పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన వచ్చే 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అదేసమయంలో తాను అనంతపురం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే పవన్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన నెత్తురు మండే కత్తుల్లాంటి యువతకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించి.. ఇప్పటికే జిల్లాల వైజ్‌గా యువతను పార్టీలోకి ఆహ్వానించి వారికి వివిధ రంగాల్లో పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాడు. వాస్తవానికి దీని వెనుక పెద్ద వ్యూహాన్నే పవన్ ఫాలో అవుతున్నాడని సమాచారం. యువకులకు […]
Tag: pawan kalyan
`తూర్పు`లో జనసేనలోకి భారీ జంపింగ్‌లు
2019 ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు గానీ.. నేతలు మాత్రం ఆ పార్టీలో చేరాలని ఉవ్విళ్లూ రుతున్నారు. ఎప్పుడెప్పుడు జనసేనాని `ఊ` అంటారా.. ఎప్పుడెప్పుడు పార్టీలోకి చేరిపోదామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సామాజికవర్గం బలంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు నేతలంతా పవన్ సరసన చేరేందుకు సిద్ధమైపోయారట. జిల్లాలో పవన్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్న నేతలు ప్రయత్నాలను ఇప్పటినుంచే మొదలు పెట్టారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ […]
కమ్యూనిస్టులకు పవన్ దెబ్బేశాడుగా!
తనకు కమ్యూనిస్టులంటే గౌరవం ఉందని, వాళ్ల భావజాలం.. తన భావజాలంలో సారూప్యత ఉందని.. అవసరమైతే వాళ్లతో కలిసి పనిచేసేందుకైనా సిద్ధమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంకేతాలు ఇస్తూ వస్తున్నాడు. దీంతో కమ్యూనిస్టులు కూడా పవన్ తమతో దోస్తీకడతాడని ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే వారికి పవన్.. కూడా హ్యాండ్ ఇచ్చాడు. ప్రభుత్వ వైఫల్యాలు, విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, ఇందుకు పవన్ కూడా తోడయితే తమకు మైలేజ్ వస్తుందని భావించిన కమ్యూనిస్టుల ఆశలు గల్లంతయ్యాయి. […]
పవన్ పోటీకి దిగితే బాబు పొలిటికల్ అస్త్రం రెడీనా..!
2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించడంతో ఇప్పుడు ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారనే విషయంపై సందిగ్ధం నెలకొంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అనంతపురంలో సినీ, రాజకీయ ప్రముఖులు పోటీలో ఉండటంతో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్‌పై పోటీచేసే అభ్యర్థి విషయంలో టీడీపీ నేతలు, ముఖ్యంగా ఏళ్లుగా రాజకీయాలను శాసిస్తున్న జేసీ వర్గం ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడి సామాజికవర్గ […]
తెలంగాణలో కొత్త పార్టీతో పవన్ పొత్తు..!
ఏపీ, తెలంగాణలో 2019 ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతోన్న జనసేన ఏ రాష్ట్రంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది ? అన్నది ఆసక్తిగా ఉంది. ఏపీలో జనసేనకు ఇప్పటి నుంచే క్రేజ్ కనపడుతోంది. ఆ పార్టీతో పొత్తుకు రెడీ అని ఇప్పటికే కమ్యూనిస్టులు ప్రకటించారు. ఇక వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సైతం జనసేనతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లాభాలను జగన్‌కు చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తెలంగాణలోనూ జనసేన పార్టీ పోటీ చేయాలని […]
టాలీవుడ్ నుంచి జనసేనలోకి చేరికలు?
ప్రత్యేకహోదాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఉద్యమాలకు టాలీవుడ్ హీరోలు తమ మద్దతు ప్రకటించలేదు. కానీ హోదా ఇస్తామని మాట ఇచ్చి వంచించిన బీజేపీపై ట్వీట్లు, బహిరంగ సభల ద్వారా పవన్ విరుచు కుపడ్డారు. హోదాపై పవన్ చేసిన పోరాటం మెచ్చిన ఒక టాలీవుడ్ హీరో.. ఇప్పుడు జనసేన వైపు చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం! సినీనటుడిగానే గాక రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్న హీరో శివాజీ! ప్రస్తుతం పవన్ కల్యాణ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా […]
గుంటూరు జిల్లాలో ఆ సీటు జనసేనదేనా..?
ఏపీలో జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో గుంటూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ ఈ జిల్లాలో సీట్లు గెలవకపోయినా గణనీయంగా ఓట్లు సాధించింది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్నికల రంగంలో ఉండడంతో మరోసారి గుంటూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ జరగనుంది. ప్రస్తుతం జిల్లాలో జనసేన ఊపు అంతగా లేకపోయినా ఎన్నికల నాటికి ఈ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో సత్తా చాటే […]
జనసేన సీటు రేటు కోట్లు పలుకుతోందా…
ప్రశ్నిద్దాం అంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పార్టీ పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాల్లో ఆ రెండు పార్టీలతో క్రమక్రమంగా విబేధిస్తూ వచ్చిన పవన్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరుకు రెడీ అవుతున్నారు. జనసేన వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేసి తీరుతుందని, తాను ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ స్వయంగా ప్రకటించి […]
పవన్ చేతిలో గోపీచంద్ ఫ్యూచర్
ఈ హెడ్డింగ్ కాస్త విచిత్రంగానే ఉన్నట్లుంటుంది. పవన్‌కళ్యాణ్‌కు గోపీచంద్‌కు లింకేంటి ? పవన్ చేతిలో గోపీచంద్ ఫ్యూచర్ ఏంటబ్బా అని బుర్రబద్దలు కొట్టేసుకుంటాం. కాటమరాయుడు సినిమా తర్వాత ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ అగ్రనిర్మాత ఏఎం.రత్నం నిర్మాతగా కోలీవుడ్ డైరెక్టర్ ఆర్‌టీ.నీశన్ డైరెక్షన్‌లో తెరకెక్కే సినిమాలో నటించాల్సి ఉంది. పవన్ , త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసేందుకే మరో మూడు, నాలుగు నెలలు పడుతోంది. […]