ఈద్ సంద‌ర్భంగా స్పెష‌ల్ వీడియో షేర్ చేసిన బాల‌య్య‌!

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ ఎంతో ప‌ర‌మ పవిత్రంగా జ‌రుపుకునే పండుగ ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ మాసం ముగింపు రోజుగా ఈ పండ‌గ‌ను చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే నేడు ముస్లింలంతా ఈద్ ను జరుపుకుంటున్నారు. అయితే క‌రోనా కార‌ణంగా.. ఎప్పటిలా మసీదులు, దర్గాలకు వెళ్లకుండా ఎవరిళ్లలో వారే ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈద్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ముస్లిమ్ సోదరులకు నట సింహా నందమూరి బాలకృష్ణ స్పెష‌ల్ వీడియో ద్వారా ఈద్ పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. `ముస్లిం […]

ప్రభుదేవాపై శ్రీ‌రెడ్డి టార్గెట్..నాశ‌నం చేశాడంటూ షాకింగ్ కామెంట్స్‌!

సల్మాన్ ఖాన్, దిశా పటానీ జంట‌గా ప్రభుదేవా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం రాధే. ఈ చిత్రాన్ని ఈద్ పండ‌గ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ జీ 5లో విడుద‌ల చేశారు. భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. రొటిన్ మాస్ మసాలా రివేంజ్ స్టోరీని సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా తెరకెక్కించాడని నెటిజన్స్ తమదైన రివ్యూలు ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంపై సంచలన తార శ్రీ రెడ్డి కూడా రివ్యూలో […]

అభిమానుల‌కు ఊర‌ట‌నిచ్చిన ఎన్టీఆర్‌..త్వ‌ర‌లోనే..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్ల‌డించారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని.. నేను బాగానే ఉన్నాన‌ని ఎన్టీఆర్ తెలిపాడు. అయిన‌ప్ప‌టికీ, ఎన్టీఆర్ అభిమానులు క‌ల‌వ‌ర‌ప‌డుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఎన్టీఆర్.. ఈరోజు రంజాన్ పర్వదినం కావడంతో ముస్లింలకు సోష‌ల్ మీడియా ద్వారా ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే త‌న ఆరోగ్యంపై కూడా స్పందించి.. ఫ్యాన్స్‌కు కాస్త […]

భార‌త్‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు..భారీగా మ‌ర‌ణాలు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గత 24 గంటల్లో భారత్‌లో 3,43,144 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,46,809 కు చేరుకుంది. […]

క‌రోనా బాధితులకు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ అప‌న్న‌హ‌స్తం!

సెకెండ్ వేవ్‌లో క‌రోనా ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి కాటుకు ప్ర‌తి రోజు వేల మంది బ‌లైపోతుండ‌గా.. ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్‌లో హాస్ప‌ట‌ల్స్‌లో బెడ్స్ కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉంది. ఇలాంటి త‌రుణంలో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా ప్ర‌ముఖు త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగుదాస్ కూడా క‌రోనా బాధితులకు అప‌న్న‌హ‌స్తం అందించారు. క‌రోనా రిలీఫ్ ఫండ్ కింద […]

ద‌ర్శ‌కుల‌ను ఇర‌కాటంలో పెడుతున్న సోనూసూద్ ఇమేజ్‌!?

రీల్ లైఫ్‌లో విల‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్‌.. రియ‌ల్ లైఫ్‌లో మాత్రం సూప‌ర్ హీరో అనిపించుకున్నాడు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో ఎంద‌రో వలస కార్మికులకు అండ‌గా నిలిచిన సోనూ.. సెకెండ్ వేవ్‌లో అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ క‌రోనా బాధితుల‌ను ఆదుకుంటున్నారు. హాస్పిటల్ బెడ్, ఆక్సిజన్, మందులు, డబ్బు సహాయం..ఇలా ఏది కావాలని అడిగినా నిమిషాల్లో అరెంజ్ చేస్తూ దేశ ప్ర‌జ‌ల పాలిట దేవుడయ్యాడు. ఈ క్ర‌మంలోనే సోనూ ఇమేజ్ తారా స్థాయికి చేరుకుంది. అయితే […]

అరుదైన గుర్తింపు ద‌క్కించుకున్న సూర్య సినిమా!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లేడి డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర కాంబోలో తెర‌కెక్కిన చిత్రం ఆకాశం నీ హద్దురా!( త‌మిళంలో సూరారై పోట్రు). ఇటీవ‌లె ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అయితే తాజాగా సూరారై పోట్రు చిత్రానికి అరుదైన గుర్తింపు ద‌క్కింది. చైనాలోని ప్రధాన నగరం షాంఘైలో జరిగిన అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఈ సినిమా ఎంపికైంది. ఈ […]

`పుష్ప 2`కు బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. కథా పరిధిని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాడు. మొద‌టి భాగం ఈ ఏడాది విడుద‌ల కానుండ‌గా.. రెండో భాగం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. […]

మృత్యువును ఆపేసే `టాబ్లెట్`తో వ‌స్తున్న వ‌ర్మ‌!

హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన వ‌ర్మ‌.. ఇప్పుడు కేవ‌లం కాంట్రవర్సీ సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో.. ఇటీవ‌లె స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ను స్థాపించి డీ-కంపెనీ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. ఇక ఇప్పుడు ఈ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల కాబోతోన్న మరో సినిమా టాబ్లెట్. తాజాగా వ‌ర్మ టాబ్లెట్ ఫస్ట్ […]