నో సీట్: ఆ జిల్లాలో భారీ మార్పు?

సరిగ్గా ఆరు అంటే ఆరు నెలలు…ఈ లోపు ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగు పరుచుకోకపోతే మొహమాటం లేకుండా నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వనని సీఎం జగన్..ఇటీవల వైసీపీ వర్క్ షాపులో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే గడప గడపకు వెళ్ళడంలో కొందరు ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని, వారికి ఇంకో ఆరు నెలల సమయం ఇస్తున్నానని, ఈలోపు వారు ప్రజల దగ్గరకు వెళ్ళి…వారి మద్ధతు పెంచుకోకపోతే…నెక్స్ట్ సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, తర్వాత తన మీద అలిగిన ప్రయోజనం లేదని […]

జగన్ క్లాస్: ఆ ఎమ్మెల్యేలకు సీటు డౌటే?

సీఎంగా తాను చేయాల్సిన పనులు చేస్తున్నానని, ఇంకా చేస్తూనే ఉన్నానని, కానీ ఎమ్మెల్యేలుగా మీరు చేయాల్సిన పని చేస్తేనే…విజయం సాధ్యమవుతుందని, తాను కష్టపడుతున్నానని, తనకు వంద సమస్యలున్నాయని, అయితే ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలని, తనతోపాటు ఎమ్మెల్యేలూ శ్రమిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి సీఎం జగన్…తాజాగా ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న జగన్…సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు క్లాస్ తీసుకుంటూనే ఉన్నారు. తాను సమయానికి బటన్ నొక్కి ప్రజలకు […]

ఏం జరుగుతోందో నాకు తెలియాలి?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ అనుభవం తక్కువే అయినా సీనియర్ పొలిటీషియన్ల ఆలోచనల కంటే పది అడుగులు ముందుంటాడు. ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరూ ఊహించని డిసిషన్ తీసుకుంటాడు. అందుకే పార్టీని స్థాపించి.. అధికారాన్ని తెచ్చి.. ఒంటిచేత్తో నడుపుతున్నాడు. ఓ వైపు సీఎంగా ప్రభుత్వాన్ని.. మరో వైపు అధ్యక్షుడిగా పార్టీని విజయవంతంగా నడుపుతున్నాడు. ఆయన నిర్ణయం తీసుకున్నాడంటే తిరుగుండదు అంతే.. ఎవరూ ఎదురు చెప్పలేరు. ఎవ్వరినీ ఓ పట్టాన నమ్మడు.. నమ్మితే వదలడు […]

కేసీఆర్ లో ఈ మార్పునకు కారణం ఈటలేనా?

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. టీఆర్ఎస్ చీఫ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆయన ఎవరు చెప్పిందీ వినరు.. అనుకున్నది చేస్తారు.. అంతే.. ఇదీ ఇన్నాళ్లూ కేసీఆర్ పై పార్టీ శ్రేణులు, ప్రభుత్వ పెద్దల్లో ఉన్న అభిప్రాయం. మీడియా సమావేశాల్లోనూ అంతే.. ఆయన చెప్పేది వినాల్సిందే.. ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పాలంటే ఎదురు దాడే.. అయితే ఇటీవల కాలంలో గులాబీ బాస్ లో మార్పు కనిపిస్తోంది. ఎవరు చెప్పినా వింటున్నారు.. మాట్లాడేందుకు అవకాశమిస్తున్నారు.. దీంతో కారు పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఖుషీ […]

చిన్నమ్మను ఇరుకున పడేస్తున్న తమిళనాట రాజకీయాలు

త‌మిళ‌నాడు అంతా ఇప్పుడు `చిన్న‌మ్మ‌` నామం జ‌పిస్తోంది. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత తర్వాత‌.. ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ కేంద్రంగానే రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. పార్టీ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శిగా ఆమెను ఎన్నుకున్న త‌ర్వాత‌.. శ‌శిక‌ళ సీఎం కావాల‌ని ప‌లువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అందుకు రంగం కూడా సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో శ‌శిక‌ళ‌కు ఊహించ‌ని, దిమ్మ‌తిరిగే షాకులు త‌గిలాయి. ఇందులో ఒక‌టి జ‌య నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఆర్ కే న‌గ‌ర్ నుంచి కాగా.. మ‌రొకటి అమ్మ వీరాభిమాని న‌ట‌రాజ‌న్ నుంచి కావ‌డం విశేషం!! జ‌య […]

ఏపీ టీడీపీ నేత‌ల పూజ‌లు ఎందుకో..!

ఇప్పుడు ఏపీలో ఏ ప్ర‌ముఖ దేవాల‌యంలో చూసినా.. చంద్ర‌బాబు కేబినెట్‌లోని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలే క‌నిపిస్తున్నారు! ఇది జోక్ కాదు నిజ‌మే! అయితే, వారు దేవుడి మీద భ‌క్తి ఉండి వెళ్తున్నారా?  లేక వాళ్ల మ‌న‌సులో ఉన్న కోరిక తీర్చ‌మ‌ని అడిగేందుకు వెళ్తున్నారా?  లేక త‌మకున్న ప‌ద‌వీ గండం త‌ప్పించ‌మ‌ని కోరేందుకు వెళ్తున్నారా? అంటే మాత్రం ఒక్కొక్క‌ళ్ల‌ది ఒక్కో కోరిక అని చెప్ప‌క త‌ప్ప‌దు. సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రిస్తాన‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అయితే, […]

ఆ ఎమ్మెల్యేలు డ‌మ్మీలుగా మారారా..!

ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నాఇపుడు తెలంగాణ‌కు కేసీఆర్ మ‌హారాజు.. రాష్ట్రంలో ఆయ‌న‌కు గట్టిగా ఎదురుచెప్పే సాహ‌సం మాట దేవుడెరుగు… ఆయ‌న పాల‌న‌లోని లోపాల‌ను వెదికేందుకూ ఎవ‌రికీ ధైర్యం చాలడంలేదు. ఆఖ‌రికి మీడియా సైతం ఆయ‌న అడుగుల‌కు మ‌డుగులొత్తాల్సిందే..  అవ‌స‌ర‌మైతే తెలంగాణ ప్ర‌జ‌ల సెంటిమెంటు అస్త్రాన్ని ఇప్ప‌టికీ ఎప్పుడు ఎలా వాడుకోవాలో… ఏ మోతాదులో ఉప‌యోగించాలో.. ఆయ‌నకు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ  తెలియ‌క‌పోవ‌డ‌మే కేసీఆర్ అస‌లు బ‌ల‌మ‌ని ఇక్క‌డ గుర్తించాలి. ప్ర‌స్తుతం కేసీఆర్ ప్ర‌భుత్వంలో ఆయ‌న కుటుంబ స‌భ్యులు త‌ప్ప మిగిలిన […]