చంద్ర‌బాబు హ‌డావిడి వెన‌క క‌థేంటి..!

రాష్ట్రంలో ఇటు అధికార ప‌క్షం, అటు విప‌క్షం రెండూ అప్పుడే మ‌రో సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చేశాయా? అన్నంత హ‌డావుడి మొద‌లు పెట్టేశాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న న‌వ‌ర‌త్నాలు, వైఎస్సార్ ఫ్యామిలీ వంటి కార్య‌క్ర‌మాల‌తో జ‌నంలోకి వెళ్తున్నారు. ఇక‌, టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు తాజాగా సోమ‌వారం ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మాన్ని షురూ చేశారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఆలు లేదు చూలు లేదు.. కొడుకు పేరు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ ఇద్ద‌రిపైనా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు […]

బాబుపై తెలుగు త‌మ్మ‌ళ్ల గ‌రంగ‌రం

అధికార టీడీపీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. త‌మ్ముళ్ల‌కు కంటిపై కునుకు కూడా ఉండ‌డం లేదు. 2019 ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర పైగా స‌మ‌యం ఉండ‌గానే వాళ్ల‌లో పెద్ద ఎత్తున ఆందోళ‌న క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము గెలుస్తామో లేదో.. ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఆద‌రిస్తారో లేదో.. అనే ఆందోళ‌న క‌న్నా అధినేత త‌మ‌ను అక్కున చేర్చుకుంటారా? లేదా? అనే దిగులే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేల‌ను ఏదో ఒక రూపంలో హ‌డావుడికి గురి చేస్తున్న టీడీపీ అధినేత, […]

నంద్యాల ఫ‌లితం త‌ర్వాత‌…. పీకే-జ‌గ‌న్ మ‌ధ్య ఏం జ‌రిగింది

నంద్యాల ఉప ఎన్నికకు ముందు వ‌ర‌కు వైసీపీ ఎన్నికల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ పేరు ఓ రేంజ్‌లో మార్మోగింది. నార్త్‌లో ప్ర‌ధాన‌మంత్రి మోడీ నుంచి ప‌లు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో వ్యూహ‌క‌ర్త‌గా స‌క్సెస్ ఫుల్ రిజ‌ల్ట్ ఇచ్చిన పీకే ఏపీలో వైసీపీకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా రావ‌డంతో అంద‌రి దృష్టి ఆయ‌న‌మీదే ఉంది. ఆయ‌న వ్యూహాలు ఇక్క‌డ కూడా వైసీపీకి ప‌ని చేస్తాయ‌న్న న‌మ్మ‌కంతో చాలా మంది ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో పీకే త‌న వ్యూహాలు అమ‌లు చేశారు. […]

2019పై బాబు ప‌ట్టు.. మూడు `పీ`ల‌తో ముందుకు!

ల‌క్ష్యం ఉండ‌డం ఒక ఎత్తు.. ఆ లక్ష్యాన్ని సాధించే మార్గం అనుస‌రించ‌డం మ‌రో ఎత్తు! ఈ రెండూ జ‌త‌కలిస్తేనే విజ‌యం చేరువ‌య్యేది. ఈ సూత్రాన్ని గ‌ట్టిగా తెలిసిన, మ‌రింత గ‌ట్టిగా న‌మ్మిన నాయ‌కుడు చంద్ర‌బాబు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఆయ‌న మ‌రింత సీరియ‌స్‌గా ఫాలో అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 2019 ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డ‌మే కాదు.. మ‌రో 50 ఏళ్ల పాటు అధికారంలోనే ఉండాల‌ని స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాల‌ను నిర్ణ‌యించుకున్న బాబు.. నాలుగు గోడ‌ల మ‌ధ్య కూర్చుని క‌ల‌లు క‌న‌డం లేదు. […]

ఏపీ రాజ‌కీయాలు ఇలానే ఉంటే ఎవ‌రికి లాభం..?

రాష్ట్ర రాజ‌కీయాలు ఏక‌ప‌క్షం అవుతున్నాయా? రాష్ట్రంలో టీడీపీ కేంద్రంగా రాజ‌కీయం మారిపోతోందా? విప‌క్షాలను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డంలేదా? దేశంలో అతి పెద్ద, అతి సీనియ‌ర్ జాతీయ రాజ‌కీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు నామ‌రూపాలు లేకుండా పోతోందా? ముఖ్యంగా ద‌క్షిణాదిలో కాంగ్రెస్ కుకంచుకోట వంటి ఏపీలో ఆ పార్టీ నిలువ‌నీడ కోల్పోయి అలో ల‌క్ష్మ‌ణా అంటోందా? ఏపీ ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న జ‌గ‌న్ ప‌రిస్థితి దారుణంగా త‌యారైందా? అంటే.. తాజా రెండు ఎన్నిక‌ల ఫ‌లితాలు ఔన‌నే స‌మాధాన మిస్తున్నాయి. […]

మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్ పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై కొత్త ట్విస్ట్‌

స‌మైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చివ‌రి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కిర‌ణ్ పొలిటిక‌ల్ రీ ఎంట్రీ బీజేపీతో ఉంటుద‌ని కొంద‌రు, కాదు కాదు జ‌న‌సేన‌తో ఉంటుంద‌ని మ‌రి కొంద‌రు ప్రచారం చేశారు. కిర‌ణ్ జ‌న‌సేన‌లోకి వెళితే ప‌వ‌న్ త‌న త‌ర్వాత పార్టీలో రెండో ప్లేస్ క‌ట్టబెడ‌తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అలాగే బీజేపీలో చేరాల‌ని కూడా కిర‌ణ్ భావించినా వెంక‌య్య ఆయ‌న బీజేపీ ఎంట్రీని అడ్డుకున్నార‌ని కూడా అప్ప‌ట్లో […]

నంద్యాల‌లో వైసీపీ ఓట‌మి వెన‌క కొత్త‌కోణం

నిజ‌మేనా? ఈ వ్యాఖ్య‌లు స‌రైన‌వేనా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది నంద్యాల‌లో స్థానికంగా ఉంది రాజ‌కీయ, ఎన్నిక‌ల స‌ర‌ళిని ద‌గ్గ‌రుండి మ‌రీ ప‌రిశీలించిన విశ్లేష‌కుల‌కు!! జ‌గ‌న్ టీంలోనే ఉండి జ‌గ‌న్‌కు గోతులు తీసిన వాళ్లు ఉన్నార‌ని వీరు ఖ‌చ్చితంగా చెబుతున్నారు. అనేక మంది శ‌ల్య సార‌థ్యం చేశార‌ని కూడా చెబుతున్నారు. నంద్యాల‌లో గెల‌వక ముందే చాలా అహంభావంతో ఉన్నాడ‌ని, ఇక్క‌డ గెలిస్తే.. అస్స‌లు ప‌ట్టుకోలేమ‌ని, మ‌న‌ల్ని కూడా ఎద‌గ‌నివ్వ‌డని ప‌లువురు సొంత పార్టీ నేత‌లు, కుటుంబంలోని వ్య‌క్తులే […]

నంద్యాల రిజ‌ల్ట్ టీడీపీ, వైసీపీ ఇద్ద‌రికీ గుణ‌పాఠ‌మే.. ఇలా

ఓ పెద్ద తుఫాను తీరం దాటింది! నంద్యాల ఉప పోరు ఫ‌లితం వెల్ల‌డైపోయింది. గెలుపు అధికార ప‌క్షం సైకిలెక్కేసింది. రివ్వున తిరుగుతుంద‌ని అనుకున్న ఫ్యాన్‌కు రెక్క‌లు తెగిపోయాయి. ఇక‌, మ‌ళ్లీ ఎన్నిక‌లు రావాలంటే ఏడాదిన్న‌ర‌కు పైగా ఆగాల్సిందే. అయితే, ఈ నంద్యాల పోరు.. నిన్న‌టి ఫ‌లితం అటు అధికార ప‌క్షానికి, ఇటు విప‌క్షానికీ అనేక పాఠాలు నేర్పుతోంది. భ‌విష్య‌త్ వ్యూహాల‌కు ఎలా ప‌దును పెట్టాలి? ప‌్ర‌జ‌ల నాడి ఏమిటి? రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు ఎంత సంయ‌మ‌నంగా వ్య‌వ‌హ‌రించాలి? ఎంత […]

వ్యూహ‌క‌ర్త‌ల‌కు ఏపీలో ప్లేస్ లేదా?

వైసీపీ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. అన‌గానే ముందుగా ఏపీ ప్ర‌జ‌లంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇక్క‌డ ప్ర‌శాంత్ కిషోర్‌ని నియ‌మించుకున్నందుకు కాదు.. వ్యూహ‌క‌ర్త అనే కొత్త మాట విని అవాక్క‌య్యారు. నిజ‌మే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఇటువంటి ప‌దాన్ని విన‌లేదు ఏపీ ప్ర‌జ‌లు! ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి సీనియ‌ర్ నాయ‌కుల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని వ్యూహాలు ఉంటే.. కొత్త‌గా వీట‌న్నింటినీ అమ‌లు చేయ‌డానికి వేరే ప్రాంతంపు వ్య‌క్తి ఎందుకో అని స‌న్నాయినొక్కులు కూడా నొక్కిన వాళ్లు లేక‌పోలేదు. అయితే ఇప్పుడు ఈ పీకేల వ‌ల్ల ఏపీలో […]