ఆ విష‌యంలో త‌గ్గేది లే అంటున్న పూజా హెగ్డే?!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పూజా.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌కు ఎదిగింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళ్‌, క‌న్నడ చిత్రాల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. అయితే వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న పూజా.. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో త‌గ్గేది లే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ట‌. అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానని కరాఖండిగా చెప్పేస్తోందట. ఇటీవల ఓ […]

భార‌త్‌లో మ‌రింత త‌గ్గిన క‌రోనా కేసులు..553 మృతి!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు మ‌రింత త‌గ్గాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 34,703 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా […]

నెట్‌ప్లిక్స్‌లో వంట‌ల‌క్క‌..త్వ‌ర‌లోనే `కార్తీక దీపం`కు శుభం కార్డు?!

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియ‌ల్స్‌లో మొద‌ట ఉండేది కార్తీక దీప‌మే. ప్రతి రోజు రాత్రి 7:30 గంటలు అయిందంటే చాలు.. ఈ సీరియ‌న్‌ను చూసేందుకు ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా అంద‌రూ టీవీలకు అతుక్కుని పోతుంటారు. అంత‌లా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకుంది కార్తీక దీపం. బుల్లితెర చరిత్రలో ఈ సీరియ‌ల్ కనీవినీ ఎరుగని రేటింగ్స్ సాధించ‌డానికి ముఖ్య కార‌ణం వంట‌ల‌క్క అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ సీరియ‌ల్‌కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ […]

బాలీవుడ్‌కు `యూ ట‌ర్న్‌`..స‌మంత పాత్ర‌లో ఎవ‌రంటే?

కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ చిత్రాన్ని అదే టైటిల్‌తో తెలుగులోనూ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో అక్కినేని స‌మంత లీడ్ రోల్ పోషించింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీల‌క పాత్ర పోషించ‌గా..పవన్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మిస్టరీ థిల్లిర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఇక్క‌డ కూడా మంచి విజ‌య‌మే సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. ఆరిఫ్‌ ఖాన్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రంలో నటి పూజా బేడి కుమార్తె అలయా […]

`స‌లార్‌` స్పెష‌ల్ సాంగ్‌..ప్ర‌భాస్‌తో చిందేయ‌నున్న చంద‌మామ‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం స‌లార్‌. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా.. మ‌ళ్లీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ నెట్టింట చక్క‌ర్లు కొడుతోంది. […]

`మా` ఎన్నిక‌లు..ఊహించ‌ని షాకిచ్చిన మురళీ మోహన్‌!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఎన్న‌డూ లేని విధంగా ఈ ఏడాది మా అధ్యక్ష పదవిని ద‌క్కించుకునేందుకు ఏకంగా ఐదుగురు అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగారు. మొద‌ట విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పోటీలో ఉన్న‌ట్టు ప్ర‌క‌టించ‌గా.. ఆ వెంట‌నే మంచు విష్ణు, జీవిత రాజ‌శేఖ‌ర్‌, న‌టి హేమ మ‌రియు సీవీఎల్‌ నరసింహారావు అధ్యక్ష రేసులో వ‌చ్చేశారు. ఇక ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే అభ్యర్థులు […]

`ఆహా`లో విజయ్ సేతుపతి `విక్రమార్కుడు`..విడుద‌ల ఎప్పుడంటే?

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా.. ప్ర‌తి వారం కొంత కంటెంట్‌తో ముందుకు వ‌స్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను సూప‌ర్ ఎంట‌ర్టైన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఓవైపు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు అందిస్తూనే మరోవైపు అనువాద చిత్రాల‌తో అల‌రిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు మ‌రో సూప‌ర్ హిట్ మూవీని ప్రేక్ష‌కుల కోసం తీసుకురాబోతోంది. 2018లో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుపతి నటించిన జుంగా సినిమా ఇప్పుడు తెలుగులో రాబోతుంది. తమిళ్ సక్సెస్ అయిన ఈ చిత్రాన్ని విక్రమార్కుడు […]

సూప‌ర్ కాంబో..మ‌హేష్‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న లేడీ సూపర్ స్టార్!?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్‌.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. అయితే […]

గుడ్‌న్యూస్‌: ఏపీలో 2వేల‌కు ప‌డిన క‌రోనా కేసులు..తాజా లెక్క ఇదే!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న కూడా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు భారీగా త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]