ‌జారిందో అర్థ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌తో […]

రేవంత్ రెడ్డి పాలిటిక్స్‌.. అదిరాయి! ఏపీలో ముద్దు.. తెలంగాణ‌లో వ‌ద్దు!

పాలిటిక్స్ అన్నాక ఎక్క‌డేసే తాళం అక్క‌డ వేయాల్సందే! అయితే, అది సృతి త‌ప్ప‌కుండా మాత్రం చూసుకోవాలి. ఏ మాత్రం సృతి త‌ప్పినా.. నాట‌కం బ‌య‌ట‌ప‌డిపోవ‌డ ఖాయం! ఇప్పుడివ‌న్నీ ఎందుకంటే.. టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి.. చేస్తున్న వ్యాఖ్య‌లు డ‌బుల్ రోల్ పాలిటిక్స్‌ని త‌ల‌పిస్తున్నాయి. ఏపీలో ఉంటే ఒక‌లాగా, తెలంగాణ‌లో ఉంటే మ‌రోలాగా మాట్లాడ‌డం రేవంత్‌కి అల‌వాటైపోయింద‌ట‌! ఇప్పుడు ఆయ‌న వైఖ‌రిపై తెలుగు త‌మ్ముళ్లే ఆశ్చ‌ర్య‌పోతున్నారు. నాలుగు రోజుల కింద‌ట విశాఖ‌లో జ‌రిగిన టీడీపీ మ‌హానాడుకు రేవంత్ […]

మ‌హానాడులో ఆ ఇద్ద‌రూ త‌ప్పా….అంద‌రూ బోర్ 

విశాఖ వేదిక‌గా టీడీపీ నిర్వ‌హించిన అతి పెద్ద పార్టీ పండుగ మ‌హానాడుకు అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జ‌యంతి ఆదివారం రావ‌డంతో ఎక్క‌డెక్క‌డినుంచో అభిమానులు, కార్య‌క‌ర్త‌లు వ‌చ్చారు. అయితే, ఈ మ‌హానాడు సంద‌ర్భంగా అధినేత చంద్ర‌బాబు మొద‌లు కొని ఏపీ, తెలంగాణ అధ్య‌క్షులు, పొలిట్ బ్యూరో స‌భ్యులు ప్ర‌సంగించారు. అయితే, ఈ మూడు రోజుల పండుగ‌లో కేవ‌లం ఇద్ద‌రి ప్ర‌సంగాలు మాత్ర‌మే ఆక‌ట్టుకున్నాయ‌నే టాక్ వ‌చ్చింది. ముఖ్యంగా టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి ప్ర‌సంగానికి […]

మ‌హానాడు ఎఫెక్ట్‌.. రేవంత్ రేటింగ్ పెరిగింది!

పొలిటిక‌ల్‌గా కొంత ఫైర్ బ్రాండ్‌గా ఉండే తెలంగాణ టీడీపీ నేత‌, కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడు సెంటారాఫ్‌ది టాపిక్‌గా మారిపోయాడు. రెండు రోజుల కింద‌ట తెలంగాణ‌లో టీడీపీ మహానాడు జ‌రిగింది. దీనికి పెద్ద ఎత్తున టీడీపీ నేత‌లు హాజ‌ర‌య్యారు. దీనికి టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు కూడా హాజ‌రై దిశానిర్దేశం చేశారు. అయితే, ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న కొన్ని ప‌రిణాలు ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారాయి. ఈ కార్య‌క్ర‌మానికి మొత్తం రేవంత్ అన్నీ తానై […]

టీడీపీతో పొత్తుకు టీ కాంగ్రెస్‌లో వార్‌

వ‌చ్చే ఎన్నిక‌ల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాజ‌కీయాలు చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు తిరిగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఏపీలో జ‌న‌సేన ఎంట్రీతో టీడీపీ – వైసీపీ – జ‌న‌సేన మ‌ధ్య ట్ర‌యాంగిల్ ఫైట్‌కు తెర‌లేస్తోంది. ఇక బీజేపీ – టీడీపీ మ‌ధ్య పొత్తు ఉంటుందా ? లేదా ? అన్న దానిపై కూడా ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే పొరుగు తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌లో నిన్న‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ దూకుడుతో వార్ వ‌న్‌సైడ్‌గానే ఉంటుంద‌ని అంద‌రూ […]

తొందరపడొద్దు భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ గురించి ఆలోచిద్దాము

తెలంగాణ పాలిటిక్స్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర‌ను సంపాదించుకున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఆ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబే పొలిటిక‌ల్‌గా అణ‌గ‌దొక్కుతున్నార‌ట‌! ఇప్పుడు దీనిపైనే తెలంగాణ‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి చంద్ర‌బాబు ఏపీకి ప‌రిమిత మైన నేప‌థ్యంలో తెలంగాణ‌లో కేసీఆర్‌కు దీటుగా టీడీపీ త‌ర‌ఫున మాట్లాడుతున్న ఏకైక వ్య‌క్తి రేవంత్ అని ఒప్పుకోక త‌ప్ప‌దు. దీంతో కేసీఆర్‌కి మొగుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది రేవంతే అనే టాపిక్ పుట్టింది. ఈ నేప‌థ్యంలో 2019 […]

రేవంత్‌పై ఉన్న న‌మ్మ‌కం టీడీపీపై లేదా? 

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ స‌ర్వేలు కూడా జోరందుకుంటాయి. ఇందులో కొన్ని స‌ర్వేలు ఆశ్చ‌ర్య‌కంగానూ, మ‌రికొన్ని షాకింగ్‌గానూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణాలో నిర్వ‌హించిన ఒక స‌ర్వేలో షాకింగ్ ఫ‌లితాలు వచ్చాయి. ముఖ్యంగా ఇవి తెలుగుదేశం, కాంగ్రెస్‌కు పార్టీల‌కు ఒక తీపి, ఒక చేదు వార్త‌ను అందించాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో సీఎం కేసీఆర్.. అత్యంత పాపుల‌ర్ నాయ‌కుడు. వారి త‌ర్వాత ఎవ‌రు అంటే? కేటీఆర్‌, హ‌రీశ్‌రావు ఇలా పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఈ స‌ర్వే ప్ర‌కారం కేసీఆర్ త‌ర్వాత.. అంత‌టి […]

బీజేపీని వ‌దిలించుకునే ప‌నిలో టీటీడీపీ

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఎవ‌రూ ఉండ‌రనే సూత్రాన్ని టీటీడీపీ వంట‌బ‌ట్టించుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో బీజేపీతో జ‌త క‌ట్టినా.. ప్ర‌స్తుతం మిత్ర బంధం తెగిపోయేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అస్థిత్వం కోసం జ‌రిగే పోరాటంలో కొత్త మిత్రుల వేట‌లో టీటీడీపీ నేత‌లు వెదుకులాట ప్రారంభించారు. టీడీపీకి శ‌త్రువయిన కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ముఖ్యంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని ప‌రోక్షంగా అధినేత చంద్ర‌బాబు ముందు ఉంచ‌డం ఇప్పుడు […]