మొద‌లైన `స‌ర్కారు వారి పాట‌` షూట్‌..వైర‌ల్‌గా లొకేష‌న్ స్టిల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. మ‌ళ్లీ తాజాగా మొద‌లైంది. ఇప్ప‌టికే దుబాయ్‌లో ఈ చిత్రం మొద‌టి షెడ్యూల్ పూర్తి కాగా.. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ […]

ఏపీలో 2వేల‌కు లోపుగా క‌రోనా కేసులు..22 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న కూడా క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]

ఇన్స్ అఫీషియల్:అమెజాన్ ప్రైమ్‌లో `నార‌ప్ప‌`..రిలీజ్ డేట్ ఇదే!

విక్ట‌రీ వెంక‌టేష్, ప్రియ‌మ‌ణి జంట‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. త‌మిళంలో హిట్ అయిన అసుర‌న్‌కు ఇది రీమేక్‌. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కాబోతోందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ […]

తెర‌పైకి `దాస‌రి` బ‌యోపిక్‌..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

దివంగ‌త దర్శకుడు, రచయిత, నిర్మాత, న‌టుడు, రాజకీయనాయకుడు దాసరి నారాయణరావు అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్ బుక్‌లో స్థానం ద‌క్కించుకున్న దాస‌రి.. మంచి న‌టుడుగానూ ఫ్రూవ్ చేసుకున్నారు. మ‌రోవైపు రాజకీయాల్లోనూ రాణించి త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి గొప్ప వ్య‌క్తి జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు ధవల సత్యం ఈ సినిమాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇమేజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తాడివాక రమేష్‌ నాయుడు నిర్మించ‌నున్నారు. […]

రాజ‌కీయాల్లోకి ఎప్ప‌టికీ రాను..పార్టీని ర‌ద్దు చేసిన ర‌జ‌నీకాంత్‌!

గత తమిళనాడు ఎన్నికలకు ముందు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ, అనారోగ్య కారణాలతో పొలిటికల్ ఎంట్రీ విష‌యంలో వెనక‌డుగు వేశారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ర‌జ‌నీ రాజ‌కీయాల్లో వ‌స్తున్నారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే త‌న రాజ‌కీయ ఎంట్రీపై వ‌స్తున్న ఊహాగానాల‌కు ర‌జ‌నీకాంత్ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. ఇవాళ అన్ని జిల్లాల‌కు చెందిన ర‌జినీ మ‌క్క‌ల్ మంద్రం ఆఫీసు బేర‌ర్‌ల‌తో భేటీ అయిన ర‌జ‌నీ.. భ‌విష్య‌త్తులో రాజ‌కీయ ప్ర‌వేశం చేయ‌బోన‌ని, […]

`రామారావు`గా వ‌స్తున్న‌ ర‌వితేజ..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రం సెట్స్ మీద ఉండ‌గానే.. శ‌రత్ మండవ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు ర‌వితేజ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ఇటీవ‌లె పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివిల్ చేస్తూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి రామారావు అనే […]

బ‌న్నీతో న‌టించే ఛాన్స్‌..ప‌రువుపోతుంద‌ని నో చెప్పిన డైరెక్టర్‌ బాబీ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా న‌టించే ఛాన్స్ వ‌స్తే.. దాదాపు ఎవ్వ‌రూ వ‌దులుకోరు. కానీ.. ద‌ర్శ‌కుడు కే ఎస్‌.ర‌వీంద్ర అదేనండీ మ‌న బాబీ మాత్రం ప‌రువు పోతుంద‌ని వ‌చ్చిన అవ‌కాశానికి నో చెప్పాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్న బాబీతో ప్ర‌ముఖ రైట‌ర్ చిన్ని కృష్ణకు ప‌రిచయం ఉంది. ఆ ప‌రిచ‌యంతోనే చిన్ని కృష్ణ.. బాబీని రాఘవేంద్ర‌రావు ద‌గ్గ‌ర‌కి తీసుకువెళ్లి ఏదైనా వేషం ఇవ్వాల‌ని కోరార‌ట‌. దాంతో […]

హాస్ప‌ట‌ల్‌లో న‌య‌న్ తండ్రి..పెళ్లికి ఒప్పుకున్న బ్యూటీ?!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గురై కొచ్చిన్‌లోని ఓ ప్రైవేటు హాస్ప‌ట‌ల్‌లో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. నయనతార తండ్రి కురియన్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త్వ‌ర‌గా ప్రియుడు, కోలీవుడు ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌ శివన్‌ను పెళ్లి చేసుకోవాల‌ని న‌య‌న్‌ను కోరుతున్నార‌ట‌. కానీ, ఆమె చేతి నిండా సినిమాలు ఉండ‌డంతో పెళ్లిని ఆల‌స్యం చేస్తూ వ‌చ్చింది. అయితే ఇప్పుడు […]

దేశంలో త‌గ్గుతున్న క‌రోనా కేసులు..724 మంది మృతి!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు మ‌రింత త‌గ్గాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 37,154 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో […]