ఈ ప్ర‌శ్న‌కు బాబు, ప‌వ‌న్‌, జ‌గ‌న్‌లు ఏమంటారో?

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీకి తీర‌ని అన్యాయం జ‌రిగింది. రాజ‌ధానిని కోల్పోయింది. ఆదాయం కోల్పోయింది. పెద్ద ఎత్తున వ‌న‌రుల‌ను కోల్పోయింది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌యం. ఈ విష‌యంలో కేంద్రం మెడ‌లు వంచి విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌త్యేక హోదా తెప్పించుకోవ‌డం, లోటు బ‌డ్జెట్ నిధులు విడుద‌ల‌య్యేలా చూడ‌డం, అప్ప‌లు, ఆస్తుల విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ అభివృద్ధి చెందేలా చూడ‌డం వంటివి ఏపీలో అధికార‌, విప‌క్ష పార్టీల‌పై ఉన్నాయి. దీనికి తోడు ప్ర‌శ్నిద్దాం […]

మైండ్ బ్లాక్ చేస్తోన్న ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా ప్రి రిలీజ్

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమా అంటేనే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది మంచి స‌క్సెస్ సాధించాయి. అత్తారింటికి దారేది సినిమా అయితే అప్పటి వ‌ర‌కు ఉన్న ఇండ‌స్ట్రీ రికార్డులు బీట్ చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇక తాజాగా వీరి కాంబోలో తెర‌కెక్కుతోన్న తాజా సినిమాపై అప్పుడే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా హక్కుల ధరలు […]

హోదాపై ప‌వ‌న్ కూడా ఢిల్లీకి దాసోహ‌మా?!

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌ధాని కోల్పోయి, అటు ఆర్థికంగా, ఇటు ఉద్యోగాల ప‌రంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీ విష‌యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎంతో స‌పోర్టింగ్‌గా మాట్టాడిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయాడు. అది కూడా రెండు రోజుల కింద‌ట బీజేపీ ర‌థ సార‌థి.. అమిత్ షా విజ‌య‌వాడ గ‌డ్డ‌పై .. తాము హోదా క‌న్నా ఎక్క‌వే ఇచ్చామ‌ని, హోదా ఉన్న రాష్ట్రాల‌కు కూడా ఇంత క‌న్నా ఏమీ ద‌క్క‌డం లేద‌ని […]

పవన్ బన్నీ వార్ కు భయపడుతున్న డైరెక్టర్

టాలీవుడ్‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ క‌టౌట్ ఉంటే చాలు ప్లాప్ సినిమాల‌కు కూడా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంది. ఇక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్ హీరోల‌కు షాక్ ఇచ్చేలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. మెగా అభిమానుల్లో ఈ ఇద్ద‌రు హీరోల‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. గ‌త కొద్ది రోజులుగా జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల ప‌వ‌ర్‌స్టార్ వ‌ర్సెస్ స్టైలీష్‌స్టార్ మ‌ధ్య చిన్న‌పాటి కోల్డ్‌వార్ జ‌రుగుతోంది. హీరోల […]

ఏపీలో తాజా ప‌రిణామాలు రాజ‌కీయ వ్యూహాత్మ‌కమా ..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో కూర‌లో ఓ క‌రివేపాకు చందంగా మారాడా ? అంటే తాజాగా ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. అస‌లు ప‌వ‌న్ రాజ‌కీయ ల‌క్ష్యం ఏంటి ? ప‌వ‌న్‌కు రాజ‌కీయాల్లో రాణించాల‌న్న క్లారిటీ ఉందా ? లేదా ? ప‌వ‌న్‌కు సినిమాలు ముఖ్య‌మా ? రాజ‌కీయాలు ముఖ్య‌మా ? అన్నదే ఇప్పుడు అంద‌రి మ‌దిలోను పెద్ద క‌న్‌ఫ్యూజ‌న్‌గా మారుతోంది. ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా […]

ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ మూవీ స్టోరీ లీక్‌..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అత్తారింటికి దారేది త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలో భారీ అంచ‌నాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ద‌గ్గ‌ర నుంచి స్టోరీ దాకా అన్ని హాట్ న్యూస్‌లుగా నిలుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ లైన్ సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ఓ […]

జ‌న‌సేనలో సామాన్యుల‌కు చోటు లేదా?!

ఏపీలో నూత‌న పార్టీ జ‌న‌సేన చుట్టూ ఇప్పుడు ఆస‌క్తికర చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌డిచిన వారం రోజులుగా ఈ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఆహ్వానం పలుకుతోంది. అంతేకాదు, జ‌న‌సేన‌లో కీల‌క పోస్టుల నియామ‌కం కూడా చేస్తోంది. దీనికిగాను ఎంట్రీ టెస్ట్‌లు నిర్వ‌హించ‌డం బ‌హుశ దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు. ఏ పార్టీ కూడా ఇంత రేంజ్‌లో ఎంట్రీ టెస్ట్‌లు పెట్టి కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను నియ‌మించిన సంద‌ర్భాలు లేవు. నిజానికి ఐఏఎస్ చ‌దివి.. ఉద్యోగానికి రిజైన్ చేసి లోక్‌స‌త్తా స్థాపించిన జేపీ […]

ఏపీలో జనసేనతో కొత్త ఫ్రంట్‌

2019 ఎన్నిక‌లు తెలంగాణ‌లో కంటే ఏపీలో ర‌స‌కందాయంగా ఉండేలా క‌నిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంత గ్యాప్ ఉన్నా మ‌రోసారి అధికార కూట‌మి అయిన టీడీపీ+బీజేపీ కూట‌మి క‌లిసి పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్‌గా క‌నిపిస్తోంది. విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ మోడీని క‌లిసిన నేప‌థ్యంలో వైసీపీ, బీజేపీ పొత్తు ఉండ‌వ‌చ్చ‌ని ఊహాగానాలు ఉన్నా అది మాట‌లో లేదా ప్ర‌క‌ట‌న‌ల‌కో మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వ్వ‌డం ఖాయం. ఇక కొత్త‌గా ఎంట్రీ ఇస్తోన్న జ‌న‌సేన సైతం కూట‌మికి తెర‌లేపే సూచ‌న‌లు మెండుగా ఉన్న‌ట్టు […]

సినిమాల్లో అన్న‌య్య‌.. రాజ‌కీయాల్లో తమ్ముడు

టాలీవుడ్ టాప్ హీరోలు నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవి మ‌ధ్య ఎప్పుడూ ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉండేది. ఇటీవ‌ల సంక్రాంతి బ‌రిలోనూ వీరు ఢీ అంటే ఢీ అన్నారు. ఇప్పుడు రాజ‌కీయాల్లో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు పోటీగా మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధ‌మ‌వుతున్నాడు. అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. ఈ దిశ‌గా ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ జిల్లాలోని హిందూపురం నుంచి బాల‌య్య బ‌రిలో ఉండ‌టం, ఆయ‌న‌పై ఇటీవ‌ల […]