ఒక్కటైన గుత్తా జ్వాల-విష్ణు విశాల్..పెళ్లి ఫొటోలు వైర‌ల్‌!

బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా, కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ డేటింగ్‌కు బై బై చెప్పి.. ఎట్ట‌కేల‌కు వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. నేటి మధ్యాహ్నం వీరిద్దరు వివాహం చేసుకున్నారు. హైదరాబాదులోని మొయినాబాదులో జరిగిన వీరి విహానికి క‌రోనా కార‌ణంగా కొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే భారత్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చేతన్‌ ఆనంద్‌ను 2005లో వివహం చేసుకున్న జ్వాల .. 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. మ‌రోవైపు 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న […]

క్వారంటైన్ లోకి మహేష్ బాబు..!?

కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటు కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా వదిలి పెట్టట్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా, తాజాగా మహేష్ బాబు క్వారంటైన్లోకి వెళ్లడం అందరిలో కలకలం రేపుతోంది. తాజాగా మహేష్ పర్సనల్ స్టైలిష్ట్ కరోనా బారిన పడ్డారని సమాచారం. అతనితో […]

నితిన్ సినిమాపై క‌రోనా దెబ్బ‌..షూటింగ్‌కు బ్రేక్‌?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో హిట్ అయిన `అంధాదున్` సినిమాకి రీమేక్‌గా మాస్ట్రో తెర‌కెక్కుతోంది. జూన్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రయూనిట్. ఈ క్ర‌మంలోనే షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తుండ‌గా.. […]

teacher

తెలంగాణ టీచర్స్ కు శుభవార్త ..అప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్.. !

రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు బాగా విజృంభిస్తున్న క్రమంలో ఇప్పటికే అన్ని పరీక్షలను రద్దు చేశారు ప్రభుత్వం. మరి కొన్ని వాయిదా వేశారు. తెలంగాణ పాఠశాలలకు మాత్రం విద్యార్థులు లేకపోయినా ఉపాధ్యాయులు ఇంకా వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏప్రిల్ 23 న చివరి అంటే లాస్ట్ వర్కింగ్ డే గా ప్రకటించి, ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ సెలవలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రతీ ఏడాది లానే ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సమ్మర్ […]

ప‌వ‌న్‌కు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత‌..లైన్‌లో మ‌రో ప్రాజెక్ట్‌!‌‌‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న రీ ఎంట్రీ చిత్రం `వ‌కీల్ సాబ్‌` విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో భారీ క‌లెక్ష‌న్స్ కూడా రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడిక్‌ డ్రామా చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. అలాగే ఈ మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌ కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి అయిన వెంట‌నే […]

మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..`స‌ర్కార్‌..` టీజ‌ర్‌పై క్రేజీ అప్డేట్‌!

టాలీవుడ్ సైప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజ‌ర్‌కు సంబంధించి ఓ క్రేజీ […]

భార‌త్‌లో క‌రోనా టెర్ర‌ర్‌..3 ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,14,835 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,30,965 కు చేరుకుంది. అలాగే నిన్న 2,104 మంది […]

తెలంగాణ‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు..పెరిగిన మ‌ర‌ణాలు!

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న ఐదు వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం..క‌రోనాతో పెద్ద కుమారుడు మృతి!

కంటికి క‌నిపించకుండా ఎంద‌రో ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న ప్రాణాంత‌క‌ క‌రోనా వైర‌స్.. సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. సామాన్యుల‌నే కాదు.. సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఇలా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. తాజాగా సీపీఎం సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో క‌రోనా తీవ్ర విషాదాన్ని నింపింది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుముూశారు. 34 ఏళ్ల వయసున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా సోక‌గా.. […]